Category: Nagarkurnool-Press Releases

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు సాంస్కృతిక కార్యకలాపాలపై ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు సాంస్కృతిక కార్యకలాపాలపై ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో  వేసవి శిక్షణ తరగతులపై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో ప్రత్యేకంగా బాలభవన్ లేకపోవడం వల్ల వేసవిలో ఆహ్లాదకరంగా సాంస్కృతిక శిక్షణ పొందే అవకాశం లేదని దీనిని అధిగమించడానికి జిల్లాలో తాత్కాలిక వేసవి శిబిరాలు నిర్వహించాలని…

వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ విద్యార్థులను సూచించారు

వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ విద్యార్థులను సూచించారు.  మంగళవారం నుండి 5,6,7వ తరగతి  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులను బాలికలకు గిరిజన ఆశ్రమ పాఠశాల, కల్వకుర్తి లో నిర్వహించగా బాలురకు ఏకలవ్య మోడల్ స్కూల్ వెలదండలో ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ హాజరై సెంటర్లను పరిశీలించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ ఆంగ్లము, లెక్కల…

ఉపాధి పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలి, సంక్షేమ శాఖల ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

ఉపాధి పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలి, సంక్షేమ శాఖల ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్   జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపడుతున్న పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఎంపీడీవో లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఏపీఓలు, డి ఆర్ డి ఎ అదనపు ప్రాజెక్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

జిల్లాలో భూగర్భజలాలు అంతరించిపోకుండా జలశక్తి అభియాన్ కింద ఎప్పటికప్పుడు భూగర్భ జలాలు పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

జిల్లాలో భూగర్భజలాలు అంతరించిపోకుండా జలశక్తి అభియాన్ కింద ఎప్పటికప్పుడు భూగర్భ జలాలు పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను.  మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి మొదటి సమన్వయ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, డి.ఆర్.డి.ఏ తదితర శాఖల ద్వార ఏ గ్రామంలో ఎన్ని ఫీట్లకు భూగర్భ జలాలు ఉన్నాయి, బోర్లు వేసినప్పుడు ఎన్ని ఫీట్ల లోతులో నీరు వస్తుంది ఎంతమేర…

జిల్లాలో అక్రమ ఇసుక తరలింపు పై కఠిన చర్యలు తీసుకోవాలి –  జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

జిల్లాలో అక్రమ ఇసుక తరలింపు పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు.  మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో  మన ఇసుక వాహనం అమలు పై మైన్స్, పోలీస్, రెవిన్యూ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే టి.ఎస్.ఎం.డి.సి., మన ఇసుక వాహనం ద్వారా వినియోగదారులకు  ఇసుక అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.  మన ఇసుకవాహనం వెబ్సైట్ లో వెళ్లి ఇసుక ఎంతకావలో నమోదు చేసుకుంటే…

అకాల వర్షాలు ఎప్పుడైనా ఎక్కడైనా పడవచ్చు –  ధాన్యం తడిచి రైతులు మాత్రం నష్ట పోవద్దు ముందస్తుగా సిద్ధంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

అకాల వర్షాలు ఎప్పుడైనా ఎక్కడైనా పడవచ్చు – ధాన్యం తడిచి రైతులు మాత్రం నష్ట పోవద్దు ముందస్తుగా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో వరి ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరు పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో ధాన్యం పంట ఆలస్యం అవ్వడంతో కొనుగోలు ఇప్పుడే ఊపందుకుంటుందన్నారు. ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్నాయి ఇలాంటి…

ఈ నెల 25న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించనున్న భారత వైద్య మండలి బృందం, వెంటనే అదనపు పడకల నిర్మాణ పనులు పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

ఈ నెల 25న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించనున్న భారత వైద్య మండలి బృందం, వెంటనే అదనపు పడకల నిర్మాణ పనులు పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఈనెల 25వ తేదీ నుండి ఎప్పుడైనా ఆకస్మికంగా జాతీయ వైద్య మండలి కమిషన్ సభ్యులు పర్యటించవచ్చునని, ఈ మేరకు ఈనెల 25వ తేదీలోగా అన్ని సదుపాయాలతో అదనపు బెడ్ ల  నిర్మాణ పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్…

ప్రజావాణి సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారికి షోకాజ్ నోటీసు జారీకి కలెక్టర్ ఆదేశాలు

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 28 దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ…… ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నుండి అధికారులు ఎవరూ కూడా ప్రజావాణికి హాజరు కాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణి పట్ల అలసత్వం వహించిన జిల్లా…

మొదటి విడతగా ఎంపిక చేసిన 290 పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమం కింద అన్ని మౌళిక సదుపాయాలు పూర్తి చేసి పాఠశాల ప్రారంభమయ్యే నాటికి పిల్లలకు కొత్తగా ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేందుకు  అడుగుపెట్టేవిధంగా చర్యలు తీసుకోవాలి – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి విడతగా ఎంపిక చేసిన 290 పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమం కింద అన్ని మౌళిక సదుపాయాలు పూర్తి చేసి పాఠశాల ప్రారంభమయ్యే నాటికి పిల్లలకు కొత్తగా ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేందుకు  అడుగుపెట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.  శనివారం జిల్లాలో మన ఊరు మాన బడి కింద చేపడుతున్న ఆధునీకరణ పనులకు శంఖుస్థాపన లు చేసి మధ్యాహ్నం…

తెలంగాణా విద్యార్థులను ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని  ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది –  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణా విద్యార్థులను ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని  ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు.  శనివారం నాగర్ కర్నూల్ జిల్లాలో మన ఊరు మనబడి మన బస్తి మన బడి కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలల్లో పనులకు శంఖుస్థాపన చేసి భూమి పూజ చేశారు.   తాడూర్ మండలం మెడిపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలకు…