@ మన ఊరు -మనబడి పనులను వేగవంతం చేయాలి @ ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్యను పెంచండి @ మండల స్థాయి కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి -జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మన ఊరు- మనబడి కింద చేపట్టిన పాఠశాల పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ…
Category: Mahabubnagar-Press Releases
అడ్డాకుల మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
@ అడ్డాకుల మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు @ తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ @ ధరణి నిర్వహణ, కంటి వెలుగు పై ఆరా @ ప్రభుత్వ కార్యక్రమాలపై మండల స్థాయి అధికారులకు సూచనలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మండల స్థాయిలో ఆయా ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు మెరుగైన విధంగా సేవలందించాలని జిల్లా కలెక్టర్ జి .రవి నాయక్ అన్నారు. గురువారం అయన…
ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు.
ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా కొన్ని ఫిర్యాదులను మండల తహసిల్దారులు, ఎంపీడీవోలతో మాట్లాడుతూ సంబంధిత ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జిల్లా అధికారుల ద్వారా పరిష్కారమయ్యే ఫిర్యాదులపై కూడా ఆయా జిల్లా అధికారులను తన దగ్గరకు పిలిపించుకొని ఫిర్యాదుదారు ఎదురుగానే…
ప్రజలలో సరైన ఆర్థిక వ్యవహారాల నిర్వహణ విషయమై అవగాహన కల్పించేందుకుగాను ఈనెల 12 నుండి ఫైనాన్షియల్ లిట్రసి వీక్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ తెలిపారు.
ప్రజలలో సరైన ఆర్థిక వ్యవహారాల నిర్వహణ విషయమై అవగాహన కల్పించేందుకుగాను ఈనెల 12 నుండి ఫైనాన్షియల్ లిట్రసి వీక్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ తెలిపారు. ఫైనాన్షియల్ లిటరసీ వీక్ పై రూపొందించిన గోడపత్రికను ఆయన సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. అంతేకాక ఆర్థిక వ్యవహారాల నిర్వహణపై ఆర్బిఐ రూపొందించిన షార్ట్ ఫిలిమ్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలో ఆర్థిక నిర్వహణ పట్ల…
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో మాదిరిగానే మండల స్థాయిలో కూడా ప్రతి సోమవారం ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మండల అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో మాదిరిగానే మండల స్థాయిలో కూడా ప్రతి సోమవారం ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మండల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు . ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో తహసిల్దారులు, ఎంపీడీవోలు ప్రజల వద్దనుండీ పిర్యాదులను స్వీకరించడమే కాకుండా…
సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేక కంటి వెలుగు శిబిరం ప్రారంభం.
@ సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేక కంటి వెలుగు శిబిరం ప్రారంభం. @ ఉద్యోగులు కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాలు, గ్రామాలలో ఉంటూ ఐడివోసి లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు కంటి వైద్య పరీక్షల కోసం సెలవు పెట్టి వారి వారి…
సారిక టౌన్ షిప్, పోతుల మడుగు టౌన్ షిప్ లే- అవుట్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు.
సారిక టౌన్ షిప్, పోతుల మడుగు టౌన్ షిప్ లే- అవుట్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు. మంగళవారం ఆయన భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సారిక టౌన్ షిప్ ను, అదే విధంగా భూత్పూర్ మండలం పోతులమడుగు వద్ద ఉన్న పోతులమడుగు టౌన్ షిప్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెండు టౌన్షిప్లలో ఏర్పాటుచేసిన ఫ్లాట్లు, ఇప్పటివరకు ప్లాట్ల కు నిర్వహించిన వేలం, మిగిలిపోయిన ప్లాట్ల వివరాలు అడిగి…
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన ఈవీఎం గోడౌన్ వద్ద భద్రత, సిబ్బంది హాజరు ఏప్పటిలాగే ఉండాలని అలాగే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ అన్నారు .
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన ఈవీఎం గోడౌన్ వద్ద భద్రత, సిబ్బంది హాజరు ఏప్పటిలాగే ఉండాలని అలాగే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ అన్నారు . ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెల ఈవీఎంలు భద్రపరిచిన గోదాముల తనిఖీ లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఈవీఎం గోదామును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈవీఎం గోదాము భద్రతకు…
కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన పిల్లల ఆలనా, పాలన వారి భద్రత ప్రభుత్వం చూసుకుంటుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు.
కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన పిల్లల ఆలనా, పాలన వారి భద్రత ప్రభుత్వం చూసుకుంటుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయి సంరక్షకుల సంరక్షణలో పెరుగుతున్న పిల్లలతో, వారి సంరక్షకులతో సమావేశమయ్యారు. కోవిడ్ మహమ్మారి కారణంగా జిల్లాలో సుమారు 14 మంది పిల్లలు వారి తల్లిదండ్రులను కోల్పోగా, ప్రభుత్వం వారికి ప్రతి నెల 4 వేల రూపాయలు చొప్పున…
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పోడు భూముల పట్టాలను ఇవ్వటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పోడు భూముల పట్టాలను ఇవ్వటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పోడు భూముల పై నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో పోడు భూముల పట్టాలకు వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో కలిసి అన్ని దరఖాస్తులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తుల దారులకు పోడు భూముల పట్టాలు ఇవ్వటం…