“భారత దేశ ప్రజలమైన మేము దేశంలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నెలకొల్పుకునేందుకు మరియు పౌరులందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావప్రకటన, స్వేచ్ఛ, సమానత్వం, జాతి ఐక్యతకు, వ్యక్తి గౌరవానికి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు మనకు మనంగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న అంగీకరించుకొని అదిశాసనం చేసుకున్నామని ఇందుకు కట్టుబడి ఉంటామని సత్యనిష్టపూర్వకంగా ప్రమాణం చేస్తున్నట్లు” అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ…
Category: Hyderabad-Photo Gallery
ఫ్లాగ్ డే సందర్బంగా గురువారం తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ ప్రధాన హాలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శర్మన్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ శ్రీ సతీష్ చంద్ర శర్మ ను కలిశారు.
ఫ్లాగ్ డే సందర్బంగా గురువారం తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ ప్రధాన హాలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శర్మన్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ శ్రీ సతీష్ చంద్ర శర్మ ను కలిశారు. వారు ఫ్లాగ్ డే సందర్బంగా చీఫ్ జస్టిస్ శ్రీ సతీష్ చంద్ర శర్మ, హై కోర్ట్ న్యాయమూర్తులు రిజిస్ట్రార్ అఫ్ జనరల్ మరియు ఇతర రిజిస్ట్రార్ లు విరాళాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్ డి ఓ వెంకటేశ్వర్లు అధికారులు…
హైదరాబాద్ నగరాన్ని రాజకీయాలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి అభివృద్ధికి కృషి చేయాలనీ గురువారం జరిగిన దిశా (డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) కేంద్ర ప్రతిపాదిత పథకముల నిర్వహణలో రెండవ సారి జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర సాంస్కృతిక మరియు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఈ సమావేశంలో కేంద్ర ప్రతిపాదిత పధకములు హైదరాబాద్ జిల్లాలో ఏ మేరకు అమలవుతున్నాయో దిశా కమిటీ చైర్ పర్సన్ గా సమీక్షించారు. ఈ కమిటీ కి కేశవ రావు ఎం పి రాజ్యసభ, అసదుద్దీన్ ఒవైసి ఎం పి హైదరాబాద్, కో చైర్మన్లు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ మెంబర్ సెక్రటరీ గాను, ఎం ఎల్ ఏ లు, చైర్ పర్సన్ నామినేటెడ్ చేయబడిన 4 గురు సభ్యులు మరియు కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖచే నామినేట్…
టీకా తీసుకోని వారు అపోహలు వీడండి కోవిద్ టీకా తీసుకోండి – అసదుద్దీన్ ఒవైసి
కోవిద్ టీకా విషయంలో అపోహలు వీడాలని వెంటనే టీకాను వేయించుకోవాలని హైదరాబాద్ ఎం పి అసదుద్దీన్ ఒవైసి పిలుపునిచ్చారు. నగరంలోని పాతబస్తీలో కోవిద్ టీకా వేసుకొని వారు అధిక శాతం ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చూపుతున్నాయని తెలిపారు. పాతనగరం సంతోష్ నగర్ డివిజన్ కు చెందిన కాలంధర్ నగర్ సామజిక భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిద్ టీకా కార్యక్రమం ప్రారంభ సమయంలో తాను మొదటి టీకా వేయించుకున్నా…
స్థానిక నాయకులూ టీకా విషయంలో సహాయ సహకారాలను అందించండి – శర్మన్ జిల్లా కలెక్టర్
బుధవారం సంతోష్ నగర్ డివిజన్ కు చెందిన హస్నాబాద్ బస్తీలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ ఇంటింటికి తిరిగి టీకాల పై అవగాహనా కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీకా విషయంలో పాతబస్తీలో అపోహలను దూరం చేసేందుకు స్థానిక నాయకులూ డివిజన్ కార్పొరేటర్లు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్య అధికారులు, కార్యకర్తలు ఇంటింటి సర్వేలో తమకు ఎదురవుతున్న సమస్యలను కలెక్టర్ కు వివరించారు. పాతబస్తీలో చాల వరకు స్థానికులు టీకా విషయంలో ఆరోగ్య కార్యకర్తలకు సహకరించడం…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 6 , 7 , 8 వార్డులోని వాక్సినేషన్ సెంటర్ లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ మంగళ వారం సందర్శించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు స్వచ్చందంగా వచ్చి రెండవ డోసు వాక్సిన్ వేయించుకోవాలని, అధికారులు ప్రజలు వాక్సిన్ వేయించుకునేలా చేయాలనీ వంద శాతం వాక్సినేటెడ్ నగరంగా తయారు చేయాలన్నారు. ఈ ప్రాంతంలో అధికారులు ఇంటింటి సర్వే ను త్వరగా పూర్తీ చేయాలనీ వాక్సిన్ రెండవ డోసు వేయించుకొని వారిని గుర్తించి వారు వాక్సినేషన్ సెంటర్ కు వచ్చి వాక్సిన్ తీసుకునే విదంగా ప్రోత్సయించాలని చెప్పారు.…
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని రిటైల్ మద్యం షాపులకు లాటరీ ద్వారా పూర్తి పారదర్శకంగా ఎంపిక కార్యక్రమాన్నీ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ శర్మన్ తెలిపారు.
