జిల్లాలో పంట దిగుబడి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రమేష్ మండల గణాంక ప్రణాళిఖాధికారులకు సూచించారు. బుధవారం తన ఛాంబర్ లో పంట కోత ప్రయోగాలకు సంబంధించిన సి.సి. కిట్ల ను (యంత్ర సామాగ్రిని ) ముఖ్య ప్రణాళికాధికారి చిన కొట్యాల్ తో కలిసి మండల ప్రణాళిక అధికారులు, గణాంకాధికారులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా అదనపవు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి రెండు చొప్పున జిల్లాకు 42 కిట్లు మంజూరు…
Category: Medak-Press Releases
ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని, నర్సరీలను సందర్శించిన -అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ బుధవారం నాడు కుల్చారం లోని ప్రభుత్వ జూనియర్ కళాళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా చిల్పిచెడ్ మండలం చిట్కుల్ లో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీలను, మన ఊరు మన బడి క్రింద ఎంపిక చేసిన పాఠశాలతో పాటు బద్రియ తండా, గౌతాపూర్, గన్యా తండా గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ…
కొనుగోలు కేంద్రాలు రైస్ మిల్లులను సందర్శించిన = కలెక్టర్ హరీష్
జిల్లాలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత వేగవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ రమేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, ఆర్.డి.ఓ. శ్యామ్ ప్రకాష్, తహసీల్ధార్లతో కలిసి మనోహరాబాద్ మండలం దండుపల్లిలో, తూప్రాన్ మండలం యావాపూర్ లో, మాసాయిపేట లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు దండుపల్లి లో శ్రీహిత రైస్ మిల్లును, తూప్రాన్ లో సాయినాథ్ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ…
ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు – అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్
మంగళవారం నాడు స్థానిక సంస్థల కలెక్టర్ ప్రతిమ సింగ్ రామాయంపేట లో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా నిజామాపేట్ మండలం చెల్మెడ లో బృహత్ పల్లె ప్రక్రుతి వనాన్ని, నర్సరీలను, మన ఊరి మన బడి క్రింద ఎంపిక చేసిన పాఠాశాలను, నిజాంపేట్ గ్రామ పంచాయతీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 6,522 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 6,005 మంది హాజరయ్యారని,…
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి – అదనపు కలెక్టర్ రమేష్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం చేపట్టబడిందని, అధికారులు ఇట్టి ప్రాధాన్యతను గుర్తించి తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 32 వినతులు వచ్చాయి. అందులో ప్రధానంగా భూ సమస్యలకు సంబంధించి 20 విజ్ఞప్తులు రాగా, సదరం సర్టిఫికెట్, మూడు చక్రాల బ్యాటరీ సైకిల్, కృత్రిమ కాలు కావాలని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తదితర 12 విజ్ఞప్తులు…
ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్

ఎటువంటి చిన్న పొరపాటుకు తావివ్వకుండా ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. ఈ నెల 6 నుండి 21 వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న 13,777 మంది విద్యార్థుల కోసం 31 కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఉదయం 9 నుండి మధ్యాన్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8 .15 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు…
షాదుఖానాను ప్రారంభించి ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం అవిరళ కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు హరీష్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో తొమ్మిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన షాదీఖానా ను ప్రారంభించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నదని ఈ ఫలితాలు రాబోయే నాలుగు, ఐదు సంవత్సరాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయని…
8వ విడత హరితహారంలో 34 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం- కలెక్టర్ హరీష్

అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద, కాలువ గట్లపై పచ్చదనం పెంపు, పది శాతం కన్న తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళికతో పచ్చదనం పెంచటం ఎనిమిదవ విడత హరితహారం ప్రాధాన్యాతాంశాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. ఈ వర్షాకాలంలో చేపట్టబోయే తెలంగాణకు హరితహారం కార్యక్రమం ముందస్తు ఏర్పాట్లుపై శుక్రవారం సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లు, అధికారులతో చీఫ్ సెక్రటరీ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…
వేసవిక్రీడా శిబిరాలు ఉపయోగించుకోండి- అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

గత రెండు సంవత్సరాలుగా కరోనాతో క్రీడలకు దూరమైన విద్యార్థులకు మే 1 నుండి 21 వరకు నెలరోజుల పాటు జిల్లాలోని 11 కేంద్రాలలో నిర్వహించే క్రీడా శిబిరాలు ఎంతో ఉపయుక్తమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. శిక్షకులు కూడా విద్యార్థులకు క్రీడల పట్ల ఉత్తమ శిక్షణ అందించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలని కోరారు. శుక్రవారం తన ఛాంబర్ లో మరో అదనపు కలెక్టర్ తో కలిసి 11 కేంద్రాల శిక్షణా…
భూగర్భ జలాల పెంపునకు కృషి చేయండి-స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

భూగర్భ జలాల పెంపుదలకు వ్యూహాత్మక ప్రణాళిక తో శాస్త్రీయ పద్దతిలో ముందుకెళ్తే మంచి ఫలితాలు సాధించవచ్చని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో హైదరాబాద్ దక్షిణ ప్రాంతానికి చెందిన కేంద్ర జల శక్తి విభాగపు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు వారు మెదక్ జిల్లాకు సంబంధించి రూపొందించిన అక్విఫర్ మ్యాప్ లు (జలాశయ పటాలు) మరియు నిర్వహణ ప్రణాళికలను సైటిస్టులు మహాదేవ్, విట్టల్ లు…