Category: Nagarkurnool-Press Releases

ఉద్యోగుల బదిలీలు ప్రభుత్వ ఉత్తర్వులు 317 అనుసరించి పారదర్శకంగా జరిగే విధంగా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు

ఉద్యోగుల బదిలీలు ప్రభుత్వ ఉత్తర్వులు 317 అనుసరించి పారదర్శకంగా జరిగే విధంగా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  మంగళవారం సాయంత్రం ప్రెసిడెన్షిల్ ఆర్డర్ 2018 అమలు విధి విధానాల పై జిల్లా కలెక్టర్లు, శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉద్యోగుల కేటాయింపులు 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఉండేదని, రాష్ట్ర విభజన తర్వాత 33 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా 7 జోన్…

ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించేందుకు సూపర్ చెక్ ఎంతో అవసరo- ఎన్నికల ఓటరు జాబితా పరిశీలకులు మాణిక్ రాజ్ కన్నన్

ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించేందుకు సూపర్ చెక్ ఎంతో అవసరమని ఎన్నికల ఓటరు జాబితా పరిశీలకులు మాణిక్ రాజ్ కన్నన్ అన్నారు. 2022 స్పెషల్ సమ్మరి రివిజన్ ఓటరు జాబితా రూపొందించడంలో భాగంగా నాగర్ కర్నూల్ ఎలక్టరోల్ రోల్ అబ్జర్వర్ మాణిక్ రాజ్ మంగళవారం కలెక్టరేట్ లో ఓటర్ జాబితా ఏర్పాటు పై సూపర్ చెక్ చేశారు. ఈ సందర్బంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి ఈ.ఆర్.ఓ…

ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి – అదనపు కలెక్టర్ మను చౌదరి

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ మను చౌదరి అదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 7ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అద నపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

పందిరి కూరగాయలు సాగుచేసి షెడ్యూల్డ్ కులాల వారు ఆర్థికంగా ఎదగాలి – అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేసిన 136 మంది లబ్ధిదారులు శాశ్వత పందిరి కూరగాయల పెంపకంలో రాణించి ఆర్థికంగా ఎదగాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూలు పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో ఎస్సీ కార్పొరేషన్ కింద ఎంపిక చేసిన 136 మంది లబ్ధిదారులకు కూరగాయల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రైతుల కోసం…

ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి – అదనపు కలెక్టర్ మను చౌదరి

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ మను చౌదరి అదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 19ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 10 రెవెన్యూ సమస్యలు, మిగతావి మునిసిపల్‌, పంచాయతీ, విద్య సంబంధించినవని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అద నపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

ఆత్మస్థైర్యంతో దివ్యాంగులు ముందుకెళ్లాలి – జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య

అంగ వైకల్యంతో కుమిలిపోవాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తోందని జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి పెద్దపల్లి పద్మావతి బంగారయ్య అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా నాగర్ కర్నూల్ జిల్లా లోని దివ్యాంగులకు జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య శుభాకంక్షలు తెలిపారు. దివ్యాంగులు ఆత్మ న్యూనతా భావాన్ని పక్కన పెట్టి ఆత్మస్తైర్యంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ లేదని ఆమె తెలిపారు. శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నాగర్…

వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి – అదనపు కలెక్టర్ మను చౌదరి

శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి కాలంలో వరికి ప్రత్యామ్నాయంగా పండించే ఆరుతడి పంటలపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ- వ్యవసాయ అనుబంధ రంగాల యాజమాన్య పద్ధతులు వ్యాస దీపిక గోడ పత్రికను అదనపు కలెక్టర్ మను చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్  మాట్లాడుతూ…. యాసంగి కాలంలో పండించే వరిని ఎఫ్ సి ఐ  వారు కొనుగోలు చేయటం లేదు కాబట్టి రైతుసోదరులందరూ గమనించి వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా  వ్యవసాయ…

ఎయిడ్స్ మహమ్మారి నిర్ములనకు జిల్లాలో పనిచేస్తున్న వివిధ స్వచ్చంద సంస్థలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో కలిసి సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి- జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

ఎయిడ్స్ మహమ్మారి నిర్ములనకు జిల్లాలో పనిచేస్తున్న వివిధ స్వచ్చంద సంస్థలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో కలిసి సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆరోగ్య శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు జిల్లాలో ఎయిడ్స్,…

ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ఉండేందుకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్

ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ఉండేందుకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు స్పెషల్ సమ్మరి రివిజన్, స్వీప్ యాక్టివిటీల పై పలు సూచనలు చేశారు. ప్రతినెల వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు బి.ఎల్.ఓ ల ద్వారా పరిశీలన జరిపి పరిష్కరించి ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో కొత్తగా నమోదు కై…

మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి- జిల్లా కలెక్టర్ పీ. ఉదయ్ కుమార్

2021-2023 సంవత్సరం మద్యం పాలసీ లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలో లింగాల షాప్ నెంబర్ 31, అమ్రాబాద్ మండలం తుర్కపల్లి 63 షాప్ నెంబర్ ల రెండు మద్యం దుకాణాలకు ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. గజిట్ సీరియల్ నెంబర్ 31 లింగాల మరియు అమ్రాబాద్ మండలం తుర్కపల్లి గజిట్ సీరియల్ నెంబర్ 63 మద్యం దుకాణాలకు అతి తక్కువ దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం ఈ రెండు…