స్వతంత్ర భారత వజ్రోత్సవ మహోత్సవంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలలో మంగళవారం రోజున జిల్లాలోని గ్రామపంచాయతీ, మండల, జిల్లా కేంద్రాలలో చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన దేశ సమైఖ్యతను ప్రతిబింబించిందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తాలో ఏర్పాటు చేసిన గీతాలాపన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డి.సి.పి. అఖిల్ మహాజన్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి యువత, ఉద్యోగులు, వేలాది విద్యార్థులతో గీతాలాపనలో పాల్గొన్నారు. ఈ…
Category: Mancherial- Press Releases
MNCL : వజ్రోత్సవ మహోత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
స్వాతంత్య్ర వజ్రోత్సవ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం దేశభక్తిని చాటే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేయడం జరిగిందని, గ్రామపంచాయతీ, పురపాలక సంఘాల పరిధిలో దేశభక్తిని చాటే విధంగా ప్రతి రోజు ఒక ప్రత్యేక కార్యక్రమ నిర్వహణ ఉంటుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగవారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రె, జిల్లా అదనపు…
MNCL : మహనీయుల త్యాగాలు భావితరాలకు తెలిసేలా వజ్రోత్సవ వేడుకలు : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ మహోత్సవాలు జరుపుకుంటున్నామని, మహనీయుల త్యాగాలు చేశారని, పోరాట విలువ భావి తరాలకు తెలిసే విధంగా కార్యక్రమాల నిర్వహణ ఉండాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రె, డి.సి.పి. అఖిల్ మహాజన్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవిలతో కలిసి జిల్లా అధికారులతో వజ్రోత్సవ వేడుకలు నిర్వహణపై సమీక్ష సమావేశం…
MNCL : దేశభక్తిని చాటేలా ప్రతి ఇంటిపై జాతీయ పతాకం రెపరెపలాడాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
దేశ సంస్కృతి – మన దేశభక్తిని చాటేలా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు జిల్లాలోని కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రె, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డి.సి.పి. అఖిల్ మహాజన్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యలతో…
MNCL : ఆకెనపల్లి గ్రామ రైతుల సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తాం : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
జిల్లాలోని బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ రైతులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యలను, సాగు చేసుకుంటున్న రైతుల విషయంలో పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవితో కలిసి ఆకెనపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. చాలా సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేకపోవడంతో రైతుబంధు, రైతుభీమా తదితర పథకాలు అందడం లేదని, గోనె వెంకటముత్యంరావు పట్టాదారుగా ఉన్న భూములలో 50,…
MNCL : విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
విద్యుత్ పొదుపు, ఆదాపై ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్‌లో ఎన్.టి.పి.సి. ఆధ్వర్యంలో నిర్వహించిన ఉజ్వల భారత్ – ఉజ్వల భవిష్య విద్యుత్ మహోత్సవాలలో మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, ఎన్.టి.పి.సి. రామగుండం జి.ఎం. ప్రసేంజిత్ పాల్‌లతో కలిసి హాజరాయ్యరు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అవసరమైనంత మేరకు మాత్రమే విద్యుత్‌ను వినియోగించాలని, భావి తరాలకు సహజమైన, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు…
MNCL : మౌళిక భాషా గణిత సామర్థ్యాల సాధన కొరకు “తొలిమెట్టు” : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
జిల్లాలో మౌళిక భాషా గణిత సామర్థ్యాల సాధన కొరకు 2022-23 విద్యా సంవత్సరం నుండి “తొలిమెట్టు” కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన మండల స్థాయి విషయ నిపుణుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కారణంగా అభ్యాసన ఫలితాలలో వెనుకబడిన విద్యార్థినీ, విద్యార్థుల సామర్థ్యాలు పెంపొందించడం కొరకు…
MNCL : మిల్లర్లు కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
రైస్‌మిల్లర్లు ప్రభుత్వం కేటాయించిన వరిధాన్యం లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేలా సహకరించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, జిల్లాలోని రైస్‌మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న వరిసాగుకు అనుగుణంగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని,…
MNCL : 18 సం॥లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి : రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్
18 సం॥లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా అధికార యంత్రాంగం విసృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటరు జాబితా రూపకల్పన, గరుడ యాప్ వినియోగంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ 18 సం॥లు నిండి ప్రతి ఒక్కరి వివరాలను ఓటరు జాబితాలో నమోదు…
MNCL : జిల్లాలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ దిశగా చర్యలు : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
జిల్లాలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా పూర్తి న్థాయి నియంత్రణ దిశగా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి సీజనల్ వ్యాధులు, వైద్య శిబిరాలు, వ్యాక్సినేషన్, పారిశుద్ధ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య, ఆరోగ్య,…