మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రజక సంక్షేమ సమన్వయ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జిఓ 9 ప్రకారం జిల్లా రజక సంక్షేమ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందని దీనిలో అధికారులు మరియు అనధికారులు [రజక సంఘం సభ్యులు] సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఇది ప్రతి 3 నెలలకొకసారి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రజకుల సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఈ రోజు జరిగిన సమావేశంలో 6 …
Category: Hyderabad-Photo Gallery
నీడలేని నిరుపేద ప్రజలకు నీడను కల్పించే ప్రధాన ఉద్దేశంతో KCR నాయకత్వంలోని తెలంగాణా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శర్మన్ తో కలిసి పలువురు లబ్దిదారులకు JNNURM ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. మూసీనది సుందరీకరణ లో భాగంగా నిర్వాసితులు అవుతున్న సైదాబాద్ మండలానికి చెందిన దాదాపు 368 మందికి మునుగునూర్ ప్రాంతంలో గతంలో నిర్మించిన JNNURM ఇండ్లను కేటాయిస్తున్నట్లు మంత్రి వివరించారు. అందులో భాగంగా ఈ రోజు 10 మంది లబ్దిదారులకు మంత్రి ఇండ్లను కేటాయింపు పత్రాలను అందజేశారు. మిగిలిన నిర్వాసితులకు స్థానిక ప్రజాప్రతినిధుల…
పేదల కోసం నిర్మిస్తున్న రెండు పడకల గదులు (2 bhk) నిర్మాణాలు దేశంలో మరెక్కడా లేవు : మంత్రి కె.టి.ఆర్ ఖైరతాబాద్ ఇందిరా నగర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కె.టి.ఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 03: హైదరాబాద్ నగరంలో పేదల కోసం నిర్మిస్తున్న రెండు పడకల గదుల (2 bhk) నిర్మాణాలు దేశంలో మరెక్కడా, ఏ మహా నగరంలో పేదల ఆత్మ గౌరవంతో కూడిన గృహాలు లేవని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఖైరతాబాద్ లోని ఇందిరా నగర్ కాలనీ లో రూ. 17.85 కోట్ల వ్యయంతో చేపట్టిన 210 2 bhk గృహాలను రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ,…
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం లంగర్ హౌజ్ లోని బాపూఘాట్ ను తెలంగాణ రాష్ట్ర హోమ్ శాఖామాత్యులు మహమూద్ అలీ సందర్శించి గాంధీజీ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.
బాపూఘాట్ లో గాంధీ వర్ధంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎం పి కేశవా రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జూబ్లీ హిల్స్ ఎం ఎల్ ఏ మాగంటి గోపినాథ్, ముషీరాబాద్ ఎం ఎల్ ఏ ముఠా గోపాల్, మేయర్ విజయ లక్ష్మి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. సరిగ్గా 11 .౦౦ గంటలకు సైరన్ మోగగానే బాపూఘాట్ ఆవరణలో గల గాంధీజీ విగ్రహాని కి పూలు సమర్పించి…
73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం హైదరాబాద్ కలెక్టరేటులో ఘనంగా నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ శర్మన్ జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేసారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని అధికారులకు, ఉద్యోగులకు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులకు గణతంత్ర దినోత్సవ శుభాకంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల కృషి ఫలితమే నేడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం అన్నారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు నిబద్దతతో వ్యవహరించాలన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలనీ, హైదరాబాద్ ను ఉత్తమ జిల్లాగా తీర్చిదిద్దెందుకు అందరు పునరంకితులు కావాలని ఆయన…
పేద ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వ స్థలాలను వినియోగించే విధంగా తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణ లో గల తన కార్యాలయంలో హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ , మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ లతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ వెంగళ్ రావ్ నగర్, సనత్ నగర్ డివిజన్ లోని శ్యామల కుంట లలో ఎన్నో సంవత్సరాల నుండి నిరుపేద ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అక్కడ…
బుధవారం కంటోన్మెంట్ ప్రాంతంలోని రసూల్ పుర లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మరియు గన్ బజార్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించారు. వాక్సినేషన్ సెంటర్ ల ఏర్పాటు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆ కేంద్రాలలో ప్రాంట్ లైన్ వర్కర్స్ ఐన పోలీస్ సిబ్బంది, 60 సంవత్సరాలు నిండిన వారికీ , 15 నుండి 18 సంత్సరాల లోపు వారికీ ఈ కేంద్రాలలో టీకా వేస్తున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. అనంతరం బోయిన్ పల్లి యుపిహెచ్సి సందర్శించి అక్కడ టీకా కార్యక్రమాల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటె నా దృష్టికి తీసుకురావలసిందిగా కోరారు. అనంతరం ముషీరాబాదు లోని యు పి హెచ్ సి వాక్సినేషన్…
మహా పుణ్యక్షేత్రం ను తలపించేలా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయ వద్ద అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద 4.48 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మల్టి లెవెల్ పార్కింగ్, షాపింగ్ కాంప్లెక్స్ పనులను నియోజకవర్గ అభివృద్ధి నిధులు 6 లక్షల రూపాయల తో ఏర్పాటు చేయనున్న బోర్ వెల్ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మహిమ కలిగిన బల్కంపేట ఎల్లమ్మదర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని చెప్పారు. అమ్మవారి దర్శనానికి వచ్చే…
హైదరాబాద్ జిల్లాలో వివిధ డిగ్రీ కాలేజీలలో చదువుతున్న విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ కృషి చేయాలనీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో Commissionerate of Colligate Education Development ఆధ్వర్యంలో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. డిగ్రీ కాలేజీలో హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. టీచింగ్ నాన్ టీచింగ్ కు సంబందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ కాలేజీలలో ఎన్ని పోస్టులు ఉన్నాయని, అందులో సిబ్బంది వివరాలు, ఖాళీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలేజీలలో ఎయె కోర్సులు ఉన్నాయి, ఆ కోర్సులలో అడ్మిషన్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. కాలేజి ఆవరణలో హరిత హారం…
మాజీ ప్రధాని స్వర్గీయ పివి నర్సింహా రావు దేశానికి ఎనలేని సేవలు అందించారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
గురువారం పివి 17 వ వర్ధంతి సందర్భంగా పివి మార్గ్ లోని పివి జ్ఞాన భూమి లో గల పివి ఘాట్ పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పివి బహుభాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అని పేర్కొన్నారు. దేశం గర్వించే విధంగా సమర్ధవంతమైన పాలనతో ప్రజాధారణ పొందారని చెప్పారు. తాను తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా దేశం అభివృద్ధి పథంలో వెళుతుందని గుర్తు చేశారు. పివి సేవలకు గుర్తింపు గా తెలంగాణ ప్రభుత్వం…