Category: Rajanna Sircilla-What’s Happening

పంటల సాగుతో పాటు ప్రాసెసింగ్ పై దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ——————————- జిల్లాలోనీ చేసిన మండలాలలో వైవిద్య పంటల సాగును ప్రోత్సహించడంతోపాటు పంటలను ప్రాసెసింగ్ చేసే విధానాలపై రైతులు దృష్టి పెట్టేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. ప్రభుత్వ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ లో భాగంగా జిల్లాలోని కోనారావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ ,సిరిసిల్ల మండలాలలో నాలుగు రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (FPO) ఎంపిక చేయటం జరిగింది.…

వ్యవసాయ,అనుబంధ రంగాలకు బ్యాంకర్ లు విరివిగా రుణాలు ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ——————————- జలవనరుల లభ్యత అధికంగా ఉండడం, వ్యవసాయ , అనుబంధ రంగాల అభివృద్ధికి రాజన్న సిరిసిల్ల జిల్లా లో అధిక అవకాశం ఉన్న దృష్ట్యా వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వ్యవసాయ రుణాలు విరివిగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బ్యాంకు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ నందు జిల్లా సంప్రదింపుల కమిటీ,…

ఎల్లారెడ్డి పేట లో స్టేట్ కల్చరల్ ఫెస్ట్ – ఈ నెల 30, అక్టోబర్ 1 న రెండు రోజుల పాటు స్టేట్ కల్చరల్ ఫెస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ స్టేట్ కల్చరల్ ఫెస్ట్ 2022-2023 రెండు రోజుల పాటు జరగనుంది. ఈ నెల 30 న ప్రారంభం కానున్న స్టేట్ కల్చరల్ ఫెస్ట్ అక్టోబర్ 1 న ముగియనుంది.…

  ఏవెన్యూ ప్లాంటేషన్ లో గ్యాప్ లు లేకుండా చూసుకోవాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఏవెన్యూ ప్లాంటేషన్ లో గ్యాప్ లు లేకుండా చూసుకోవాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు.   సిరిసిల్ల పట్టణం రగుడు జంక్షన్ నుండి వేములవాడ నంది కమాన్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా నాటిన మొక్కలను సంబంధిత అధికారులతో కలిసి బుధవారం క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.…

ఆప్యాయంగా పలకరిస్తూ.. యోగక్షేమాలు తెలుసుకుంటూ… – బిజీ షెడ్యుల్ లోనూ రగుడులో 50 నిమిషాల పాటు ప్రజల మధ్యలో మంత్రి మంగళవారం సాయంత్రం సిరిసిల్ల పట్టణ పర్యటనలో చివరగా మంత్రి శ్రీ కే తారక రామారావు రగుడు మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రం ను ప్రారంభించారు. కేంద్రం సమీపంలోనే కిచెన్ గార్డెన్ ను మంత్రి ప్రారంభించారు. అంతకుముందు రాగుడు అంగన్వాడి కేంద్రానికి వెళ్ళే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఒక్కొక్కరిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు.…

తెలంగాణ వైతాళికుల గొప్పతనాన్ని, త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలిసేలా చేసేందుకే నూతన జిల్లాలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలకు వారి పేర్లు : మంత్రి శ్రీ కే తారక రామారావు ——————————- తెలంగాణ పోరాట యోధులు మహనీయుల గొప్పతనాన్ని గుర్తించే, వారి ఘన వారసత్వం కు గర్వపడే సంస్కారం రాష్ట్ర ప్రభుత్వం కు ఉందని మంత్రి శ్రీ కే తారక రామారావు అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన వెంటనే ఎవ్వరూ అడగకుండానే తెలంగాణ వైతాళికుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలిసేలా…

కలెక్టరేట్ లో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ…

బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ——————————- జిల్లాలో బతుకమ్మ పండుగ వేడుకలను ఈనెల 26 నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు ఒక్కో రోజు ఒక్కో నేపథ్యంతో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్…

  *ప్రస్తుత,భవిష్యత్తు తరాలకు చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* ——————————- తెలంగాణ పోరాటాలకు స్ఫూర్తి ప్రధాత వీరనారి చాకలి ఐలమ్మ జీవితం ప్రస్తుత తరాలకే కాదు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా…

జిల్లాలో 27,28 వ తేదీల్లో ఆహార శుద్ధి పరిశ్రమల మెషినరీ ప్రదర్శన : జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ————————————— జిల్లాలో మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ఔత్సాహికులు ముందుకు రావాలని, దీనిపై అందరికీ అవగహన కల్పించేందుకు జిల్లా కలెక్టరేట్ లో 27,28 (మంగళ, బుధ) తేదీల్లో మెషినరీ ప్రదర్శన ఉంటుందని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు తెలిపారు. ఈ మేరకు…