Category: Nagarkurnool-Press Releases

పోడు భూముల హక్కులకై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిని క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా సర్వే చేసే విధంగా సన్నద్ధం కావాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

పోడు భూముల హక్కులకై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిని క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా సర్వే చేసే విధంగా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ శాఖ, పి.ఓ. ఐ.టి.డి.ఏ, రెవిన్యూ, సంబంధిత ఎంపిడిఓ లతో పోడు భూములపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 14 మండలాలకు సంబంధించి 93 గ్రామ పంచాయతిలలోని 138 హాబీటేషన్ల నుండి…

 జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యాలను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయ్యాలి- జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

  జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యాలను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ, వైద్యారొగ్య శాఖ పనితీరు వంటి అంశాల పై  గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలోకలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 627625 మందికి వ్యాక్సినేషన్ అందించాల్సి ఉండగా ఇప్పటివరకు దాదాపు 541337 (86%) మందికి మొదటి డోసు, 155389 (29%) మందికి రెండో వ్యాక్సినేషన్ పూర్తి చేశామని అధికారులు వివరించారు.…

నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు వేగం పెంచాలి – జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్

నాగర్ కర్నూలు జిల్లా నర్సింగ్ కళాశాల పనులను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు పట్టణ శివారులో ఉయ్యాలవాడ వద్ద నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా నిర్మిస్తున్న నర్సింగ్‌ కళాశాల జీ ప్లస్‌ టూ పనులను కలెక్టర్‌ పరిశీలిస్తూ పనులను నాణ్యతతో చేపట్టే విధంగా ఇంజనీరింగ్‌ అధికారులు నిరంతరం పరిశీలిస్తూ ఉండాలన్నారు. రూ.28 కోట్లతో సుమారు లక్ష చదరపు…

అర్హులైన వారికి జాబ్ కార్డ్ లు అందించాలి, జాతీయ ఉపాధి హామీ పథకం పనులను సమర్థవంతంగా నిర్వర్తించాలి -జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

అర్హులైన వారికి ఉపాధి హామీ జాబ్ కార్డ్ లు అందించి, జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను, జల శక్తి అభియాన్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వర్తించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం బిజినపల్లి మండలం పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయం లో కృషి విజ్ఞాన్ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు, జల శక్తి అభియాన్ నిర్వహణపై ఎంపీడీవోలు, ఎంపీవోలు,ఈసిలు, ఏపీవో…

జడ్పి సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవేనేత్తిన అంశాలను ఆయ ప్రభుత్వ అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి -జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి

జడ్పి సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవేనేత్తిన అంశాలను ఆయ ప్రభుత్వ అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి అన్నారు. సోమవారం స్థానిక తిరుమల గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి జడ్పి చైర్మన్ అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జడ్పి సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై ఆయ జిల్లా అధికారులు స్పందించి పరిష్కరించాలని,…

నాగర్ కర్నూల్ జిల్లాలోని  మద్యం షాపులకు  లక్కీ డీప్ ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి  జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ జిల్లాలోని మద్యం షాపులకు లక్కీ డీప్ ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం సుఖజీవన్ రావ్ ఫంక్షన్ హాల్లొ జిల్లా ఎక్సైజ్ శాఖ ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ నిర్వహించగా జిల్లా కలెక్టర్ పారదర్శకంగా లక్కీ డీప్ లు తీసి షాపులను టెండరుదారులకు కేటాయించారు. మొత్తం 67 షాపులకు 1507 టెండర్లు రావడం జరిగింది. ఇందులో కల్వకుర్తి సర్కిల్ లోని షాప్…

నాగర్ కర్నూల్ జిల్లాకు రాబోయే 2022-23 ఆర్ధిక సంవత్సరానికి రూ. 4660.08 కోట్ల రుణ ప్రణాళికను విడుదల చేసిన అదనపు కలెక్టర్ మను చౌదరి.

నాగర్ కర్నూల్ జిల్లాకు రాబోయే 2022-23 ఆర్ధిక సంవత్సరానికి రూ. 4660.08 కోట్ల రుణ ప్రణాళికను విడుదల చేసిన అదనపు కలెక్టర్ మను చౌదరి. శనివారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో జరిగిన  జిల్లా స్థాయి బ్యాంకర్లు, అధికారుల సంప్రదింపులు / జిల్లా స్థాయి సమీక్షా  సమావేశానికి  అదనపు కలెక్టర్ మను చౌదరి అధ్యక్షత వహించారు.  ఈ సందర్భంగా నాబార్డ్ డి.డి.యం. నాగార్జున వచ్చే సంవత్సరం జిల్లాలో  రుణ ప్రణాళిక పుస్తకాన్ని…

వారం వారం పక్కా ప్రణాళికతో కలెక్టరేట్, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

వారం వారం పక్కా ప్రణాళికతో కలెక్టరేట్, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ నూతన కలెక్టరేట్, నర్సింగ్ కళాశాల నూతన భవనాలు చేపడుతున్న నిర్మాణ పనులు వారం వారం  ప్రణాళికలతో అనుకున్న సమయానికి నిర్మాణ పనులు సకాలంలో పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు జిలా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలో ఉయ్యాలవాడ…

ఉపాధి’లో కూలీల సంఖ్య పెంచండి – అదనపు కలెక్టర్ మను చౌదరి

ఉపాధి’లో కూలీల సంఖ్య పెంచండి – అదనపు కలెక్టర్ మను చౌదరి జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని ఎంపీడీఓలు, ఎంపీఓలను అదనపు కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలతో ఉపాధి హామీ, హరితహారం నర్సరీలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ… జాతీయ ఉపాధిహామీ పనుల్లో భాగంగా హరితహారం, నర్సరీలు,  శ్మశానవాటికల నిర్మాణం తదితర పనులు చేపట్టాలని సూచించారు.…

చెంచు పెంటల్లోని ప్రతి కుటుంబం నుండి పోడు భూమి హక్కులకై  దరఖాస్తు తీసుకునే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

చెంచు పెంటల్లోని ప్రతి కుటుంబం నుండి పోడు భూమి హక్కులకై దరఖాస్తు తీసుకునే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయాన్నే ఐ.టి.డి.ఏ, డి.ఎఫ్.ఓ, ఆర్డీఓ తదితర అధికారులతో అప్పాపూర్, మల్లా పూర్ తదితర చెంచు పెంటలను సందర్శించి గ్రామ సభలు నిర్వహించారు. అప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హాబీటేషన్ల పెంటల ప్రజలతో గ్రామ సభను ఏర్పాటు చేసి పోడు భూమి దరఖాస్తు చేసుకోవడం పై అవగాహన…