Category: Kumuram Bheem-What’s Happening

జిల్లాలో భూ సంబంధిత సమస్యలను మండల పరిధిలోనే పరిష్కరించాలని, పరిష్కారం వీలులేని కఠిన సమస్యలను జిల్లాస్థాయికి పంపించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో జిల్లా రెవెన్యూ అధికారి సురేష్ తో కలిసి ధరణి, మీ-సేవ, కళ్యాణలక్ష్మి కార్యక్రమాలపై రాజస్వ మండల అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ కార్యాలయం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి కార్యక్రమం ద్వారా భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని,…

జిల్లాలోని వట్టివాగు, అడ ప్రాజెక్టుల క్రింద చేపట్టిన కొమురం భీం ఎడమ కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ అన్నారు. మంగళవారం జిల్లాలోని కొమురం భీం ఎడమకాలువ పనులను నీటిపారుదల శాఖ అధికారులు, నవయుగ కాంట్రాక్టర్స్ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యటన సందర్భంలో పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తిచేయాలని సూచించడంతో నవయుగ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో పనులు మొదలు…

ప్రజావాణి లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం లో గల కలెక్టర్ చాంబర్లో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సిర్పూర్ (టి) మండల కేంద్రానికి చెందిన ఎం. ఎ. సలీం 2016లో ప్రభుత్వం చేపట్టిన పంచాయితీ కార్యదర్శుల నియామకంలో తనకు రావలసిన ఉద్యోగం వేరొకరు చేస్తున్నారని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ…

జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అన్ని ప్రభుత్వ శాఖలకు కేటాయించిన నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు వరుణ్ రెడ్డి, రాజేశం లతో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. రైతుల సంక్షేమం…

ప్రజలకు సేవలను మరింత సులభతరం చేసే విధంగా అన్ని ప్రభుత్వ శాఖలతో జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించడం జరుగుతుందని, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ జిల్లాను అన్ని రంగాలలో ముందంజలో ఉంచే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి జిల్లా పంచాయతీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…

వేసవి కాలం అయినందున జిల్లాలో నీటి ఎద్దడి సమస్య లేకుండా ప్రజలందరికీ త్రాగు నీరు అందించే విధంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, గ్రామీణ నీటిపారుదల శాఖ ఈ. ఈ. వెంకటపతితో కలిసి త్రాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం అడ ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటు చేయనున్న బోటింగ్ కోసం రాజస్వ మండల అధికారి దత్తు, తహసిల్దార్ పోచయ్యతో కలిసి సంబంధిత భూమిని పర్యాటక శాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అడ ప్రాజెక్టు పరిధిలో సందర్శకుల కోసం బోటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, జిల్లాలో…

భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన సహజ వాయువు అందించడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడేలా ప్రభుత్వం చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమ నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో హరితహారం కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్యక్రమం లక్ష్యాన్ని…

దళితుల అభ్యున్నతి, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ని జన కపూర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన దళిత బంధు అవగాహన సదస్సులో షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ అధికారి సజీవన్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో భాగంగానే దళితుల…

జిల్లాలో మే 6వ తేదీ నుండి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు ఎస్.పి. (అడ్మిన్) అచ్చేశ్వరరావుతో కలిసి ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలీస్, వైద్య, విద్య, రవాణా,…