వినియోగదారులకు ఐ.ఏస్.ఐ మార్క్ ఉన్న వస్తువులపై అవగాహన కల్పించాలని ఆదనవు కలెక్టర్ యస్. మోహన్ రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినియోగదారులు ఐ యస్ ఐ హాల్ మార్క్ గల వస్తువుల వినియోగం పై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ శాస్త్రవేత్తలు, జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భారతీయ ప్రమాణాల సంస్థ జాయింట్ డైరెక్టర్ శివప్రసాద్ తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐఎస్ఐ మార్కు ఉన్న వస్తువులను…
Category: Suryapet-What’s Happening
పత్రిక ప్రకటన. తేదీ.16.5.2022. సూర్యాపేట. పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి. కేంద్రాలలో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించాలి. మే 23 నుండి జూన్ 1 వరకు పరీక్షల నిర్వహణ. రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా.
మే 23 నుండి జూన్ 1 వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించుటకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన తో కలిసి 10వ తరగతి పరీక్షల నిర్వహణ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మే 23,2022 నుంచి జూన్…
తేదీ.16.5.2022. సూర్యాపేట. నకిలీ విత్తనాలపై నిఘా పెంచాలి. వ్యవసాయ సంబంధిత షాపులలో తనిఖీలు చేపట్టాలి. వచ్చే హరితహారానికి మొక్కలు సిద్ధంగా ఉంచాలి. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలి. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.
జిల్లాలో రైతులు వానాకాలం పంటసాగుకు సిద్ధమౌతున్నందున నకిలీ విత్తనాలు, ఎరువులపై నిఘా పెంచాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు తో కలసి అర్జీదారులు నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వానాకాలం పంటలకు రైతులు సిద్ధమౌతున్నందున నకిలీ విత్తనాలు, ఎరువులు దళారుల నుండి కొనుగోలు…
తేదీ.16.5.2022. సూర్యాపేట. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి. జిల్లాలో ఆయిల్ ఫామ్ పంటలు ఎక్కువగా పెంచాలి. రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు విధానంపై రైతు వేదికల ద్వారా రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తో కలసి ప్రత్యామ్నాయ పంట సాగు విధానంపై సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంట సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆదిశగా అధికారులు…
తేదీ.10.5.2022. సూర్యాపేట. పేదింటి ఆడపిల్లలకు వరం కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకం. సూర్యాపేట నియోజక వర్గంలో 8 వేల కోట్ల అభివృద్ధి పనులు. అభివృద్ధిలో పల్లెలు పట్టణాలకు పోటీగా నిలుస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి. 31 గ్రామాల 214 మందికి కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ. మండలంలో పి.ఆర్. రోడ్లు, బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.
జిల్లాలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం చివ్వేంల మండలంలోని పంచాయతీ రాజ్ ద్వారా రూ. 2 కోట్ల 10 లక్షల రూపాయలతో మొగ్గాయి గూడెం చంద్రు పట్ల బి.టి. రోడ్డు పనులకు అలాగే రూ. కోటి 45 లక్షలు బిడ్జ్ నిర్మాణ పనులకు, రూ.2 కోట్ల 16 లక్షల తో చివ్వేంల నుండి ఖాసీం పేట రోడ్డు,…
తేదీ.09.5.2022. సూర్యాపేట. దళితుల జీవితాల్లో నూతన ఒరవడి. దళిత బందు లబ్దిదారులతో కలసి సహపంక్తి భోజనం. దళితుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. లబ్దిదారులకు యూనిట్ల అందుచేత. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.
దళితుల జీవితాల్లో నూతన ఒరవడి కనబడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సి.యం. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బందు యూనిట్లను రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలసి చివ్వేంల మండలం తుల్జారావు పేటలో ప్రారంభిచి లబ్దిదారులకు అందచేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏమైతే కోరుకున్నారో అవన్నీ ముఖ్యమంత్రి కెసిఆర్ సాకారం చేస్తున్నారని అన్నారు. నేడు దళిత బంధు పథకంతో దళితులు…
తేదీ.09.5.2022. సూర్యాపేట. వేసవి దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కారించాలి. ప్రజావాణికి హాజరుకాని అధికారులపై చర్యలు. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.
జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతున్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా చిన్న పిల్లలు, వృద్ధులు ఇండ్ల నుండి బయటకు రాకుండా చూడాలని అలాగే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వడదెబ్బ…
తేదీ.07.5.2022. సూర్యాపేట. దళితుల జీవితాల్లో నూతన వెలుగులు. దళితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. లబ్దిదారులకు యూనిట్ల అందుచేత. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.
దళితుల జీవితాల్లో ప్రభుత్వం నూతన వెలుగులు నింపుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సి.యం. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బందు యూనిట్లను శనివారం రాత్రి పట్టణంలోని 25, 37, 45వ వార్డుల్లో సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ లతో కలసి ప్రారంభిచి అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏమైతే కోరుకున్నారో అవన్నీ ముఖ్యమంత్రి కెసిఆర్ సాకారం చేస్తున్నారని అన్నారు. నేడు…
తేదీ.06.5.2022. సూర్యాపేట. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. ప్రయాణికులకు సదస్సుల ద్వారా అవగాహన కల్పించాలి. హైవే లపై నిరంతరం పెట్రోలింగ్ ఉండాలి. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.
జిల్లాలోని హైవే రోడ్ల ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్ల ప్రమాదాల నివరణకై చేపట్ట వలసిన చర్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 19 ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదిశగా పటిష్టమైన నివారణా చర్యలు చేపట్టాలని సూచించారు. తరుచుగా గుర్తించిన ప్రాంతాలలో స్పీడ్ లేజర్ గన్స్…
తేదీ.2.5.2022. సూర్యాపేట. వ్యర్ధాలనుండిఅద్భుతాలుసృష్టించొచ్చు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో ఆక్యుపేజర్, ఇటుకలు, టైల్స్. సూర్యాపేట పురపాలక సంఘం సృష్టి. ఆవిష్కరించిఅభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి.
వ్యర్ధాలు ఎప్పటికీ వృధా కాబోవు అని వాటినుండి అద్భుతాలు సృష్టించొచ్చు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వృధా అనుకున్న వస్తువుల గురించి ఒక్కసారి లోతుగా అధ్యయనం చేయగలిగితే అదే మరో వస్తువుకు ముడి సరుకుగా మారుతుందని ఆయన తెలిపారు. సూర్యాపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల నుండి తయారు చేసిన ఆక్యుపేజర్ బోర్డ్స్,ఇటుకలు,టైల్స్ ను మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. వ్యర్థం అనుకున్న దాంట్లో నుండి అద్భుతాలు…