Category: Rangareddy-Whats Happening

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్ లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అదనపు కలెక్టర్ తిరుపతి రావు జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియతో కలిసి అర్జీలు స్వీకరించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన…

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ హరీష్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు బదిలీ అయిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా నియమితులైన హరీష్ గారికి గురువారం పదవీ బాధ్యతలు అప్పజెప్పారు. సమీకృత జిల్లా కార్యాలయాల కొత్త కలెక్టర్ గా హరీష్ బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ తిరుపతి రావు, డిఆర్ఓ హరిప్రియ, కలెక్టరేట్ ఏ.ఓ ప్రమీల, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, కలెక్టర్ కు పూల…

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల రాచాలూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు-మనబడి కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన మౌలిక వసతులను రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత హరనాథ్ రెడ్డి, విద్య శాఖ సెక్రెటరీ వాకటి…

సమీకృత కార్యాలయాల సముదాయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్. 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రంగారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి కీలకోపన్యాసం చేశారు. రిపబ్లిక్…

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదేనని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 13వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ ‘భారత దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో మనదేశ ప్రజాస్వామ్య…

ఆడపిల్లలపై వివక్ష జాఢ్యాన్ని రూపు మాపాలంటే ముందు కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలని అందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యలయ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ అధికారి మోతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ అమోయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడ మగ…

ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను పరిష్కరించేలా చర్యలు చేపడతామని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యల పై పిర్యాదులను సమర్పించడానికి వచ్చిన ప్రజల నుండి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు పిర్యాదులను స్వీకరించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి ద్వారా 40 పిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన వివిధ సమస్యలకు సంబంధించిన పిర్యాదులు అన్నింటిని సంబంధిత శాఖలకు పంపించి, వీలైనంత…

రాష్ట్రములో అంధత్వన్ని నిర్మూలించే దిశగా చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అని రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, జిల్లెలగూడలోని అంబేద్కర్ నగర్ బస్తీలోని అంబేద్కర్ భవనములో ఏర్పాటు చేసిన రెండవ విడుత కంటివెలుగు కార్యక్రమమును రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా, గిన్నిస్ రికార్డును నమోదు చేసే తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆలోచనాత్మకంగా చేపట్టిన…

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులకు  సూచించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పీలు, సంబంధిత అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హరీష్ రావు, సీ.ఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ సమీక్ష నిర్వహిస్తూ పలు సూచనలు చేశారు. ఈ నెల 18వ…

గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలతో కంటి వెలుగు కార్యక్రమంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు, శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక…