Category: Nalgonda-Press Releases

ప్రజావాణిలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని ఆదనపు కలెక్టర్ .వి.చంద్ర శేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్  సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణి  కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ స్వీకరించారు.  ప్రజల నుండి  అందిన  దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు పంపినట్లు తెలిపారు. దరఖాస్తులను  ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో  ఉన్న సమస్యలకు…

నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న అన్ని మండల ప్రభుత్వ కార్యాలయాలలో     మండల  తాసిల్దార్ కార్యాలయం   ఆవరణలో మండల ఎం పి డి  వో కార్యాలయ ఆవరణ వద్ద ప్రాధమిక , ఆరోగ్య కేంద్రాల వద్ద, పోలీస్ స్టేషన్లో ఆవరణలో  అన్ని రకాల దిన పత్రికల రిపోర్ట్ ల, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల పేర్లు చరవాణి నెంబర్లు  పత్రికల పేర్లూ, మీడియా పేర్లతో ఉన్న పూర్తి సమాచారాన్ని ఆ యొక్క మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో గోడపై…

   శ్రీ కె. వీర బ్రహ్మ చారి, ముఖ్య కార్య నిర్వహణధికారి, జిల్లా ప్రజా పరిషత్, నల్లగొండ గారు రెవిన్యూ డిపార్ట్మెంట్ కి         రిపాట్రియేషన్ కాబడినందున, శ్రీ యన్. ప్రేమ్ కరణ్ రెడ్డి గారిని నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణధికారీగా ప్రభుత్వం వారు పోస్టింగ్ గావించుట జరిగినది.  ఈ సందర్బంగా  శ్రీ యన్. ప్రేమ్ కరణ్ రెడ్డి గారు ఈ రోజు గౌరవ శ్రీ బండ నరేందర్ రెడ్డి,…

అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవ సందర్బంగా తెలంగాణ రాష్ట్రము లోనే ఏకైక ఉత్తమ జీవ వైవిద్య కమిటీ గా నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ ఎన్నిక కాబడినందున  హైదరాబాద్ లోని భాస్కర ఆడిటోరియం నందు నిర్వహించిన కార్యక్రమం నందు శ్రీ రజత్ కుమార్, ఐ. ఎ. ఎస్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర జీవ వైవిద్య కమిటీ చైర్మన్ గారి చేత ప్రశంస పత్రం మరియు షీల్డ్ స్వీకరిస్తున్న శ్రీమతి జి. కాంతమ్మ, ఉప…

నల్గొండ పట్టణం కలెక్టరేట్ పక్కన పొట్టి శ్రీ రాములు విశ్వ విద్యాలయం జాన పద కళాక్షేత్రం కు కేటాయించిన స్థలం లో ఏర్పాటు చేయనున్న హెలిపాడ్ నుండి కలెక్టర్ కార్యాలయం కు రోడ్డు కు అర్&బి అధికారులు మార్కింగ్ చేశారు .జిల్లా కలెక్టర్ శనివారం హెలిపాడ్ నుండి కలెక్టర్ కార్యాలయం కు రోడ్డు వేయుటకు మార్కింగ్ పరిశీలించి అర్&బి డి. ఈ. బేగ్ కు సూచనలు చేశారు.

శుక్రవారంనాడు తిప్పర్తి మండలం రాజుపేట గ్రామంలో పల్లె ప్రగతి, ప్రొఫెసర్ జయశంకర్ బడిటా, మన ఊరు – మన బడి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి గ్రామ పంచాయితీలో పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దడమే  కాక, ఇంగ్లీష్ మీడియం…

ఎం‌పి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారి ఆరోపణలతో  వివిద దినపత్రికలలో తేదీ.26.05.2022న “నార్కెట్ పల్లి పెద్ద చెరువు కబ్జా ” అనే శీర్షికతో ప్రచురించబడిన ప్రతికూల వార్తలకి స్పందించి జిల్లా కలక్టర్ గారి అధెశానుసారం ఇరిగేషన్ ఈ ఈ  , ఏ డి  సర్వే మరియు రెవెన్యూ డివిజన్ అధికారి మరియు నార్కాటపల్లి తఃసీల్దార్  సంయుక్తంగా  పెద్ద చెరువు వాటి పరిసరాలు పరిశీలించి చెరువు లేవల్స్ ప్రకారము సర్వే జరిపి నిర్ణయించిన FTL ప్రకారము ప్రస్తుతము…

జిల్లాలో ని రైస్ మిల్లర్లు 2020-21 సంవత్సరపు యాసంగి పెండింగ్ సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) డెలివరీ జూన్ 30 లోగా పూర్తి చేయాలని  అదనపు కలెక్టర్‌ వి.చంద్ర శేఖర్ మిల్లర్ లను ఆదేశించారు.ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగించిందని,ఇంకా 6 మిల్లు లు 12000 మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్ డెలివరీ చేయాలని,జూన్ 30 లోగా పూర్తి చేయాలని అన్నారు . యాసంగి 2021-22 లో ఇప్పటి వరకు 3,26,700 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు,దాదాపు ధాన్యం…

గురువారం నల్గొండ కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్ లో పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల ఎమ్మేల్యేలు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, ఎం.పి.డి.ఓ.లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమీషనర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగ దీశ్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయితీలలో పల్లె ప్రగతి,పట్టణంలలో పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున అధికారులు ప్రజాప్రతినిధులకు…

గురువారం జిల్లా కేంద్రం లో గుండగోని  మైసయ్య కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన లో కవులు కళాకారులది కీలకపాత్ర అని అన్నారు. లక్షల పుస్తకాలు చదివినా రాని జ్ఞానం ఒక పాట ద్వారా మాత్రమే వస్తుందని దానికి ఉదాహరణగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటల ద్వారా ప్రజలను…