Category: Nirmal-Photo Gallery

ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి జిల్లా పాలనాధికారి ముషర్రఫ్ ఫారుఖీ. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదులలో భాగంగా ఈరోజు అర్జీ దారుల నుండి 25 దరఖాస్తు లు వచ్చాయని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అన్నారు. సోమవారం జిల్లా పాలనాధికారి కార్యాలయం లో నిర్వహించిన ప్రజావాణి లో వివిధ గ్రామాల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను వింటూ తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని సంబంధిత…

పల్లె ప్రగతి కార్యక్రమం లో ప్రతీ ఒక్కరు భాగస్వాములై పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అన్నారు. శనివారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పల్లెప్రగతి పనులలో క్రిమిటోరియం శేగ్రీగేషన్ షెడ్స్, పల్లె ప్రకృతి వనాల పై ఎంపీడీఓ ఎంపీవో లతో సమీక్షా సమావేశం అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తో నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి ప్రతీ మండలాల గ్రామాలలోని జనాభా, ఎన్ని కిలోల చెత్త…

పదవ తరగతి పరీక్షలు పక డ్బెందిగా నిర్వహించాలి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. వచ్చే నెల మే, 23 నుండి నిర్వహించనున్న 10 వ తరగతి పరీక్షలను సాఫిగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అన్నారు. శుక్రవారం జిల్లా పాలనాధికారి మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో వివిధ శాఖల అధికారులతో 10 వ తరగతి పరీక్షల ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా…

ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్ పంపిణి చేసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పి ఛైర్పర్శన్ విజయలక్ష్మి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. ప్రతీ పండుగను అందరు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశం తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా, ముందుకెళుతుందని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి…

యాసంగి లో రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి కనీస మద్దతు ధర పొందాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పాలనాధికారి సమావేశం మందిరంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ తో కలసి చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడు…

అంబేద్కర్‌ ఆశయాల స్ఫూర్తితో.. దళితాభివృద్ధికి అనేక పథకాలు* దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ దళితబంధు అనేక విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు*. ద‌ళితుల అభ్యున్న‌తి కోసం ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 60 వేల కోట్లు వెచ్చించాం. దళితబంధుకు రూ.17,700 కోట్లు ఈ ప‌థ‌కం ద్వారా 17 ల‌క్ష‌ల కుటుంబాల‌కు మేలు* *అంబేద్కర్‌ 131వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌…

తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14నుండి 20వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ తెలిపారు. బుధవారం తన ఛాంబర్ లో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రతల గురించి ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడం ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ లో డి. జయంత్ రావ్,…

ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 16 వరకు స్వీకరించాలి – జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి. మంగళవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో రాజకీయ పార్టీ నాయకులతో ఓటర్ల జాబితా తయారు మరియు సంబంధిత అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయితీ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వార్డుల వారీగా మరియు గ్రామ పంచాయతీల వారీగా తయారు చేసిన ఓటర్ల జాబితా గ్రామపంచాయితీ లలో మూడు ముఖ్యమైన ప్రదేశాల్లో గ్రామపంచాయతి,…

మహాత్మ జ్యోతి భా పూలే అడుగుజాడలలో నడవాలి: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన జ్యోతి బాపూలే అందరికి ఆదర్శప్రాయుడు : జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. సోమవారం మహాత్మా జ్యోతి బా పూలే 196 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా పాలనాధికారి కార్యాలయం లో జ్యోతి ప్రజ్వలన గావించి,మహాత్మా జ్యోతి బా పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతి బా…

తేది :08.04.2022 నిర్మల్ జిల్లా శుక్రవారం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుచున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ ఆదేశించారు. ఈ వేసవి కాలం రాబోయే మూడు మాసాలు ఎంతో కీలకమని, ప్రజలు వీలైనంత మేర పగటిపూట ఇంటివద్దనే గడపాలని, అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని సూచించారు. వేసవి కాలం దృష్ట్యా ఎండల తీవ్రత, వడదెబ్బ, మరణాలను తగ్గించడానికి తీసుకోవలసిన చర్యలు, హరితహారం పై చర్చించుటకు, శుక్రవారం జిల్లా పాలనాధికారి…