Category: Vikarabad

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా, అవినీతికి తావు ఇవ్వకుండా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, మన ఊరు మన బడి లో చేపడుతున్న పనుల పురోగతిపై మంత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్ దేవసేన, విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా…

జిల్లాలో 17 సంవత్సరాలు నిండిన యువత ముందస్తుగా ఫామ్ – 6 ద్వారా ఓటరుగా తమ పేరును నమోదు చేసుకొని 18 సంవత్సరాలు నిండిన పిదప తమ ఓటు హక్కును వినియోగించుకొవచ్చని జిల్లా కలెక్టర్ నిఖిల తెలియజేశారు. 13 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం రోజు పాఠశాల విద్యార్థులతో భారీ ర్యాలీతో పాటు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఇప్పుడు ప్రతి ఏడాదికి…

వంద రోజులు పని దినాలలో ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ మరియు జిల్లా కోర్టు కార్యాలయాలలో విడతల వారీగా ప్రత్యేక కంటి వెలుగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కలెక్టరేట్, ఎస్పీ,…

మన ఊరు మన బడి కింద చేపట్టిన పనులను ఈ నెల 27 లోపు (శుక్రవారం) పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత శాఖల ఇంజనీర్లను ఆదేశించారు. సోమవారం మన ఊరు మనబడి కింద చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి సంబంధిత ఇంజనీర్ విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మన ఊరు మనబడి కింద మొదటి విడతలో 38 మోడల్ పాఠశాలను ఎంపిక చేయడం…

జిల్లాలో కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత , సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ…కంటి వెలుగు…

జంతు హింసకు పాల్పడకుండా, జంతువుల పట్ల కరుణతో ఉంటూ వాటిని సంరక్షించవలసిన అవసరం ప్రతి పౌరునిపై ఉందని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్ లో జంతు సంక్షేమం కోసం ప్రతి పౌరుడు విధిగా పాటించాల్సిన నిబంధనలపై ” జంతు హింస నివారణ సంఘం ” రూపొందించిన కరపత్రాన్ని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డిఆర్ఓ అశోక్ కుమార్, జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ అధికారి అనిల్ కుమార్…

ప్రజల ఆరోగ్యం పై దృష్టి పెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు కంటి సమస్యలను పరిష్కరించేందుకు కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని చేపట్టిందని తాండూర్ శాసన సభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. 100 రోజులు పాటు నిర్వహించే ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం…

రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని పూడూరు మండలం, చెన్గోమల్ గ్రామంలో స్థానిక శాసనసభ్యులు మహేష్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ నిఖిల ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కంటి పరీక్షలు నిర్వహించి స్థానిక శాసనసభ్యులు మహేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అంధత్వ వ్యాధులను పూర్తి స్థాయిలో నిర్మూలించడంతో పాటు కళ్లల్లో కాంతులు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత కంటి…

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. గురువారం కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక శాసనసభ్యులు నరేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ…జిల్లాలో 580 గ్రామపంచాయతీలు,97 మున్సిపల్ వార్డులలో కంటి వెలుగు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి క్యాంపులో 8 వైద్యులు ఉంటారని,…

రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రణాళిక బద్దంగా నిర్వహించి విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ నిఖిల* జిల్లాలో ఈనెల 19వ తేదీ నుండి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రణాళిక బద్ధంగా అమలు పరచి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పాల్వాన్ కుమార్ లతో కలిసి కంటి వెలుగు…