Category: Nizamabad-Photo Gallery

మోపాల్ మండలం కంజర గ్రామంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామ పంచాయతీని సందర్శించి పల్లె ప్రగతి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోశమ్మ వాగుకు ఆనుకుని వైకుంఠధామం వద్ద ఉపాధి హామీ కూలీల ద్వారా చేపడుతున్న పనులను పరిశీలించారు. వర్షాకాలంలో వాగు ద్వారా వచ్చే వరద జలాలను నిలువరించేందుకు వీలుగా పకడ్బందీ పనులు జరిపించాలని అధికారులకు సూచించారు. వైకుంఠధామం ప్రాంగణం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, ఎగుడుదిగుడుగా ఉన్న ప్రదేశాన్ని చదును చేసి ఖాళీ…

స్వాతంత్ర్యాన్ని సాధించడంలో గాంధీజీ పాటించిన అహింసా మార్గమే ప్రతి ఒక్కరికి అనుసరణీయం అని దాని ద్వారా దేనినైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. జాతిపిత మహాత్మ గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం నాడు నగరంలోని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు మనమందరం ఒక మంచి స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నామంటే, మనకు కావలసిన…

పిల్లల చిరునవ్వు, పలకరింపులతో వారి తల్లిదండ్రుల ఆరోగ్యం రెట్టింపవుతుందని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహిళ-శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన సీనియర్ సివిల్ జడ్జి DLSA సెక్రెటరీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవితంలో ఎంతో ముందుకు వెళ్లినా, ఎన్ని పదవులు అలంకరించినా తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనేనని ప్రతి ఒక్కరు…

విద్యార్థులు తమ భయాందోళనల్ని విడిచి పెట్టి సంపూర్ణ మైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని, ఈనాటి వైజ్ఞానిక సమాజంలో మారుతున్న విద్యార్థులు సాంకేతికతను అర్థం చేసుకొని విద్యార్థులు ముందుకు సాగాలని రాష్ట్ర ఎన్నికల కమిష నర్, తెలంగాణ విశ్వవిద్యాలయం పూర్వవైస్ ఛాన్సలర్ సి. పార్థసారధి ఉద్బోధించారు. తెలంగాణ విశ్వవిద్యాలయా స్థాపన దినోత్సవం సందర్భంగా గురువారం డిచ్ పల్లి మెయిన్ క్యాంపస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కలాశాలలో జరిగిన కార్య గ్రామంలో పార్థసారథి…

రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజలు అంటురోగాల బారిన పడకుండా నివారణ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుండి సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలతో పారిశుద్ధ్యం పేరుకుపోయి ఉండే అవకాశం ఉందని అదేవిధంగా ప్రజల ఆవాసాలలో చెడు నీరు ఆగి ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉన్నందున ఈ దిశగా నివారణ చర్యలు…

ఎస్ ఆర్ ఎస్ పి (నిజామాబాద్), సెప్టెంబర్ 28:– గులాబ్ తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసినప్పటికీ కొంతమేర పంట నష్టం మినహా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం నుండి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి…

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ వల్ల నిజామాబాద్,కామారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని,కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి…

జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల లో పథకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా అడిషనల్ కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్ సన్మానించి అభినందించారు. ఈనెల 19 నుంచి 23 వరకు ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ లో జరిగిన 33 వ సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ జాతీయ పోటీలలో జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జట్టు తరఫున 1) S. సౌమ్య రాణి, 2) L. రాణి, 3) K. సృజన, 4) G. సౌందర్య లు పాల్గొని జట్టు విజయంలో…

కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని బీసీ సంక్షేమ శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ నీతూ కిరణ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా తో కలిసి జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు అతిథిగా కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ 106 జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. జ్యోతి ప్రజ్వలన గావించి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.…

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ వల్ల నిజామాబాదు తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు తెలిపారు. సోమవారం ప్రగతి భవన్ లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ తుఫాన్ వల్ల…