Category: Khammam-Press-Releases

ప్రచురణార్ధం మే 17 ఖమ్మం: ఓటరు జాబితాలో నూతన నమోదులు, మార్పులు, చేర్పులకు సంబంధించి అందిన క్లెయిమ్ లపై  సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు /జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పెండింగ్ క్లయిమ్స్, నూతన ఈ.వి.ఎం గిడ్డంగుల నిర్మాణాలు, వాటి భద్రతాచర్యలు నెల , త్రైమాసిక నివేదికలు సకాలంలో సమర్పించుట, వివిధ రాజకీయ పార్టీల నుండి అందిన పిటీషన్ల…

ప్రచురణార్ధం. మే 17 ఖమ్మం: వానా కాలం పంట సీజన్కు జిల్లా రైతాంగానికి అవసరమైన విత్తనాల పంపిణీకి ముందస్తు ప్రణాళికతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజా సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, జిల్లాలోని విత్తన కంపెనీల డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో వానాకాలం పంట సీజన్ విత్తన పంపిణీ ముందస్తు చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లాలో…

ప్రచురణార్ధం మే 16 ఖమ్మం మారుమూల గ్రామ ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు మరింత సమర్ధవంతంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, దిశ కమిటీ చైర్మన్ నామా నాగేశ్వరరావు. అధికారులకు సూచించారు. సోమవారం ఖమ్మం నగరం ఎన్.ఎస్.పి క్యాంపు డి.పి.ఆర్.సి. భవన సమావేశ మందిరంలో కేంద్రం నుంచి జిల్లాకు మంజూరయ్యే పథకాలు, నిధులుపై జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశం చైర్మన్ నామా నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్…

ప్రచురణార్ధం. మే 14 ఖమ్మం ఖమ్మం జిల్లా బి.సి యువతకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యెందుకు, ఉద్యోగ అవకాశలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బి.సి స్టడీ సర్కిల్లను ఏర్పాటు చేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ . అజయ్ కుమార్, రాష్ట్ర బి.సి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్లు పేర్కొన్నారు. శనివారం ఖమ్మం నగరం తెలంగాణ తల్లి సర్కిల్లో రూ. 3 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించిన బి.సి…

ప్రచురణార్ధం 12 ఖమ్మం:– పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను వైద్యాధికారులు తమ విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లింగాల కమలరాజు సూచించారు. గురువారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిట్ చైర్మన్ లింగాల కమలరాజు అధ్యక్షతన జరిగిన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన అనుపత్రికి అనుసంధానంగా మెడికల్…

ప్రచురణార్ధం మే 11 ఖమ్మం – మన ఊరు-మనబడి, మన బస్తీ మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అన్ని హంగులతో తీర్చిదిద్ది కార్పోరేట్ స్థాయి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుచున్నదనే విషయాన్ని విస్తృతంగా అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నమోదు సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ విద్యా శాఖ అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. బుధవారం సత్తుపల్లి నియోజకవర్గం: పెనుబల్లి మండలం టేకులపల్లి ప్రైమరీ హైస్కూల్ వి.యం. బంజర ప్రభుత్వ…

  ప్రచురణార్ధం మే 11 ఖమ్మం: . దళితబంధు లబ్దిదారులు తమకు వచ్చిన పని, తమకు నచ్చిన పనికి సంబంధించిన రంగాలలో యూనిట్లు స్థాపించుకొని లక్షాధికారి నుండి కోటీశ్వరులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెంలో దళితబంధు యూనిట్లు గ్రౌండింగ్ అయిన లబ్దిదారులతో బుధవారం వారిరువురు ముఖాముఖి భేటి అయి యూనిట్ల స్థాపన, నిర్వహణ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా…

ప్రచురణార్ధం మే 10 ఖమ్మం: జిల్లాలో (పాలియేటివ్ కేర్ ) ఉపశమన సంరక్షణ ప్రభుత్వ వైద్యసేవలను మరింత మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఉపశమన సంరక్షణ వైద్యసేవలు, 108 వైద్యసేవలు, ఆరోగ్యశ్రీ, తదితర వైద్య సేవలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలను పెంచాలని, రోజుకు కనీసం రెండు, మూడు శస్త్ర చికిత్సలు…

ప్రచురణార్ధం మే 10 ఖమ్మం: నిరంతరాయ విద్యుత్తు సరఫరాలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించిందని, జిల్లా ప్రజలకు నిరంతరాయంగా, లో-వోల్టేజీ సమస్య లేకుండా విద్యుత్తు సరఫరాకు గాను ప్రత్యేకంగా సబ్ స్టేషన్ల నిర్మాణాలు ఏర్పాటు చేసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం నగరంలోని టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాల వద్ద 2 కోట్ల వ్యయంతో అదేవిధంగా రాపర్తి నగర్లో మరో 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన…

ప్రచురణార్ధం మే,09 ఖమ్మం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాయాంలోనే మధిర పట్టణం అభివృద్ధి దిశగా పయనిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలంలో సోమవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసారు. మధిర మండలం ఖమ్మంపాడు గ్రామంలో రూ.42 లక్షల వ్యయంతో నిర్మించిన 5 వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం…