Category: Mahabubnagar-Press Releases

భవిష్యత్తులో మంచి క్రీడా పాలసీని తీసుకువస్తాం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ వెల్లడి గ్రామ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించడం ద్వారా గ్రామీణ స్థాయి నుండి మంచి క్రీడాకారులను తయారు చేయాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భవిష్యత్తులో మంచి క్రీడా పాలసీని తీసుకు రావాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనని తెలిపారు. శనివారం…

కరోనా కారణంగా మూతపడిన పాఠశాల ను పరిశుభ్రం చేసి సెప్టెంబర్ 1 నుంచి పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మీదట మహాబూబ్ నగర్ జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కె జి బి వి లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు పరిశుభ్రం చేసే కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నది.విద్యా సంస్థల పరిశుభ్రత కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం నాటికి జిల్లాలో 777 పాఠశాలలను ఆట స్థలాలతో సహా…

సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలను పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున అన్ని పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాలను ఈ నెల 30 లోగా పరిశుభ్రం చేయించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.l సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి అన్ని జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్లు,మున్సిపల్ చైర్మన్లు,జిల్లాకలెక్టర్లు, విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో…

MBNR – రాష్ట్రంలో క్రీడలు, పర్యాటకానికి ప్రాధాన్యం – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

@ రాష్ట్రంలో క్రీడలు, పర్యాటకానికి ప్రాధాన్యం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్భవిష్యత్తులో క్రీడలు, పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో స్టేడియంలను నిర్మిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో చేపట్టిన అభివృద్ధి పనులనుశనివారం మంత్రి తనిఖీ చేశారు.ప్రతి జిల్లా కేంద్రం లో స్టేడియం తోపాటు,అకాడమీ ల ఏర్పాటు…

MBNR –  రహదారులకు ఇరువైపులా గ్రీనరీ గా ఉండేలా మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.

రహదారులకు ఇరువైపులా గ్రీనరీ గా ఉండేలా మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.గురువారం రెవెన్యూ సమావేశ మందిరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో రెజ్యూవనేషన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ, ఆర్ అండ్ బీ, పంచాయతీ రోడ్లకు ఇరువైపులా దట్టమైన అడవిల ఉండేలా చెట్లను నాటాలని, అవెన్యూ ప్లాంటేషన్ రెండు లేదా మూడు వరుసలలో చేయాలని అవెన్యూ ప్లాంటేషన్ కోసం గ్రీన్ బడ్జెట్ నుంచి మొక్కలు మాత్రమే కొనుటకు 80% ఖర్చు చేస్తున్నారని, అలా…

MBNR – డెంగ్యూ ,మలేరియా కేసులు నమోదు కాకుండా ఈ శనివారం నుండి వచ్చే శనివారం వరకు డ్రై డే తో పాటు పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.

@డెంగ్యూ ,మలేరియా కేసులు నమోదు కాకుండా ఈ శనివారం నుండి వచ్చే శనివారం వరకు డ్రై డే తో పాటు పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి.@నీటి గుంతలు లేకుండా చూడాలి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.గురువారం ఆయన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల పై వైద్యాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీ ఓ లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.@ ఇకపై జిల్లాలో ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కారాదు@గ్రామాలు, పట్టణాలలో పెద్ద ఎత్తున…

MBNR – రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్  గౌడ్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి లో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు.ఇప్పటివరకు రుణాలు పొందని 2000 మంది కొత్త రైతులకు 21 కోట్ల రూపాయల పంట రుణాల చెక్కులు అందజేశారు.రైతులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం ఉచిత విద్యుత్, సాగునీరు ,రైతు బంధు, రైతు బీమా, సబ్సిడీ ఎరువులు ,విత్తనాల వంటివి…

MBNR –  ప్రజలు డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాము – జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు.

@ ప్రజలు డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాము- జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాల బారిన పడకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ వెంకట రావు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా జ్వరాలు నమోదవుతున్న నేపథ్యంలో బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ…

MBNR – @ ఉదండాపూర్ ఆర్ అండ్ ఆర్ పనులకు తక్షణమే టెండర్లు పిలవండి.-జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు.

@ ఉదండాపూర్ ఆర్ అండ్ ఆర్ పనులకు తక్షణమే టెండర్లు పిలవండి. – జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా చేపట్టనున్న ఉదండాపూర్ పునరావాస కేంద్రం పనులకు సంబంధించి 10 రోజుల్లో టెండర్లను పిలవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఉదండాపూర్ పునరావాస కేంద్రం పనులపై బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమ్మిళిత సమావేశం ఏర్పాటు చేశారు.పునరావాస కేంద్రంలో పనులు చేపట్టేందుకు ముందు టెండర్లు ఫైనలైజ్ చేయాలని, ఇందుకు సంబంధించి ఆయా…

MBNR – శరవేగంతో పాలమూరు- రంగారెడ్డి రెడ్డి పునరావాస పనులు – జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.

                   @ శరవేగంతో పాలమూరు- రంగారెడ్డి రెడ్డి పునరావాస పనులు – జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు                   పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా ఉదండాపూర్ పునరావాస పనుల పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు                   మంగళవారం…