Category: Mulugu-Press Releases

వార్త ప్రచురణ మే 16 ములుగు పకడ్బందీగా 10వ తరగతి పరీక్షల నిర్వహణకు చర్యలు::రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ అనుమతి నిరాకరణ ప్రతి పరీక్ష కేంద్రాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాల ఏర్పాటు 10వ తరగతి పరీక్షల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ 10వ తరగతి పరీక్షల నిర్వహణ సమయంలో ప్రశ్నపత్రం లీక్ జర్గకుండా కట్టుదిట్టమైన చర్యలు…

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లో ఉండొద్దు ములుగు వెలుగు యాప్ ద్వారా ఉద్యోగుల అటెండెన్స్ తప్పనిసరి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య* ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దని వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య హాజరై ప్రజల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో…

వార్త ప్రచురణ, మే-11,2022. ములుగు జిల్లా : పెండింగ్ పనులు పూర్తి చేయాలి కలెక్టర్ కృష్ణ ఆదిత్య జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లోబుధవారం రోజున ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొని పెండింగ్ పనులను పైన రివ్యు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ పరిధిలో చేపట్టబడిన గురుకులాలు , మోడల్ స్కూల్స్ ,బిటి రోడ్స్ ,అంగన్ వాడి కేంద్రాలు, తదితర వర్క్స్ ఈ నెల చివరి…

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వై.వి గణేష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ డిఆర్ఓ కె రమాదేవి ప్రజల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వైవి గణేష్ మాట్లాడుతూ వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని అన్నారు.…

వార్త ప్రచురణ ములుగు జిల్లా: 02.05.2022. దళిత బందు మండలాల వారీగా లబ్ధిదారుల గ్రౌండింగ్ చేయాలి హరితహారం లక్ష్యం పూర్తి చేయాలి వ్యవసాయ శాఖ అధికారులు ఉదయం ప్రతి గ్రామాన్ని సందర్శించాలి మధ్యాహ్నం రైతు వేదికలో ఉండాలి వాట్సాప్ ద్వారా ఫోటో సెండ్ తప్పనిసరి సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య జిల్లాలో దళిత బంధు 120 యూనిట్లకు 97 మంది లబ్ధిదారుల 80% ట్రాన్స్పోర్ట్స్ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తామని జిల్లా…

ప్రచురణార్థం-1 మే 15 నాటికి మన ఊరు మన బడి కార్యక్రమ గ్రౌండింగ్ పూర్తి :: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కవర్ షెడ్డుతో డైనింగ్ హాల్ ఏర్పాటు మే 10వరకు పాఠశాల పనుల ప్రతిపాదనలు పూర్తి మన ఊరు మన బడి కార్యక్రమం పై విస్తృత ప్రచారం కల్పించాలి పాఠశాల అభివృద్ధి పనుల్లో గ్రామస్థులు, తల్లిదండ్రుల భాగస్వామ్యం ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 పాఠశాలలు పనులు మే నెలలో పూర్తి మన…

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి:జిల్లా అదనపు కలెక్టర్ వై.వి గణేష్

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి జిల్లావ్యాప్తంగా మొత్తం 109 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి రైతులకు ఇబ్బంది కలిగించదు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వై.వి గణేష్ యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని ఐకెపి 23, పిఎ సిఎస్ 74, జిసిసి 12, మొత్తం 109 కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదనలు అందాయని వాటిని వెంటనే ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వై వి గణేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం…

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజావాణి జిల్లా సమగ్ర అభివృద్ధి జిల్లా ప్రజల సంక్షేమం సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయం సూపర్డెంట్ విశ్వ ప్రసాద్, డిఏ ఓ రాజు ప్రజల నుండి ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు. గత వారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టరేట్ సూపర్డెంట్ సూచించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో…

దళిత బంధు లబ్ధిదారులకు 47 యూనిట్ల పై అవగాహన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం ములుగు నియోజకవర్గం లో ఎక్కువ మంది దళితులకు ఇవ్వాలని దళిత బంధు పథకం విస్తృత పరచాలని స్థానిక శాసన సభ్యురాలు ధనసరి అనసూయ అన్నారు. జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ములుగు వారి ఆధ్వర్యంలో ములుగు, భద్రాచలం నియోజకవర్గ దళిత బందు లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్…

మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఉపాధి పొందాలి క్రాంతి గ్రామైక సంఘాల మహిళల గ్రూప్ రుణాలు పొందుతూ స్వయం ఉపాధి పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ వి సి కాన్ఫరెన్స్ హాల్ లో గ్రామైక్య సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ గ్రామైక్య సంఘాల మహిళలు గ్రూప్ రుణాలు పొందుతూ ఉపాధి పొందాలని అన్నారు. ఈ సందర్భంగా క్రాంతి…