Category: Mancherial-What’s Happening

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం-2022 లో భాగంగా తేది : 01-01-2022 నాటికి 18 సం॥ల వయస్సు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్‌ గుర్తింపు కార్డులు (ఎపిక్‌ కార్జు) బూత్‌ స్థాయి అధికారుల ద్వారా అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల వివరాల మార్పులు, చేర్పులు ఇతరత్రా అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష…

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులు క్షేత స్థాయిలో దృష్టి సారించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి, పి.సి.సి.ఎఫ్‌. ఆర్‌.శోభ, శాసన మండలి సభ్యులు దండె విఠల్‌, శాసనసభ్యులు, దయాకర్‌రావు, రేఖాశ్యాంనాయక్‌, రాథోడ్‌…

వివిధ వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రికి రాలేని రోగులకు వారి వద్దకే వెళ్ళి వైద్య సేవలు అందించేందుకు ఆలన హోంకేర్‌ సర్వీస్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి తెలిపారు. బుధవారం జిల్లాలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో జిల్లా వైద్యాధికారి డా॥ కుమం బాలుతో కలిసి అంబులెన్స్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలలో వైద్య సేవలు అవసరం ఉండి ఆసుపత్రికి రాలేని వారి వద్దకే…

అంధత్వం కలిగిన దివ్యాంగులకు దిక్సూచిలా నిలిచి వారి జీవితాలలో విద్య వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి లూయిస్‌ బ్రెయిలీ అని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్‌రోడ్డులో గల సన్‌ పైన్‌ వయోవృద్ధుల దే కేర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన లూయిస్‌ (బెయిలీ 218వ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ చాలా మంది చిన్న చిన్న సమస్యలకే నిరాశ నిస్సృహలకు లోనవుతారని, దృష్టి లోపం ఉన్న…

కొవిడ్‌ వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా 15 నుండి 18 సం॥ల వయస్సు గల పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజల సహకారంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళుతుందని, ఈ మేరకు…

జిల్లాలో ప్రజలందరికీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అందే విధంగా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రజాపరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, ఆదిలాబాద్‌ శాసనసభ్యులు పురాణం సతీష్‌, మంచిర్యాల, బెల్లంపల్లి శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ…

దేశ అభివృద్ధి, భవిష్యత్తును మార్చడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో సంచలనాత్మక మార్పులు తీసుకువచ్చే శక్తి ఓటు హక్కుకు ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ అన్నారు. గురువారం జిల్లాలోని నస్సూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం సమీయంలో ఈ.వి.ఎం., వి.వి.పాట్‌ గోదాములను జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఓటు హక్కు…

జిల్లాలో యాసంగి సమయంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లాలోని చెన్నూర్‌ మండలం కిష్టంపేట గ్రామం, కోటపల్లి మండలం కొండంపేట గ్రామం, వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామాలలో రైతులకు పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వరిధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో యాసంగిలో రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి, వాణిజ్య…

స్థానిక సంస్థల, శాసన మండలి ఎన్నికల నిర్వహణలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని మంచిర్యాల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా॥ శశాంక్‌ గోయల్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, రామగుండం కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎస్‌. చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల…

యాసంగిలో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులు చూపాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి తెలిపారు. గురువారం జిల్లాలోని హాజీపూర్‌ మండలం రాపల్లి గ్రామం, దండేపల్లి మండలం ధర్మారావుపేట గ్రామాలలో రైతులకు పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ యాసంగి పంటకు సంబంధించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోదని, వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుదని తెలిపారు. తప్పనిసరిగా వరి సాగు జే రైతులు సంబంధిత…