Category: Mahabubnagar-Press Releases

@ రానున్న రెండేళ్లలో మహబూబ్ నగర్ జిల్లాలోనే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు @ వేలాది ఉద్యోగాలు కల్పిస్తాం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడి కృషి ,పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య అభివృద్ధి…

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన ఐడిఓసి లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పిర్యాదులను ప్రత్యక్షంగా తానే స్వీకరిస్తూ పిర్యాదుదారులతో నేరుగా మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేశారు. మండల స్థాయిలో పరిష్కరించాల్సిన ఫిర్యాదులను సంబంధిత తహసీల్దార్,ఎం పి డి ఓ ల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఫిర్యాదుల…

అమిస్తాపూర్ వద్ద ఉన్న సారిక టౌన్షిప్, అలాగే పోతులమడుగు టౌన్షిప్లలో ఓపెన్ ప్లాట్లు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రూపొందించిన లే-అవుట్లని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు. పోతులమడుగు, సారిక టౌన్ షిప్ ల లోని ఓపెన్ ప్లాట్లకు ఈనెల 16 నుంచి 18 వరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాదం రామస్వామి ఆడిటోరియంలో నిర్వహించనున్న బహిరంగ వేలం సందర్భంగా అవగాహన నిమిత్తం గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రి…

తెలంగాణకు హరితహారం కింద నాటిన అన్ని మొక్కలకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ల ద్వారా క్రమం తప్పకుండా నీరు పోస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు ,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారిలు వివిధ అంశాలపై జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్…

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నియమించబడిన ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఏలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.రవినాయక్ ఆదేశించారు. మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఉద్దేశించి సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గతంలో ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఉన్నప్పటికీ ఎన్నికలకు నియమించబడిన పిఓ,ఏపిఓ…

వేసవి దృష్ట్యా హరితహారం కింద నాటిన మొక్కలు ఎండిపోకుండా క్రమం తప్పకుండా నీరు పోయాలని జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. ప్రతి శుక్రవారం మొక్కలకు నీరు అందించే కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా, మండల, గ్రామస్థాయిలో అధికారులు, సిబ్బంది అందరూ హరిత హారం కింద నాటిన మొక్కలకు,రహదారులకిరువైపుల నాటిన మొక్కలు,సంస్థలు,గృహాలు, ఇతర సంస్థలలో నాటిన అన్ని…

@ ఇకపై గ్రామాలలో పర్యటిస్తా @ వేసవి దృష్ట్యా హరితహారం మొక్కలకుక్రమం తప్పకుండా నీరు పోయండి @ ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచండి @ పన్నుల వసూళ్ల పై గ్రామపంచాయతీ సిబ్బంది దృష్టి సారించాలి- జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఇప్పటివరకు తాను మండల కేంద్రాలలోని తహసిల్దార్, ఎంపీడీవో, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేయడం జరిగిందని, ఇకపై గ్రామలలో కూడా పర్యటిస్తానని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ తెలిపారు. బుధవారం అయన…

విద్యార్థుల స్కాలర్షిప్ ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఆదేశించారు. బుధవారం ఆయన దేవరకద్ర తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా దేవరకద్ర తహసిల్దార్ కార్యాలయంలో ధరణి దరఖాస్తులపై వాకాబూ చేశారు . ఈ సందర్భంగా విద్యార్థులకు మంజూరు చేసే ఉపకార వేతనాల పురోగతిని కలెక్టర్ అడగగా, దేవరకద్ర మండలంలో తహసిల్దార్ ,ఎంపీడీవో, ప్రత్యేక అధికారి సమన్వయంతో ఉపకార వేతనాల దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరిస్తున్నామని ,470 మంది…

ధరణి పోర్టల్ ఎలా ఉంది? అంతా సక్రమంగానే జరుగుతున్నదా? భూములకు సంబంధించి క్రయవిక్రయాలు సరిగానే అవుతున్నాయా? లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడిన జిల్లా కలెక్టర్ జి .రవి నాయక్. మంగళవారం జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మహమ్మదాబాద్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.తహసీల్దార్ కార్యాలయంలోని తహసీల్దార్, డిప్యూటీ తహసిల్దార్ గది తో పాటు, ఇతర విభాగాల గదులను తనిఖీ చేశారు. భూమి సక్సేషన్ నిమిత్తమై మహమ్మదాబాద్ కి చెందిన అంజిలమ్మ అనే మహిళ కార్యాలయానికి…

@ మన ఊరు -మనబడి పనులను వేగవంతం చేయాలి @ ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్యను పెంచండి @ మండల స్థాయి కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి -జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మన ఊరు- మనబడి కింద చేపట్టిన పాఠశాల పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ…