Category: Nizamabad-Press Releases

  నిజామాబాదు, జనవరి 25 : భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన ఓటు హక్కు ఎంతో గొప్ప ఆయుధం అని నిజామాబాదు జిల్లా జడ్జి శ్రీమతి సునీత అభివర్ణించారు. ఓటు హక్కు ఔన్నత్యాన్ని గుర్తెరిగి అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని హితవు పలికారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రగతి భవన్ లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్…

ఇంటింటి ఆరోగ్యం సర్వే, హరితహారం మొక్కల నిర్వహణ, కొవిడ్ నియంత్రణకై చేపడుతున్న వాక్సినేషన్ కార్యక్రమాలకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్ లో జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటింటి ఆరోగ్యం సర్వే వివరాల గురించి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం వివరాలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో మొత్తం 348941 నివాస గృహాలు ఉండగా, సర్వే నిమిత్తం 1240…

  ఈరోజు కమ్మర్పల్లి స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమం లో జరిగిన ఈ కార్యక్రమంలో మహమ్మదాబాద్ , గుజరాత్ లో జరిగిన సబ్-జూనియర్ మరియు ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నంలో జరిగిన జూనియర్ జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలలో జిల్లా క్రీడాకారులు:1) జి శృతి, 2)జి.మమత 3) ఎస్ .సౌమ్య రాణి, 4) ఎల్.రాణి, 5)జే వైశాలి,6) కే సృజన 7) జి సౌందర్య లు ( సాంఘిక సంక్షేమ కళాశాల,సుద్ధపల్లి) 8) డి.మౌనిక (సాంఘిక సంక్షేమ కళాశాల, తాడ్వాయి),…

  నిజామాబాదు, జనవరి 21 : యువత దురలవాట్లను దూరం చేసుకుని సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు ఎంతగానో దోహద పడతాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తమ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తోందని అన్నారు. నిజామాబాదు జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలో 2 .5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మినీ స్పోర్ట్స్ స్టేడియంకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభోత్సవం…

నిజామాబాదు, 19 జనవరి : అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న హరితహారం కార్యక్రమం అమలులో నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెన్షన్ వేటు తప్పదని, అధికారులు, సిబ్బంది ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. హరితహారం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నర్సరీల ఏర్పాటు తదితర అంశాలపై  బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీవోలతో  సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  వచ్చే…

  ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న ప్రైవేట్ వ్యాపార సంస్థలు, సముదాయాల ఆవరణల్లోనూ విరివిగా మొక్కలు నాటించాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం డిచ్ పల్లి మండలం ధర్మారం, బర్దీపూర్ గ్రామ శివార్లలోని నిజామాబాదు – హైదరాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. ఈ మార్గంలో కళ్యాణ మండపాలు, పెట్రోల్ బ్యాంకులు, మార్బల్ షాప్స్ తదితర దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాలను గమనించిన కలెక్టర్ వాటి ఆవరణలు, ఖాళీ…

క్షేత్రస్థాయిలో హరితహారం మొక్కల పరిశీలన నిజామాబాదు : హరితహారం కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధతో పకడ్బందీగా అమలు చేయాలని, ఎవరైనా తమ పనితీరును మార్చుకోకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. హరితహారంను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కలెక్టర్ నారాయణ రెడ్డి మంగళవారం నిజామాబాదు గ్రామీణం, మోస్రా, చందూర్, వర్ని మండల కేంద్రాలతో పాటు వాటి పరిధిలోని చింతకుంట, వకీల్ఫారమ్, అఫన్దిఫారం, శ్రీనగర్, వర్ని సత్యనారాయణపురం తదితర…

  హరితహారం, దళిత బంధు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చే మరో ఆరు నెలల పాటు ఈ రెండు కార్యక్రమాల పైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి హరితహారం, దళిత బంధు కార్యక్రమాలపై కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీటిని…

  హరితహారం, దళిత బంధు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చే మరో ఆరు నెలల పాటు ఈ రెండు కార్యక్రమాల పైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి హరితహారం, దళిత బంధు కార్యక్రమాలపై కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీటిని…

  ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయ ప్రగతిభవన్ లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ లో…