పత్రిక ప్రకటన తేది: 5-7-2021 నాగర్ కర్నూల్ జిల్లా. ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఊరూరా విజయవంతం చేసి గ్రామాలను పరిశుబ్రంగా పచ్చదనంతో వెల్లివిరిసేలా చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి పిలుపునిచ్చారు. సోమవారం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ యల్. శర్మన్, కొల్లాపూర్ శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఎల్లూరు, ముక్కడిగుండం, పెంటలవెల్లి మండలంలో జటప్రోలు లో జరుగుతున్న పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. జటప్రోలు…