Category: Suryapet-Photo Gallery

రుణాలు అందించుటలో బ్యాంకులు ముందుండాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. డిజిటల్ మార్పుకు అనుగుణంగా బ్యాంకులు సేవలందించేందుకు ప్రత్యేక కృషి చేయాలని అన్నారు. మహిళలు బ్యాంకు రుణాలతో జీవన ప్రమాణాలు మెరుగు పర్చుకోనెలా ఎక్కువ రుణాలు అందించాలని సూచించారు. రుణమేళ కార్యాక్రమంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ మార్పుకు అనుగుణంగా బ్యాంకులు కస్టమర్లకు మెరుగైన సేవలందించాలని, డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై బ్యాంకర్లు ప్రజలకు విస్తృతంగా అవగాహన…

జిల్లాలో పిల్లలు చదువుతో పాటు కళలు, క్రీడలు అలాగే అన్ని రంగాలలో రాణించి జిల్లాకు మంచి పేరుప్రతిష్ఠలు అందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక బాల భవన్ లో వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మంట్లాడుతూ జిల్లాలో ఉన్న బాల కేంద్రాన్ని బాల భవన్ గా అప్ గ్రేడ్ గా చేయడం జరిగిందని అన్నారు. పిల్లల తల్లిదండ్రులు…

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా నాలుగో రోజు స్థానిక 7,21,22,31 వ వార్డులలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ తో కలసి రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపనలు అలాగే మందుల వాడాలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను మంత్రి ప్రారంభించారు.…

  పర్యావరణ పరిరక్షణ సమిష్టి బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు వాతావరణ కాలుష్య నివారణను ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉమ్మడి నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి ఆయన మాట్లాడారు.జిల్లా ప్రజలు, అధికారులు, ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ రహిత వస్తువులు వాడుతూ ,మొక్కలు…

గ్రామాల అభివృద్దే దేశ భివృద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా ఎపూరు గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ముఖ్యాతిధులుగా పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ సంబందించిన సిబ్బందిని, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. అనంతరం మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా కోటి 30 లక్షలతో పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అలాగే…

  ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన 5 వ విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాలు, గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ యావత్ దేశంలోనే ఏ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి పోటీ లేదని తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలకు పట్టణాలకు మధ్యనే పోటీ ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.…

ప్రభుత్వ అవకాశాలను యువత పూర్తిస్తాయిలో సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం పోలీసు ఉద్యోగ ప్రకటన చేయడంతో SI, PC ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసు అధ్వర్యంలో ముందస్తు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థులకు సూర్యాపేట రూరల్ పరిధి కాసరభాద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంగణంలో వసతి ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు.  ఈ శిక్షణలో ఉన్న అభ్యర్థులకు ఈరోజు విద్యుత్ శాఖ…

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్యఅతిధిగా పాల్గొని ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరణ అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పులగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించి జిల్లా అభివృద్ధి పై ప్రసంగించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి,…

  కళలకు పుట్టినిల్లు సూర్యాపేట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈ సందగంగా మంత్రి మాట్లాడుతూ ఒకప్పటి తెలంగా ణలో వేసిన బోర్లకు భూ తల్లి గాయాలపా లైందని, ఈ రోజు గోదావరి జలాలు పారించి తల్లి గాయాలను రూపుమాపా మని కవి జి.వెంకటేశ్వర్లు తెలంగాణ స్థితి గీతులను వివరిస్తూ రాసిన కవితకు మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి భావోద్వే గానికి గురయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని గురువారం…

  ప్రభుత్వ ఆసుపత్రులలో సహజ ప్రసవాలు ఎక్కువ జరిగేలా చూడాలని వైద్యాధికారులు లను జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన జిల్లా ఆరోగ్య సొసైటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులు గర్భిణీ స్త్రీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రిలో నైనా తెలిస్తే వారిపై కఠిన…