శనివారం హైదరాబాద్ నగరంలోని అంబర్ పెట్ లో గల మహారణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన లాటరీ కార్యక్రమంలో హైదరాబాద్ రెవిన్యూ లోని సికింద్రాబాద్ జిల్లా కు రఘునందన్ రావు సెక్రటరీ అగ్రికల్చర్ మరియు హైద్రాబాద్ కు జిల్లా కలెక్టర్ శర్మన్ ముఖ్య అతిధులుగా హాజరై లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తిగా పారదర్శకతతో మద్యం దుకాణాల ల్యాటరీని నిర్వహించామని, హైదరాబాద్…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నవంబర్ 21 న నిర్వహించనున్న కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ మరియు ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలనీ హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ లో 21 న కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ (14 ) కేంద్రాలలో 6000 మంది అభ్యర్థులు మరియు ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్ (1 ) కేంద్రాలలో 110 మంది అభ్యర్థులు పరీక్ష వ్రాస్తున్నారని తెలిపారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో ఉదయం 9.30 గంటల నుండి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు మరియు ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్ ఉదయం 9.00 గంటల నుండి 12 గంటల వరకు,…
ఈరోజు 13-11-2021 నాడు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూ ఢిల్లీ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైద్రాబాద్ వారి అద్వర్యంలో మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ మరియు సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవాధికార సంస్థ, హైద్రాబాద్ వారు సమనవ్యయంతో పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్ మరియు ఔట్రీచ్ కాంపెయిన్, ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈరోజు శ్రీ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియం లో న్యాయ సేవల శిభిరము పేదరిక నిర్ములన పథకం (మొడ్యూల్ కాంప్) నిర్వహించటం జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ హై కోర్టు జస్టిస్ శ్రీమతి సుమలత గారు ముఖ్య అతిధితి గా హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో శ్రీమతి సుమలత గారు మాట్లాడుతూ, వివేకానంద స్వామి గారి గురించి వారు చేసిన గొప్ప పనుల గురించి, వారి వల్ల మన దేశానికీ వచ్చిన గొప్ప పెరు గురించి వివరించారు, అలాగే న్యాయ సేవాధికార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు ప్రతి ఒక్కరికి న్యాయం చేరువలో ఉండాలని, ఇప్పటికే చాలా మంది న్యాయ సేవాధికార…
వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పధకాలు అర్హులైన లబ్దిదారులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖాధికారులు సంయుక్తంగా కృషి చేయాలనీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ తెలిపారు.
గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పధకాల అమలులో లబ్దిదారులకు ఎటువంటి జాప్యం లేకుండా రుణ వితరణ చేసి రాష్ట్రంలోనే ప్రధమంగా నిలవాలని కోరారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేసారు. సంక్షేమ శాఖాధికారులు వారికీ నిర్దేశించిన బ్యాంకులలో పెండింగ్లో ఉన్న గ్రౌండింగ్ కానీ యూనిట్లను పరిష్కరించేందుకు గాను బ్యాంకు అధికారులను తరచుగా సంప్రదిస్తూ గ్రౌండింగ్ పూర్తీ…