Category: Vikarabad-Press Releases

వికారాబాద్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా 318 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక కోటి 8 లక్షల బతుకమ్మ చీరల పంపిణికి ఈరోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలియజేసారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 290 రంగుల్లో బతుకమ్మ చీరలు తయారు చేయడం జరిగిందన్నారు. గత ఏడాది పంపిణీ సందర్బంగా మహిళల నుంచి వారి అభిప్రాయాలను సేకరించిన మంత్రి కేటీఆర్ గారి…

వికారాబాద్ జిల్లాలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాలు

గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా మహాత్ముడు చూపిన బాటలో నడుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకోవేళ్తుందని, పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారాయని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అహింస, సత్యాగ్రహం ఆయుధంగా దేశ స్వాతంత్ర్యము కోసం పోరు సల్పిన మహనీయులు మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడుస్తూ, చూపిన మార్గంలో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్బంగా సూచించారు. జాతి…

మోమిన్ పేట మండలం, యెన్కేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

మోమిన్ పేట మండలం, యెన్కెపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ నిఖిల ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసి నిరహించవలసిన (32) రిజిస్టర్లను, నర్సరీ, వైకుంఠదామం నిర్మాణపు పనులను,దళితవాడలో మురికి కాలువలు, రోడ్లు విద్యుత్ సదుపాయాలను పరిశీలించారు. ముందుగా జీపీ కార్యాలయంలో నిర్వహించాల్సిన (32) రకాల రిజిస్టర్లు పరిశీలించారు. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడంపై గ్రామ కార్యదర్శి కృష్ణ చైతన్యపై ఆగ్రహం వ్యక్తపరిచారు. గ్రామంలో జాబ్ కార్డులు కలిగిన ఉపాధి హామీ కూలీలా వివరాలు అడిగి తెలుసుకొని, అందరికి…

జిల్లా కలెక్టర్ అధ్యక్షతన TS-bPASS టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం

జిల్లాలో అక్రమ నిర్మాణాలు, లేఔట్ లను గుర్తించేందుకు సంబంధిత అధికారులు క్షేత్రస్తాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి TS b pass టాస్క్ ఫోర్స్ కమిటీ మొదటి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు గృహ నిర్మాణాలకు సంబంధించి ఆన్-లైన్ ద్వారా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అనుమతులు ఇచ్చారని సంబంధిత…

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. జిల్లా కలెక్టర్ నిఖిల

పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, బట్ట సంచులను వినియోగించాలని జిల్లా కలెక్టర్ నిఖిల ప్రజలను కోరారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా స్వచ్ఛత ప్రచార రథంను జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ చెత్తను అనాలోచితంగా ఎక్కడ పడితే అక్కడ వేయడం వలన దోమలు, ఈగలు ప్రాబలి డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు వ్యాపించడమే కాకుండా పరిసరాలు అపరిశుభ్రంగా మారుతాయన్నారు.…

వాగులో గల్లాంతై మృతి చెందిన వార్డు మెంబెర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి

గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగులో గల్లంతై మృతి చెందిన వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామ వార్డు మెంబర్ ఇషాక్ పాషా కుటుంబ సభ్యులను ఈరోజు విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇషాక్ మృతి బాధాకరమని, మృతుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతుని భార్యకు అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం కల్పించాలని మంత్రి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.…

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

బంగళఖాతంలో ఏర్పడిన గులాబ్ తూఫాన్ వల్ల సోమవారం నుండి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిఖిల కోరారు. ఈరోజు ధారూర్ మండలంలోని దోర్నాల, మన్సాన్ పల్లి వాగులను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నందున ప్రజలను దెగ్గరికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రాత్రి పూట అధికారులు అందరు అప్రమత్తంగా ఉండి ఏలాంటి అవాంఛనియ సంఘటనలు జరుగకుండ చూడాలని ఆదేశించారు.…

వికారాబాద్ జిల్లాలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి ఉత్సవాలు

కొండా లక్ష్మణ్ బాపూజీ 106 వ జయంతి ఉత్సవాలను వికారాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరములో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా బాపూజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ, తన జీవితాన్ని ప్రజల అభ్యున్నతికి కొసం, దేశం కొసం,…

మండలాల వారీగా చేపట్టిన పనుల పురోగతిపై ఎంపీడీఓలతో కలెక్టర్ నిఖిల సమీక్ష

జిల్లాలో బృహత్ పల్లె ప్రకృతి వనాలలో గుంతలు తీసి మొక్కలు నాటే పనులను వెంటనే చేపట్టాలని, అలాగే ప్రతి మండలానికి నాలుగు చొప్పున మినీ పల్లె ప్రకృతి వనాల కొసం స్థల సేకరణ గవించి ఎస్టిమేషన్ జెనరేషన్ పనులు జరగాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఎంపీడీఓ లను ఆదేశించారు. ఈరోజు స్థానిక DPRC భావనంలో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల పనుల పురోగతి పై మండలాల వారిగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని…

వికారాబాద్ జిల్లా విద్యార్థి నూతన ఆలోచనకు జాతీయ స్థాయిలో 3వ స్థానం

ఇన్స్ పెయిర్ 2020-21 విద్యా సంవత్సరములో జరిపిన పోటీలలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశవ్యాప్తంగా నిలిచిన 60 ఉత్తమ ప్రాజెక్టులలో జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచిన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని ZPHS గోకఫసల్వాద్ పాఠశాలకు చెందిన విద్యార్ధి డి. అశోక్ ను జిల్లా కలెక్టర్ నిఖిల ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా అభినందన సత్కారాలు అందజేసినారు. ఈ సందర్బంగా విద్యార్ధి తయారు చేసిన సీలింగ్ ఫ్యాన్ లిఫ్టింగ్ టూల్ గురించి విద్యార్ధితో…