Category: Medak-Photo Gallery

నిరుపేదలైన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అందరు సద్వినియోగం చేసుకొని మంచి విద్యా బుద్దులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు

నిరుపేదలైన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అందరు సద్వినియోగం చేసుకొని మంచి విద్యా బుద్దులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. సోమవారం తన ఛాంబర్ లో గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాల (B.A.S) లో ప్రవేశాల కోసం విద్యార్థుల ఎంపికను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ…

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు . సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుండి 39 విజ్ఞప్తులు వచ్చాయి. ప్రధానంగా భూ వివాదాలు, విద్యుత్, రెండు పడకల గదుల ఇండ్లు కావాలని తదితర ఫిర్యాదులందాయి. అందులో రెవిన్యూ విభాగానికి సంబంధించి 25 విజ్ఞప్తులు రాగా, మునిసిపాలిటి సంబంధించి 3, ఇతర శాఖలకు సంబంధించి 11 దరఖాస్తులు వచ్చాయి. అందులో కొన్ని ఫిర్యాదులు ఇలా.. రెవిన్యూ, ఫారెస్ట్ శాఖల…

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం యావత్ తెలంగాణలో కొనసాగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు..

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం యావత్ తెలంగాణలో కొనసాగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు.. పట్టణ ప్రగతి లో భాగంగా సోమవారం రోజు మెదక్ పట్టణంలో 13వ వార్డులో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పట్టణ ప్రగతి లో భాగంగా వెజ్ , నాన్ వెజ్ మార్కెట్ కు స్మశానవాటిక…

రాష్ట్ర పౌర సరఫరాల కమీషనర్ అనిల్ కుమార్ శుక్రవారం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మనోహరాబాద్ మండలంలోని దండుపల్లి, తూప్రాన్ కొనుగోలు కేంద్రాలను సందర్శించి నిర్వహకులకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో నిర్దేశిత అంచనా లక్ష్యానికి చేరువలో ఉంచటంలో, ధాన్యం సేకరణ పూర్తి చేయటంలో అధికారులు సఫలీకృతులు అయినందుకు జిల్లా అధికారుల బృందాన్ని అభినందించారు. వర్షాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు,కొనుగోలు కేంద్ర నిర్వాహకులు…

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో నేడు గ్రామాలలో గుణాత్మక మార్పు కనిపిస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నుండి పక్షం రోజుల పాటు నిర్వహించనున్న 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మెదక్ మండలం ఔరంగాబాద్ తండా లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రగతి ద్వారా నేడు పల్లెలు పచ్చదనం-పరిశుభ్రతతో పరిఢవిల్లుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, శ్మశాన వాటికలు,…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ గావించి జిల్లా ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర పశువైద్య,పశు సంవర్ధక ,పాఫైపరిశ్రమ శాఖ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్

మెదక్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ గావించి జిల్లా ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర పశువైద్య,పశు సంవర్ధక ,పాఫైపరిశ్రమ శాఖ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రసంగించారు. అంతకుముందు మంత్రి చిన్నశంకరంపేట లో అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషద్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ ఎస్పీ…

ఈ నెల 3 నుండి పక్షం రోజుల పాటు చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో ప్రజాప్రథినిధులు, అధికారులు భాగస్వాములై విజయంవంతం చేయవలసినదిగా జిల్లా పరిషద్ చైర్ పర్సన్ – ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ కోరారు.

ఈ నెల 3 నుండి పక్షం రోజుల పాటు చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో ప్రజాప్రథినిధులు, అధికారులు భాగస్వాములై విజయంవంతం చేయవలసినదిగా జిల్లా పరిషద్ చైర్ పర్సన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ కోరారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించిననాడే అసలైన ప్రగతి సాధించినట్లని రాష్ట్ర ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్ రావు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నారని వారి ఆకాంక్ష మేరకు అందరు సమన్వయంతో…

వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బడిబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు

వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బడిబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. బడిబాట సన్నాహక కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పాఠశాల వయస్సు పిల్లలను గుర్తించి వారిని సమీప పాఠశాలలలో చేర్పించాలని అన్నారు. ఇటుక బట్టి , పరిశ్రమలు ,దుకాణాలు తదితర వాటిలో పనుల్లో ఉన్న బడిఈడు పిల్లలను గుర్తించ , పాఠశాలలకు తిరిగి తీసుకువచ్చేందుకు కార్మిక శాఖ, పొలిసు…

నవ భారత నిర్మాణానికి కృషి చేస్తున్నామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

నవ భారత నిర్మాణానికి కృషి చేస్తున్నామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దేశ వ్యాప్తంగా ముద్ర కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందిన వీధి వ్యాపారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ కార్యక్రమాలలో పారదర్శకత పాటిస్తూ నేరుగా లబ్ధిదారుల ఖాతాకే డబ్బులు జమచేస్తూ జవాబుతారితనం పాటిస్తునామన్నారు. ముద్ర కార్యక్రమం క్రింద వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా స్వయం…

టి.ఎస్. ఐ పాస్ విధి విధానాలు, మార్గదర్శకాలకనుగుణంగా పరిశ్రమలు నెలకొల్పుటకు పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు

టి.ఎస్. ఐ పాస్ విధి విధానాలు, మార్గదర్శకాలకనుగుణంగా పరిశ్రమలు నెలకొల్పుటకు పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్ లో ఏర్పాటుచేసిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ టి.ఎస్. ఐపాస్ క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన ధరఖాస్తులలో 14 దరఖాస్తులు వివిధ స్థాయిలలో పెండింగులో ఉన్నాయని అన్నారు. పరిశ్రమల నెలకొల్పనకు ఒక మాసంలోగా అనుమతులు మంజూరు చేయవలసి ఉండగా…