Category: Nizamabad-Press Releases

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో లబ్ధిదారులు స్వయం సమృద్ధిని సాధించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. దళితబంధుపథకం కింద తొలి విడతలో ఎంపికైన బాల్కొండ నియోజకవర్గ లబ్దిదారులకు గురువారం వేల్పూర్ మార్కెట్ యార్డు ఆవరణలో మంత్రి వేముల ఆయా యూనిట్లను పంపిణీ చేశారు. ఇదివరకే 86 మందికి వివిధ యూనిట్లను అందజేయగా, గురువారం మరో 14 మందికి వారు…

మైనారిటీల సంక్షేమం కోసం ఉద్దేశించిన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది సూచించారు. సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్న వారిలో అత్యధికులు ముస్లిం మైనారిటీలే ఉన్నందున వారి అభ్యున్నతి కోసం కృషి చేయాల్సిన గురుతర బాధ్యత మన అందరిపై ఉందన్నారు. బుధవారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన ఆమెకు ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి,…

పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్ సి.నారాయణరెడ్డి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని మానిక్ భవన్ పాఠశాలతో పాటు కాకతీయ హై స్కూల్ ఎగ్జామ్ సెంటర్లను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అన్నది సి.సి కెమెరా ఫుటేజీ ల పరిశీలన ద్వారా…

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ప్రజావాణి…

పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వ్వాచ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో పాటు పరీక్షల నిర్వహణ విధులు నిర్వర్తించే చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు కూడా సెల్ ఫోన్ అనుమతించబడదని స్పష్టం చేశారు. ఈ నెల 23 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఎస్సెస్సీ వార్షిక పరీక్షల తుది ఏర్పాట్ల పై కలెక్టర్ శనివారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.…

జిల్లా ప్రభుత్వ కార్యాలయాల నూతన భవన సముదాయాన్ని (న్యూ కలెక్టరేట్) కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సముదాయంలోని పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మెయిన్ గేటు నుండి కార్యాలయాల వరకు గల ప్రధాన రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించి పూల చెట్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సముదాయం ప్రాగణమంతా పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపించాలని, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని, చేతా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి…

మహిళా స్వయం సహాయక సంఘాలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. వ్యాపారాల నిర్వహణ కోసం ముందుకు వచ్చే వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన లబ్దిని చేకూర్చి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని అన్నారు. మెప్మా, నిజామాబాద్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వి.హబ్ సహకారంతో వర్ని రోడ్ లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు నూతనంగా నెలకొల్పిన టైలరింగ్ అండ్ గార్మెంట్స్ షాప్ ను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. కరోనా…

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ & తానా ఫౌండేషన్(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) వారి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా, నందిపెట్ మండలం , ఆంధ్ర నగర్ గ్రామంలో శుక్రవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించాలని పేద ప్రజలకు మేలు జరిగేలా చూడాలని…

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం చౌడమ్మ కొండూరు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో గోదావరి ఒడ్డున నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ నిర్మాణం తో పాటు, నందిపేట లక్కంపల్లి నుండి సిహెచ్.కొండూరు వరకు ఏర్పాటు చేస్తున్న రోడ్డు నిర్మాణం పనులను క్షేత్ర స్థాయి పరిశీలన జరిపారు. ఆలయ నిర్మాణం ఒకింత వేగవంతంగానే జరుగుతున్నప్పటికీ, రోడ్డు నిర్మాణ పనులు మందకొడిగా సాగడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే పనులను…

ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఏ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం కల్పించకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో చీఫ్ సూపరింటెండెంట్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్ ఎస్ సి పరీక్షలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుందని అన్నారు. ఏ చిన్న తప్పిదానికి ఆస్కారం కల్పించినా…