Category: Nalgonda-Photo Gallery

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ నుండి తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓ.లు, ఎం.పి.ఓ.లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని గ్రామ పంచాయితీ ల పరిధిలో ఒక ఎకరం స్థలంకు తగ్గకుండా l తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.  జూన్ 2వ తేదీ వరకు ప్రతి మండలంలో  రెండు చోట్ల క్రీడా ప్రాంగణాలను ప్రారంభించడానికి స్థలాలతో అవసరమైన మరమ్మత్తులు చేయించాలని మండలస్థాయి అధికారులను ఆదేశించారు.…

గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై, అమృత్ 2 కింద చేపట్టనున్న మురుగు నీటి పారుదల,మంచి నీటి సరఫరా పనుల పై నల్లగొండ శాససనభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి నల్గొండ మున్సిపల్ కౌన్సిలర్ లు, మున్సిపాలిటీ అధికారులు, ప్రజారోగ్య శాఖ అధికారులు, ఏజెన్సీ లతో సమావేశం జరిపి అమృత్ 2 కింద చేపట్టనున్న యు.జి.డి, మురుగు నీటి…

బుధవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి పై జిల్లా కలెక్టర్ లు,అదనపు కలెక్టర్ లతో నిర్వహించిన సమావేశం కు హాజరైన నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

వాతావరణ పరిస్థితులు మారుతున్నందున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేసి వచ్చే పది రోజుల్లో కొనుగోళ్ళు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అదనపు కలెక్టర్ చాంబర్ లో పౌర సరపరాల శాఖ,జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, సహకార శాఖ,వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ,మిల్లర్ల లతో యాసంగి ధాన్యం కొనుగోళ్ళ పై అదనపు    కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…

మంగళవారం నాడు  నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలసి నల్లగొండ పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి  వల్లభరావు చెరువును సందర్శించారు.వల్లభ రావు చెరువు చుట్టూ ట్యాంక్ బ్యాండ్ ను అద్భుతంగా తీర్చిదిద్దాలని మంత్రి అన్నారు.   హైదరాబాద్ లోని జల విహార్, నెక్లెస్ రోడ్ లాగా  సుందరీకరణ చేయాలని సూచించారు. . అంతే గాకా సందర్శకులు విహరించడానికి హౌస్ బోట్స్, పార్కులను, సీటింగ్…

మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో చర్లగూడెం జలాశయం పరిధిలోని భూ నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చర్లగూడెం జలాశయం పరిధిలో స్థలాలు కొల్పోతున్న బాధితులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి మర్రిగూడ లేదా ఇతర మండలాలలోని భూములను గుర్తించాలని దేవరకొండ ఆర్.డి.ఓ.ను ఆదేశించారు. అధికారులకు అన్నిరకాలుగా సహాకరించినా నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని బాధితులు కలెక్టర్ కు మొరపెట్టుకోగా  వెంటనే కలెక్టర్ స్పందిస్తూ శుక్రవారం లేదా శనివారం వరకు…

సోమవారం సాయంత్రం పదవ తరగతి పరీక్షలు నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లు,జిల్లా విద్యా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని ఆయన తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రశ్నా పత్రం తెరిచే గదిలో సి.సి కెమెరాలు ఏర్పాటు చేయాలనీ, అదేవిధంగా పరీక్ష కేంద్రం బయట సైతం సిసి కెమెరా పెట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని…

నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ చర్లపల్లిలో అర్బన్ పార్కు పనులు పరిశీలించి పార్కు ప్రహారీ గోడ నిర్మాణం గురించి చర్చించారు. డ్రైనేజీ కాలువ పనులు కూడా చేయాలని అధికారులు, ఏజెన్సీలకు సూచనలు జారీ చేశారు. అనంతరం మర్రిగూడ బైపాస్ జంక్షన్ అభివృద్ధి పనులతోపాటు ఫ్లై ఓవర్ నిర్మాణం జరగనున్నందున…

ప్రజావాణి సమస్యలను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్  సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి  కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి  సమస్యల పై  దరఖాస్తులను డి.అర్. ఓ జగదీశ్వర్ రెడ్డి తో కలిసి  అదనపు కలెక్టర్ స్వీకరించారు.  ప్రజల నుండి  అందిన  దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు పంపినట్లు వారు తెలిపారు. ఇందులో అత్యధికంగా  రెవెన్యూకు,పంచాయతీ శాఖ కు…

నల్గొండ, మే 14. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సారథ్యం లో  తెలంగాణ రాష్ట్రం  సత్వర అభివృద్ధి తో ప్రగతి పథం లో దూసుకు వెళుతోందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణ అభివృద్ధి,పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. శనివారం  నాగార్జునసాగర్ నియోజకవర్గం లోని హలీయా పట్టణం లో హాలియా మున్సిపాలిటీ,నంది కొండ మున్సిపాలిటీ లలో 56 కోట్ల రూ.లతో చేపట్టిన పనులకు రాష్ట్ర ఐ. టి.పురపాలన,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె.…