Category: Kumuram Bheem-Press-Releases

ఆర్. ఓ. ఎఫ్. ఆర్. చట్టం ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హత గల గిరిజనులకు పోడు భూములు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయితీ కార్యదర్శులతో పోడు పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారి జాబితాను సమీక్షించారు.…

  జిల్లాలోని గిరిజన సంక్షేమ, మైనారిటీ, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖల పరిధితో పాటు ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలలలో విద్యనుభ్యసిస్తున్న అర్హత గల ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి జిల్లా అధికారులు, ప్రైవేటు…

  బానిస సంకెళ్ల నుండి విముక్తి పొంది దేశానికి స్వాతంత్రం సిద్ధించిన అనంతరం డా. బి. ఆర్. అంబేద్కర్ సారధ్యంలో మహనీయుల రూపొందించిన రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులను కల్పించిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన ఆవరణలో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు గౌరవ వందనం అనంతరం జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, ఎస్. పి. సురేష్ కుమార్, అదనపు ఎస్.పి. లు…

ప్రజాస్వామ్యంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ఓటు హక్కు ఎంతో ఆవశ్యకత కలిగి ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి తో కలిసి జిల్లా అధికారులతో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుండి ప్రారంభమై జనకాపూర్, కొమురం భీమ్ చౌక్, అంబేద్కర్ చౌక్లమీదుగా తిరిగి కలెక్టరేట్ భవనానికి బైక్ ర్యాలీ నిర్వహించి జిల్లా అధికారులతో, ఉద్యోగులతో జాతీయ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.…

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రజల కంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన…

బస్తీ దవఖానతో ప్రజలకు అందుబాటులోకి వైద్యం రానుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బస్తి దవఖానను అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పెయి, జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బస్తీ దవఖాన వల్ల వైద్యం మరింత అందుబాటులోకి రానుందన్నారు. పట్టణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం…

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం ద్వారా ప్రజలకు కంటి సమస్యలు దూరం అవుతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఎస్. పి. సురేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు…

  జిల్లాలో ఈనెల 19వ తేదీ నుండి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రణాళిక బద్ధంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డితో కలిసి కంటి వెలుగు 2వ విడత కార్యక్రమ నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులు, మండల పరిషత్ అభివృద్ధి…

కంటి వెలుగు 2వ విడత కార్యక్రమ నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించే విధంగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర డి.జి.పి., ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు, వైద్య, పంచాయతీ, పురపాలక సంఘాలు, తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి…

ప్రజల కంటి సమస్యలను దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం ఈనెల 18వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు సమిష్టిగా కృషిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి కంటి వైద్యులు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఇతర అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం పై…