Category: Jayashankar Bhupalpally-Photo Gallery

*ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెక్కుల పంపిణీ* జయశంకర్ భూపాలపల్లి,ఏప్రిల్ 14: ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు గురువారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డిలు ఎక్స్ గ్రేషయా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన రైతుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ఆరు లక్షల రూపాయల చొప్పున గురువారం 12 రైతు…

*డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ జీవితం అందరికీ ఆదర్శం:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా* జయశంకర్ భూపాలపల్లి,ఏప్రిల్ 14: డా. బాబా సాహెబ్ జీవితం అందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా గురువారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా లోని అంబేడ్కర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డిలతో కలిసి పూలమాలలు…

 చిన్నకాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెండింగ్ భూసేకరణ పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఓఎస్డి మనోహర్ తో కలిసి జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణపై రెవిన్యూ, ఇరిగేషన్, ల్యాండ్ సర్వే అధికారులతో సమీక్షించి మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న చిన్నకాలేశ్వరం…

  సంయుక్తంగా సర్వే నిర్వహించి పందిపంపుల ఫారెస్ట్, రెవెన్యు భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఫారెస్ట్ మరియు రెవిన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఫారెస్ట్ మరియు రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూపాలపల్లి మండలం పందిపంపుల ఫారెస్ట్, రెవెన్యూ భూమి గుర్తింపు వేగవంతం చేసి బుధవారం రెవెన్యూ మరియు ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి శాఖల భూములను గుర్తించి…

భూపాలపల్లి రన్ కార్యక్రమాన్ని ప్రారంభించి భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్. దివాకర, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్రా జ్యోతిలతో కలిసి  5 కె రన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గారు అనంతరం 5k, 10k, మరియు 21k  రన్ విజేతలకు బహుమతులను అందజేశారు.

 మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి  అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని సింగరేణి ఫంక్షన్ హాల్ లో  మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ఇతర ప్రజా ప్రతినిధులు మరియు అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.    ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్రా…

 నూతనంగా నిర్మించిన సిడిపిఓ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి  మరియు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని  సుభాష్ కాలనీలో 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిడిపిఓ కార్యాలయం భవనాన్ని  ప్రారంభించారు. అనంతరం కార్యాలయ  ఆవరణలో జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి  మరియు జిల్లా కలెక్టర్ లకు ఇన్చార్జి డబ్ల్యుఓ శామ్యూల్  పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. గతంలో  జరిగిన…

 11 నుంచి 20 సంవత్సరాల లోపు బాలికల విద్యా, ఆరోగ్య వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్య, వైద్యం, పౌష్టికాహార కల్పన తదితర ముఖ్యమైన రంగాలలో జిల్లాను అభివృద్ధి సాధించాలనే లక్ష్యంగా  ఆస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రాంలో జిల్లాను ఎంపికచేసి నీతి అయోగ్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నoదున జిల్లాలోని 11…

 భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం  జరిగిందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తో కలిసి మంజూర్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణంలోని మంజూరు నగర్ ప్రాంతంలో సింగరేణి…

 ప్రభుత్వ సహకారంతో మారుమూల పల్లెల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ పలిమెల మండలం ముక్నూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామం నుండి పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్డు లేక ఇబ్బంది కలుగుతుందని  రోడ్డు  సౌకర్యం కల్పించాలని రైతుబంధు సమితి సభ్యులు మరియు రైతులు కోరగా గ్రామం నుండి గోదావరినది రూట్ లో పంటపొలాల వరకు  2 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్డును సాంక్షన్ చేస్తున్నానని త్వరలోనే పంచాయతీరాజ్…