Category: Nagarkurnool-Press Releases

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వ విప్, అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వ విప్, అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజ్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నాగర్ కర్నూల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 10.30 కు ముఖ్య అతిథి గువ్వల బాలరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో పోలీస్ కవాతు, వివిధ శాఖల ద్వారా…

స్వతంత్ర భారత వజ్రిత్సవాల్లో భాగంగా రేపటి సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా  కలెక్టర్ – పి. ఉదయ్ కుమార్

స్వతంత్ర భారత వజ్రిత్సవాల్లో భాగంగా రేపటి సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నేడోక ప్రకటనలో కోరారు. రేపు ఉదయం 11.30 గంటలకు జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీ, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు ప్రతి ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు వ్యాపార సముదాయాలు ఉదయం 11.30 గంటలకు అందరూ లేచి సామూహికంగా జాతీయ గీతాలాపన చేయాలని తెలిపారు. వాహనదారులు అయితే…

కలెక్టరేట్లో జాతీయ‌ జెండా ఆవిష్క‌రించిన అదనపు కలెక్టర్- యస్. మోతిలాల్

స్వతంత్ర భారత ప్రజోత్సవ వేడుకల్లో 76వ భాగంగా ఇవ్వాల (సోమవారం) స్వాతంత్య్ర దినోత్సవాన నాగర్ కర్నూలు జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్, కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ పాత్రికేయులు, విద్యార్థులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వతంత్ర భారత స్వర్ణోత్సవ వేళ భారత స్వాతంత్య్రోద్యమ అమర వీరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. జాతీయ గీతాన్ని ఆలపించిన విద్యార్థులకు…

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా సాంస్కృతిక, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో  ఈ రోజు జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో జరిగిన జానపద కళాకారుల ప్రదర్శన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్- పి. ఉదయ్ కుమార్ , ముఖ్య అతిథిగా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి గారు  పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని రకాల కళా రంగాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దపీట వేయడం జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా సాంస్కృతిక, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో జరిగిన జానపద కళాకారుల ప్రదర్శన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ జానపద కళాకారుల ప్రదర్శనలో జిల్లాలోని ప్రభుత్వ,…

విజయోత్సవంగా స్వతంత్ర భారత 75వ వజ్రోత్సవ ర్యాలీ

భారత స్వాతంత్ర స్ఫూర్తిని చాటేలా 7వ స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాలు – జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి విజయోత్సవంగా స్వతంత్ర భారత 75వ వజ్రోత్సవ ర్యాలీ వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువతి యువకులు, మహిళలు జాతీయ జెండా చేత భూని మేరా భారత్ మహాన్, అంటూ విద్యార్థుల నినాదాలతో మారుమోగిన కందనూర్ పురవీధులు భారత స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో 7500 మంది విద్యార్థులు, 3500 మంది యువత మహిళా…

భారత స్వాతంత్ర స్ఫూర్తిని చాటేలా 7వ స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాలు – జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి విజయోత్సవంగా స్వతంత్ర భారత 75వ వజ్రోత్సవ ర్యాలీ వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువతి యువకులు, మహిళలు జాతీయ జెండా చేత భూని మేరా భారత్ మహాన్, అంటూ విద్యార్థుల నినాదాలతో మారుమోగిన కందనూర్ పురవీధులు భారత స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో 7500 మంది విద్యార్థులు, 3500 మంది యువత మహిళా…

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జరుగుచున్న రోజుకో కార్యక్రమంలో జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు భాగస్వాముల కావాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నేడోక ప్రకటనలో కోరారు. కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 9.00 గంటలకు జిల్లా పరిషత్ మైదానం నుండి ర్యాలీగా ట్యాన్క్ బండ్ వరకు నుర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున జిల్లా పరిషత్ మైదానం…

ఆగస్టు నెలలకు సంబంధించి రేషన్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తికి 15 కిలోల చొప్పున ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేసే 1 రూపాయికి కిలో బియ్యాన్ని వెంటనే కొనుగోలు చేసుకోవాలని అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్ శుక్రవారం ఒక ప్రకటనలు కోరారు. నాగర్ కర్నూలు జిల్లాలోని 2,38000 తెల్ల రేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనున్న 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాలోని 558 రేషన్ దుకాణాలలో సిద్ధంగా ఉందని…

జిల్లా మహిళా సోదరీమణులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన- జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్

జిల్లా కలెక్టర్ కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారిస్ గురువారం కలెక్టరేట్లో బ్రహ్మకుమారిస్ నాగర్ కర్నూల్ ఇంచార్జ్ బ్రహ్మకుమారి సుజన, బ్రహ్మకుమారి ప్రభ, బ్రహ్మకుమారి విజయ లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కు రాఖీ పండగ సందర్భంగా రాఖీలు కట్టారు. శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా జిల్లాలోని మహిళా సోదరీమణులందరికీ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ హృదయ పూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని కలెక్టర్ అన్నారు. మహిళలు…

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా  జిల్లాలో ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్న- కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో నాగర్ కర్నాల్ జిల్లా ప్రజల భాగస్వామ్యం, స్ఫూర్తి ఆమోఘమని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు రెండు వారాల పాటు నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాలో ఫ్రీడమ్ రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 7 గంటలకు కలెక్టరేట్ ప్రాంగణం నుండి ప్రారంభమై ట్యాన్క్ బండ్ మైసమ్మ గుడి నుండి తిరిగి కలెక్టరేట్ కు చేరుకున్న ఈ ఫ్రీడమ్ రన్…