కామారెడ్డి, ఆగస్టు 17, 2023 గాంధీ చలన చిత్రం తిలకించడానికి విద్యార్థిని,విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో వస్తున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిలో జాతీయ భావం పెంపొందించేందుకె రాష్ట్ర ప్రభుతం ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నదని అన్నారు. గురువారం కామారెడ్డిలోని 4 సినిమా హాళ్లు, బాన్సువాడలో 2 థియేటర్లు, బిచ్కుంద,పిట్లం,నాగిరెడ్డి పేట లోని ఒక్కో సినిమా హాళ్ళో చిత్రం ప్రదర్శించగా 26 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 5,072…
Category: Kamareddy
మత్తు పదార్థాల పట్ల ఎవరు బానిసలు కాకుండా అవగాహన కల్పించడంతో పాటు వాటిని సమూలంగా అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు
కామారెడ్డి, ఆగస్టు 17, 2023 పత్రిక ప్రకటన మత్తు పదార్థాల పట్ల ఎవరు బానిసలు కాకుండా అవగాహన కల్పించడంతో పాటు వాటిని సమూలంగా అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జిల్లా స్థాయి లో ఏర్పాటు చేసిన నార్కో సమన్వయ కమిటీ (NCORD) మూడవ సమావేశంలో మాట్లాడుతూ ఆబ్కారీ, పొలిసు, రవాణా, అటవీ, వ్యవసాయ,…
రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియం లో మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవం సంధర్భంగా రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని రైతు బంధు, రైతు భీమా తో పాటు 24 గంటల ఉచిత్ విద్యుత్, సాగు జలాలు అందించి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేసి ఆదుకుంటుందని తెలిపారు. తద్వారా…
నర్సన్ పల్లి బైపాస్ వద్ద 61 లక్షల వ్యయంతో నిర్మించిన కామారెడ్డి ప్రవేశ ద్వారం ఆర్చ్ ni manthri
రాష్ట్ర ఐ.టి. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పరిశ్రమల శాఖామాత్యులు తారక రామా రావు సోమవారం కామారెడ్డి, యెల్లారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో సుమారు 60 కోట్ల వ్యయం గల పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. ముందుగా నర్సన్ పల్లి బైపాస్ వద్ద 61 లక్షల వ్యయంతో నిర్మించిన కామారెడ్డి ప్రవేశ ద్వారం ఆర్చ్ ను ప్రారంభించారు.…
860 వి.ఆర్.ఏ. లకు శుక్రవారం మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు
వివిధ శాఖలకు కేటాయించిన 860 వి.ఆర్.ఏ. లకు శుక్రవారం మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిలాల్లో 1303 మంది వి.ఆర్.ఏ.లకు 860 మందికి విద్యార్హతల ఆధారంగా 19 శాఖలలో ఛైన్మన్, హెల్పేర్, జూనియర్ అసిస్టెంట్, లష్కర్, ఆఫీస్ సబార్డినేట్, పబ్లిక్ హెల్త్ వర్కర్స్, రికార్డ్ అసిస్టెంట్, వాచ్ మెన్ లుగా నియామకపత్రాలు అందజేయనున్నామన్నారు. మిగతా వారిని ఇతర జిల్లాలకు కేటాయించనున్నామని చెప్పారు. గురువారం అధికారులతో నిర్వహించిన…
ప్రతి ఒక్కరు వారంలో రెండు రోజులు ధరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
చేనేత వస్త్రాలు సౌకర్యవంతంగా ఉంటాయని, శరీరానికి ఎంతో చల్లదనాన్ని అందిస్తాయని, ప్రతి ఒక్కరు వారంలో రెండు రోజులు ధరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్ లో చేనేత జౌళి శాఖా, డిఆర్ డిఓ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్ ను అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నేటి తరానికి అనుగుణంగా చేనేత కార్మికులు సరికొత్త ఆలోచనలతో…
వ్యవసాయ గణన సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయాధికారులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ గణన 2021-22 పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ నెల 28 వరకు వ్యవసాయ గణన పూర్తి చేయాలని సూచించారు. మొదటిసారిగా సాంకేతికతను వినియోగించి ఖచ్చితమైన సమాచారం సేకరించేందుకు జిల్లా ప్రణాళిక, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సర్వే చేపట్టామన్నారు. ఏ.ఈ.ఓ.లు క్లస్టర్ పరిధిలోని గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన వివరాలు సేకరించాలని…
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లాకు కేటాయించిన 3. 96 లక్షల మొక్కల పెంపకాన్ని చేపట్టడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారికి తెలిపారు. నీటిపారుద
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లాకు కేటాయించిన 3. 96 లక్షల మొక్కల పెంపకాన్ని చేపట్టడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారికి తెలిపారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో దశాబ్ది సంపద వనాల కింద 8 ప్రాంతాలకు గాను 7 ప్రాంతాలలో మొక్కలు నాటడం పూర్తయిందని, మొక్కల నాటే పనులను వారం రోజుల వ్యవధిలో పూర్తి చేస్తామని అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి…
చేనేత వస్త్రాలను ధరించి ప్రజలు, నేత కార్మికులకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు
చేనేత వస్త్రాలను ధరించి ప్రజలు, నేత కార్మికులకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.డి ఆర్ డి ఒ, చేనేత, జౌళి శాఖ అద్వర్యంలో సోమవారం కామారెడ్డి రోటరీ క్లబ్ లో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవం వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వారానికి రెండు రోజులు అధికారులు చేనేత వస్త్రాలను ధరించాలని సూచించారు. చేనేత కార్మికులు పోటీతత్వం అలవర్చుకోవాలని అన్నారు. చేనేత వారసత్వ సంపదను కాపాడాలన్నారు. చేనేత కార్మికులు…
జిల్లా రెడ్ క్రాస్ సంస్థ సేవలు నిరంతరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
జిల్లా రెడ్ క్రాస్ సంస్థ సేవలు నిరంతరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సి.పి.ఆర్. కార్యక్రమాలను జిల్లా, డివిజన్ స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి మండలంలో జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీ, యూత్ రెడ్ క్రాస్ సొసైటీ,…