జిల్లాలో వైకుంఠధామాలకు విద్యుచ్చక్తి, నీరు, మౌళిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 311 గ్రామాలలో ఏర్పాటు చేసిన వైకుంఠధామాలకు విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యాల పనులను 10 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా…
Category: Mancherial-Photo Gallery
MNCL : బ్యాంక్ లింకేజీలో ప్రథమ స్థానంలో మంచిర్యాల జిల్లా : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
బ్యాంక్ లింకేజీలో మంచిర్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి అవార్డు పొందడం గర్వంగా ఉందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో జరిగిన బ్యాంక్ లింకేజీ లాంచింగ్ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినందున రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా చేతుల మీదుగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి అవార్డు స్వీకరించినందున శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని…
MNCL : 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : రాష్ట్ర విద్య శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్య శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, విద్య, పోలీసు సంబంధిత శాఖల అధికారులతో 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యశాఖ కార్యదర్శి మాట్లాడుతూ ఈ నెల 23 నుండి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న పరీక్షల నిర్వహణ కట్టుదిట్టంగా ఉండాలని, ప్రధానంగా…
MNCL : వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైస్‌మిల్లర్లు పూర్తి సహకారం అందించాలి : ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్
రైతుల వద్ద నుండి వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో కొనుగోలు కేంద్రాల నుండి వడ్లు తరలింపులో రైస్‌మిల్లర్లు అలసత్వం లేకుండా తమ పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్ద శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి రైస్‌మిల్లర్లు, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.…
MNCL : అమృత సరోవర్ పథకం ద్వారా పాత కుంటల పునరుద్దరణ : జాతీయ నీటి వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్
ప్రతి జిల్లాలో అమృత్ సరోవర్ పథకం ద్వారా పాత కుంటలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలని జాతీయ నీటి వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అన్నారు. బుధవారం అమృత్ సరోవర్ పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ నీటి వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్ పనులను గుర్తించాలని,…
MNCL : నిరుద్యోగులలో ఉన్న నైపుణ్యతను గుర్తించి శిక్షణ : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
జిల్లాలోని నిరుద్యోగులలో దాగి ఉన్న నైపుణ్యతను గుర్తించి తదనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ కల్పనలో తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి జిల్లా ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, సంక్షేమ, వెనుకబడిన తరగతుల అభివృద్ధి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, ఎం.డబ్య్యు.ఓ. శాఖల అధికారులు, బ్యాంకర్లు, మున్సిపల్, కార్మిక శాఖ కమీషనర్లతో జిల్లా స్కిల్…
MNCL : పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌళిక సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులను జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏ.సి.సి., న్యూగర్శిళ్ళ ప్రాంతాలలోని ప్రాథమిక పాఠశాలలు, జిల్లాలోని నస్పూర్ మండలం తీగల్పవాడ్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలు, ఆర్కె-6 కాలనీ, సీతారాంపల్లి, నస్పూర్ లలోని ప్రాథమిక పాఠశాలలను క్షేత్ర…
MNCL : పాఠశాలల పున:ప్రారంభ సమయానికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
విద్యార్థినీ, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఏకాగతతో విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటి విడతలో ఎంపిక చేయబడిన పాఠశాలలలో 2022-23 విద్యా సంవత్సరానికి తరగతులు పునఃప్రారంభించే సమయానికి చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి రాజస్వ మండల అధికారులు,…
MNCL : సాధారణ ప్రసవాలు 100 శాతం జరిగేలా చర్యలు : జిల్లా కలెక్టర్ భారతి హోకళ్ళికేరి
జిల్లాలో గర్భిణులకు సాధారణ ప్రసవాలు 100 శాతం జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సుబ్బారాయుడుతో కలిసి గైనకాలజిస్టులు, పురోహితులతో ప్రసవాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన విసృత ప్రచారంతో ప్రజల్లో అవగాహన పెరిగి ఇండ్ల వద్ద ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గి ఆసుపత్రులలో…
MNCL : రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడవచ్చని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు భారతి హోళ్ళికేరి అన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్, ప్రపంచ తలసేమియా దినోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎఫ్.సి.ఎ. ఫంక్షన్‌హాల్ లో ఏర్పాటు చేసిన తలసేమియా, సికిలొసెల్ వ్యాధిగ్రస్తుల అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం…