Category: Rangareddy-Photo Gallery

  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు.గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని కోర్టు హాల్ లో మన ఊరు-మన బడి/మన బస్తి -మన బడి కార్యక్రమం పై రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ, కమిషనర్ దేవసేన, ఎమ్.ఎల్.సిలు, శాసన సభ్యులతో…

రంగారెడ్డి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కోర్టు హాల్లో అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధ్యక్షతన జిల్లా స్థాయి కాలుష్య నియంత్రణ మండలి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడటం ద్వారా కలిగే నష్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ప్లాస్టిక్ ను తయారు చేసే పరిశ్రమలను తనిఖీ చేసి తయారీని పూర్తిగా నిషేధించాలని…

పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా కలెక్టర్లకు సూచించారు. సోమవారం మే 23 నుండి జూన్ 1వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనతో కలిసి జిల్లా కలెక్టర్లు, విద్య శాఖ అధికారులు, సంబంధిత అధికారులతో ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్…

షాద్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్ధిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బుధవారం కొత్తూరు మండలంలోని రాష్ట్ర ఆర్ధిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు, రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్యెల్యే అంజయ్య యాదవ్…

ఆదివారం రంగారెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల (బి.సి)సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు, భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ  భగీరథ మహర్షి పట్టువిడవకుండా గంగను భూమికి తీసుకు వచ్చేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా వదలకుండా గంగను భూమికి తీసుకువచ్చి తమ పూర్వీకుల పాపాలను తొలగించడంలో…

శనివారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి ఎల్.బి.నగర్, మాల్ మైసమ్మ దగ్గర జరుగుతున్న ఫ్లై ఓవర్ పనులను, నాగోల్ డివిజన్ పరిధిలోని దేవకి ఫంక్షన్ హాల్ దగ్గర జరుగుతున్న బాక్స్ డ్రైన్స్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరుపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. బాక్స్ డ్రైన్స్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు.…

మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞం వలె చేపట్టి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి సకల సౌకర్యాలతో సిద్ధం అయ్యే విధంగా పనులు చేపట్టాలని రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా రెడ్డి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్లకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో మన ఊరు-మన బడి కార్యక్రమం పై రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా రెడ్డి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ…

రాబోయే పది సంవత్సరాలలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారక రామరావు స్పష్టం చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిరాల ఇ-సిటీలో రేడియంట్ అప్లయేన్సెస్ సంస్థ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారక రామరావు, రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,…

సోమవారం షాద్ నగర్ నియోజకవర్గం, కొత్తూర్ మండలంలోని పెంజర్ల గ్రామంలో పి అండ్ జి అంతర్జాతీయ కాస్మోటిక్స్ ఉత్త్పతుల యూనిట్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారక రామరావు, రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, శాసన సభ్యులు అంజయ్య యాదవ్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పి అండ్ జి ఆధ్వర్యంలో 200 కోట్ల…

తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులకు పోలీసు శాఖ అధికారులకు సూచించారు. శనివారం నకిలీ విత్తనాలపై వివిధ జిల్లాల ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావులతో కలిసి రంగారెడ్డి జిల్లా…