Category: Mulugu-Photo Gallery

ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి::

జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ ప్రజావాణి లో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధికారులు కృషిచేసి అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 35 దరఖాస్తులు రాగా వాటిలో ధరణి భూ సమస్యలు వృద్ధప్య పింఛన్లు స్వయం ఉపాధి వంటి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ వై వి గణేష్ డిఆర్ఓ రమాదేవితో కలిసి…

ఎస్సీ విద్యార్థుల ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిఫ్ నమోదు ప్రక్రియ వారంలోగా పూర్తి చేయాలి::  జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య.

ఎస్సీ విద్యార్థుల ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిఫ్ నమోదు ప్రక్రియ వారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అభివృద్ధి శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిఫ్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పాఠశాలలో, కళాశాల లో చదువుతున్న ఎస్సి విద్యార్థుల డాటా బేస్ ప్రక్రియ…

10 సంవత్సరాలు, 16 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ టీడీ (టెటనస్ డిఫ్తీరియా) వ్యాక్సిన్ వేయించాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సమావేశం కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 7వ తారీకు నుండి 19వ తారీకు వరకు టీడీ (టెటనస్ డిఫ్తీరియా) వ్యాక్సిన్ కార్యక్రమం అన్ని పాఠశాలల్లో చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఐదవ తరగతి, పదవ…

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి:జిల్లా అదనపు కలెక్టర్ వై.వి గణేష్

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి జిల్లావ్యాప్తంగా మొత్తం 109 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి రైతులకు ఇబ్బంది కలిగించదు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వై.వి గణేష్ యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని ఐకెపి 23, పిఎ సిఎస్ 74, జిసిసి 12, మొత్తం 109 కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదనలు అందాయని వాటిని వెంటనే ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వై వి గణేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం…

**వార్త ప్రచురణ తేదీ.20.02.2022(ఆదివారం) మేడారం** *ప్రశాంతంగా ముగిసిన మేడారం జాతర. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య* మేడారం జాతర 2022 ను విజయవంతంగా ముగిసినందుకు సహకరించిన ప్రజలు ,ప్రజా ప్రతినిదులు, అధికార యంత్రాంగం కి, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియ వారికి పేరు పేరున జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య కృతజ్ఞతలు తెలిపారు. మేడారం జాతర ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆదివారం ప్రభుత్వ సెలవు దినం రోజున భక్తులు అధిక సంఖ్యలో…

ముగిసిన మేడారం మహాజాతర.. వనప్రవేశం చేసిన గిరి‘జన’దేవతలు తెలంగాణ కుంభమేళా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర ముగిసింది. భక్తుల నుంచి పూజలందుకు గిరిజన దేవతలు వనప్రవేశం చేశారు. వనప్రవేశం ఘట్టంతో మేడారం మహాజాతర ముగిసింది. సంప్రదాయం ప్రకారం పూజలు చేసిన అనంతరం అమ్మవార్లకు పూజారులు వీడ్కోలు పలికారు. సమ్మక్క చిలుకల గుట్టకు, సారామ్మల కన్నెపల్లికి, గోవిందరాజు కొండాయికి, పగిడిద్దరాజు పూనగొండ్ల బయలుదేరారు. చివరి రోజు అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవార్ల ప్రవేశం సందర్భంగా…

ప్రచురణార్థం మేడారం మహాజాతరకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్… మేడారం ఫిబ్రవరి 19. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ శనివారం సందర్శించారు. అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలుకగా పోలీస్ శాఖ గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆలయ మర్యాదలతో దేవాలయం లోని తులాభారం వద్దకు తీసుకెళ్లగా నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క గవర్నర్ కు శాలువా కప్పి…

ప్రచురణార్థం తేదీ 19. 02. 2022. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సమ్మక్క-సారలమ్మ తల్లులను ప్రార్తించారు. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర చివరి రోజు శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళ సై తల్లులను దర్శించుకుని తల్లులకు చీర, సారెలను,గోవిందరాజు, పగిడిద్దరాజులకు పంచెలను సమర్పించారు. గవర్నర్ తల్లుల దర్శనానికి రాగా రెవెన్యూ, గిరిజన సంక్షేమశాఖ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అధికారులు, పూజారులు గవర్నర్ కు చీరే, పసుపు కుంకుమ, బంగారం(బెల్లం), జ్ఞాపికను…

ప్రచురణార్థం శానిటేషన్ పని తీరు అద్భుతం… మేడారం, ఫిబ్రవరి, 19. మేడారం శ్రీ సమ్మక్క సారాలమ్మ మహజాతరలో పారిశుధ్యం పనితీరును పలువురు ప్రశంసిస్తున్నారు. లక్షలమందివచ్చే ఈ జాతర కు ప్రస్తుతం కోటికి పైగా తరలిరావడం, జాతరకు వస్తున్న జనాభాతో వారం రోజులుగా 24గంటలు ఎటువంటి విరామం లేకుండా సుదీర్ఘంగా కొనసాగుతున్న జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ శానిటేషన్ ఉద్యోగులు భక్తుల మనసును దోచుకున్నారు. విధి నిర్వహణ ఒక భాగమైతే, అతివేగంగా చెత్తను…