Category: Rangareddy-Whats Happening

2019, 2020 వ సంవత్సరాలలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కల గణనను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో మొక్కల గణనపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో 2019, 2020 సంవత్సరాలకు సంబంధించిన హరితహారం…

గురువారం అబ్దుల్లా పూర్ మెట్ మండలంలోని కవాడి పల్లి గ్రామపంచాయతీ కార్యాలయమును రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. గ్రామంలోని నర్సరీని సందర్శించి నర్సిరీలలో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలను నాటాలని , నాటిన మొక్కలను సంరక్షించాలని సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు. అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించి, సెప్టెంబర్ 1…

గురువారం జీ.హెచ్.ఎం.సి పరిధిలోని ఎల్బీ నగర్ సర్కిల్, లింగోజి గూడ డివిజన్, సరూర్ నగర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ద్వారా జానకి ఎన్ క్లేవ్ లోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరికి వంద శాతం వ్యాక్సినేషన్ అందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కల్పించిన వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను జిల్లాలోని ప్రతి ఒక్కరు సద్వినియోగ…

ఈ ఆర్థిక సంవత్సరానికి బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డిసిసి/డి.ఎల్ఆర్.సి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సన్న చిన్న కారు రైతులు పంట రుణాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా బ్యాంకర్లు రుణాలు అందించాలని ఆదేశించారు. రైతులు రుణాలు తీసుకునే విధంగా వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు…

సెప్టెంబర్ 1 నుండి అంగన్వాడీ కేంద్రాలు సహా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు పునఃప్రారంభంపై జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్ లోని కోర్ట్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి తరగతిలో శానిటైజర్ ఏర్పాటు చేయాలని, ప్రతి పాఠశాలకు మంచి నీటి సౌకర్యం నల్లా ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ అధికారులను…

సెప్టెంబర్ 01 నుండి అంగన్ వాడి కేంద్రాలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పారిశుద్ద్య పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, మున్సిపల్ నగర పాలక సంస్థ చైర్మన్లు, జిల్లా విధ్యాధికారులు, జిల్లా పంచాయితీ అధికారులతో పాఠశాలల పునః…

రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పతాకావిష్కరణ గావించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, పరేడ్ ను పరిశీలించారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. శకటాల ప్రదర్శన, నాగార్జున హై స్కూల్ రాయదుర్గం మరియు శివరాంపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.…

సఫాయి కర్మచారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సక్రమంగా అమలు చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సఫాయి కర్మచారుల జాతీయ కమీషన్ సభ్యులు శ్రీమతి అంజన పన్వార్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం హైదరాబాద్ లోని హరిత ప్లాజా గెస్ట్ హౌస్ లో సఫాయి కర్మచారుల జాతీయ కమీషన్ సభ్యులు శ్రీమతి అంజన పన్వార్ సఫాయి కర్మచారులకై జిల్లా యంత్రాంగం అమలు చేస్తున్న పథకాల పురోగతిపై జిల్లా కలెక్టర్ డి.అమయ్…