Category: Rajanna Sircilla-What’s Happening

*బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ మహానీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి:: అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్* రాజాన్న సిరిసిల్ల, ఏప్రిల్ 1: బాబు జగ్జీవన్ రామ్, డా. బీఆర్. అంబేద్కర్ మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. ఏప్రిల్ 5 న బాబు జగ్జీవన్ రామ్, 14 న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మహానీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం సమీకృత జిల్లా…

  *ఎఎన్సీ రిజిస్ట్రేషన్, సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి సారించాలి :: రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ* రాజన్న సిరిసిల్ల, మార్చి 31: ఎఎన్సీ రిజిస్ట్రేషన్ ( గర్భిణీ స్త్రీల నమోదు), సాధారణ ప్రసవాలపై వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ అన్నారు. గురువారం సాయంత్రం…

  *పరిశుభ్రతను పాటించాలి:: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్* రాజన్న సిరిసిల్ల, మార్చి 31: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లోపల, పరిసరాల్లో పరిశుభ్రత ను పాటించాలని అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. గురువారం దేవస్థాన సమావేశ మందిరంలో ఆలయ ఇవో రమాదేవి తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడి చెరువు పార్కింగ్ స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, వాసన రాకుండా జాగ్రత్తలు…

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా కె. కౌటిల్య చేసిన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్‌ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నతి పొంది, ఇడి, టీఎస్ఎంఎస్ఐడిసి గా హైదరాబాద్ కు బదిలీ అయిన సంద ర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు బి. సత్యప్రసాద్, ఎన్. ఖీమ్యా నాయక్ లతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విధి…

*వారం రోజుల్లోగా వసతి గృహాలను సిద్ధం చేయాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* రాజన్న సిరిసిల్ల, మార్చి 31: రాబోయే వారం రోజుల్లోగా సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో చేపడుతున్న ఆధునికీకరణ పనులను పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం కలెక్టర్ గీతానగర్ లోని బాలికల వసతి గృహం, సుందరయ్య నగర్ లోని బాలుర వసతి గృహాన్ని క్షేత్ర స్థాయిలో సందర్శించి,…

  *ఈ- హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమ తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఈ- హెల్త్ ప్రొఫైల్ లో భాగంగా ప్రజల నుండి నమూనాల సేకరణ తీరును జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గురువారం కలెక్టర్ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పర్యటించి, ఇంటింటికీ తిరిగి వైద్య సిబ్బంది సేకరిస్తున్న నమూనాల తీరును పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఈ-హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.…

  *మన ఊరు-మన బడి కార్యక్రమ క్రింద పాఠశాలల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* రాజన్న సిరిసిల్ల, మార్చి 30: మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద ఎంపిక చేసిన పాఠశాలల సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు వారం లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపిడివోలు, ఎంపీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో మన ఊరు-మన…

  *అర్హులందరకీ ఋణాలు మంజూరు చేయాలి : జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్. జిల్లాలో అర్హులైన వారందరికీ ఋణాలు మంజూరు చేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలని బ్యాంకర్లను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి బ్యాంకర్లతో పర్చువల్ మోడ్ ద్వారా సమీక్షించారు. 2021-22 వార్షిక ఋణ ప్రణాళిక ప్రకారం 2,249.58 కోట్లకు గాను 2,345.18…

  *రెండో బైపాస్ రహదారి పనులు వేగవంతం చేయాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* రాజన్న సిరిసిల్ల, మార్చి 29: సిరిసిల్ల పట్టణం రగుడు నుండి వెంకటాపూర్ వరకు నిర్మిస్తున్న నాలుగు వరుసల బైపాస్ రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం కలెక్టర్, రోడ్లు, భవనాల శాఖ అధికారులతో కలిసి బైపాస్ రహదారి నిర్మాణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులకు…

*సఖీ కేంద్ర సేవలపై విస్తృత అవగాహన కల్పించాలి* *సఖీ కాల్ సెంటర్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లపై విస్తృత ప్రచారం కల్పించాలి* *సఖీ నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* రాజన్న సిరిసిల్ల, మార్చి 29: సఖీ కేంద్ర సేవలపై విస్తృత ప్రచారం తో ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో సఖీ నిర్వహణ…