Category: Vikarabad-Press Releases

తాండూర్ రాజీవ్ స్వగృహ సమీపంలోగల మనోహ టౌన్షిప్ ఫ్లాట్ లను జూన్ 14న వేలం వేయనున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ తెలిపారు. బుధవారం తాండూరు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ప్లాట్ల వేలంపై సంబంధిత అధికారులతో కలిసి వేలంపాటలో పాల్గొనడానికి ఆసక్తి చూపే వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాండూరు-హైదరాబాద్ రహదారికి దగ్గరలో ఉన్న యాలల మండలం కోకట్ గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 52 నందు దు మోహ…

బ్యాంకర్లు చిరు వ్యాపారులకు విరివిగా రుణాలు అందించి వారిని ప్రోత్సాహించాలని జిల్లా కలెక్టర్ నిఖిల బ్యాంకర్లను కోరారు. బుధవారం స్థానిక సత్యభారతి ఫింక్షన్ హాలులో అజాదీకే అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రజా చేరువ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గవించి కార్యక్రమాన్ని ప్రారంభించినరు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, బ్యాంకింగ్ ఔట్ రిచ్ కార్యక్రమంలో…

టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం మద్గుల్ చిట్టెంపల్లి డి పి ఆర్ సి భవన్ లో టెట్ పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్స్, శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెట్ పరీక్ష చాలా కాలం తర్వాత నిర్వహించడం జరుగుతుందని, అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత పొందాలని అభిలాషతో ఉంటారని అన్నారు. అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం…

పట్టణ ప్రగతి లో చేపట్టి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణ ప్రగతి లో భాగంగా కొడంగల్ మున్సిపాలిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే పనులు పూర్తయి ప్రారంభదశలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సామాజిక ఆరోగ్య కేంద్రం (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) లను సందర్శించి అధికారులకు తగు సూచనలు చేశారు త్వరలో ప్రారంభం కానున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో పెద్ద…

గ్రామాలు పచ్చగా, పరిషభ్రంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం పరిగి మండలం చిగురాల్ పల్లి గ్రామంలో ప్రజలతో కలిసి కలియతిరిగారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో 23 లక్షల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు పరిగి శాసన సభ్యులు కొప్పుల మహేశ్వర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన గావించారు. మంజూరు…

బడి ఈడు పిల్లలు రోడ్లపై కాకుండా వంద శాతం పాఠశాలల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాల చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 696 మంది పిల్లలను డ్రాప్ అవుట్ గా గుర్తించడం జరిగిందని వీరందరిని సంబంధిత…

పల్లె ప్రగతిలో రోజువారిగా చేపడుతున్న పనులతో గ్రామాలను అభివృద్ధి అభివృద్ధిపర్చుకోవాలని, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠ దామాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమీషనర్ డా. శరత్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని గోంగుపల్లి, వికారాబాద్ మండలంలోని కామారెడ్డిగూడలో జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి గ్రామాలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠదామాలు, సెగరిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు,హరితహారం నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్బంగా అయన…

మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ఎంపికైన పాఠశాలలన్నింటిని వెంటనే గ్రౌండింగ్ చేసి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంజనీరింగ్ అధికారులు, యం ఇ ఓ లు, మండల స్పెషల్ ఆఫీసర్లతో మన ఊరు – మన బడి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్…

పల్లె ప్రగతి కార్యక్రమాలలో మండల స్పెషల్ ఆఫీసర్లు తప్పకుండా ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు గ్రామాలలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఎంపీడీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమీషనర్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఎ పి ఓ లు, ఎంపీవో లు, ఈసీ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు గ్రామాలలో,…

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వికారాబాద్ మండలం పుల్ మద్ది గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ నిఖిల, వికారాబాద్ శాసన సభ్యులు మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. శుక్రవారం నిర్వహించిన పల్లె ప్రగతి గ్రామ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పుల్ మద్ది గ్రామానికి ఇంతకు క్రితము నిర్వహించిన పల్లె ప్రగతిలో రూ.94 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈసారి…