Category: Nalgonda-Press Releases

  జిల్లాలోని అన్ని కళాశాలల విద్యార్థుల ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్లను,పెండింగ్ స్కాలర్ షిప్ దరఖాస్తు లను వేగవంతంగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  వి.చంద్ర శేఖర్ సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ లను   ఆదేశించారు.      శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్ లో   కళాశాల స్థాయి ఉపకార వేతనం లపై నిర్వహించిన  సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విద్యార్థులందరికీ  ఉపకార వేతనాలు అందేలా కృషి చేయాలని,     …

మును గోడ్ మండలం గూడా పూర్ గ్రామం లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు .కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అదనపు కలెక్టర్ డి.ఆర్.డి.ఓ కాళిందిని, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ డి.యం.నాగేశ్వరరావు, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం తదితరులు

నల్గొండ, డిసెంబర్ 1:  డిసెంబర్ చివరి వరకు రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి టి. హరీష్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్, తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు హరీష్ రావు, కె. తారకరామారావు, సబితా ఇంద్రారెడ్డి లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 2.77 కోట్ల జనాభా లక్ష్యానికి…

నల్గొండ,డిసెంబర్ 1.జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ డిసెంబరు చివరి వరకు  వంద శాతం పూర్తి చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సూక్ష్మ ప్రణాళిక రూపొందించి వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ వ్యాక్సినేషన్ పై సమీక్షించి కలెక్టర్ పలు సూచనలు చేశారు.జిల్లాలో ఇప్పటి వరకు మొదటి డోస్ 91 శాతం పూర్తి చేసి రాష్ట్ర సరాసరి శాతం…

బుధవారం ఓటర్ నమోదు కార్యక్రమం గరుడ యాప్ వినియోగం పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుండి ఫారం-7 ద్వారా తీసుకొని లేదా…

నల్గొండ,నవంబర్ 30. నల్గొండ స్థానిక సంస్థల ఎం.ఎల్.సి.ఎన్నిక లలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన చాంబర్ లో స్థానిక సంస్థల ఎం.ఎల్.సి.ఎన్నిక లలో పోటీ చేస్తున్న అభ్యర్థుల తో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎల్.సి.ఎన్నికల షెడ్యూల్ వివరించి,ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించి ఎన్నికకు సహకరించాలని కోరారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన కోవిడ్…

నల్గొండ, నవంబర్ 30. యాసంగి లో వరిని సాగు చేయవద్దని,వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని,రైతులు ఈ విషయం గమనించి వరి కి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని రైతాంగానికి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.మంగళ వారం జిల్లా కలెక్టర్ నల్గొండ పట్టణంలో అర్జాల బావి వద్ద పి.ఏ.సి.ఎస్.వరి దాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్లు పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర భారత ఆహార సంస్ధ( FCI)…

* డిసెంబర్ 10 వ తేదీన నిర్వహించబోయే స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలను ప్రిసైడింగ్ మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని రెవిన్యూ డివిజన్ కేంద్రాలలో మొత్తం 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది…