Category: Vikarabad-Press Releases

తెలంగాణ లో కొత్తగా అమలవుతున్న ఆరోగ్య మహిళ పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గనులు భూగర్భవనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం పూడూరు మండలం చన్ గొముల్ లో ఎంఎల్ఏ కొప్పుల మహేష్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి పల్వాన్ కుమార్ లతో కలిసి మహిళా ఆరోగ్య కేంద్రంమును మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట…

[4:28 PM, 9/12/2023] Os SAtish: ప్రజలకు ఇబ్బంది కలగకుండా పద్ధతి ప్రకారంగా ధరణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దారులతో మాట్లాడుతూ, ప్రతిరోజు కనీసం 20 ధరణి సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. సీనియారిటీ ప్రకారం సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలలో నమ్మకం కలిగించాలన్నారు. ధరణి పై వచ్చే దరఖాస్తుల పట్ల తహసీదారులు వెంటనే స్పందించాలన్నారు.…

ఈనెల 16న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నందున, జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతులను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ముందుగా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జిల్లాకు దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈనెల 16న రాష్ట్ర…

జిల్లాలో నాలుగు సంవత్సరాల శిక్షణకాలం పూర్తి చేసుకున్న 309 మంది పంచాయతీ సెక్రెటరీలకు పూర్తి కాలపు ఉద్యోగులుగా నియామక పత్రాలను రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రం పాలనా సౌలభ్యం కోసం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. పంచాయతీల ఏర్పాటుతో పాటు…

జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలు, ఏపీఎంలు, పంచాయతీరాజ్ శాఖ ఏ ఈ లు, డి ఈ లతో సీజనల్ వ్యాధులు, పారిశుధ్యం, హరితహారం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, మన ఊరు మన బడి తదితర అంశాలపై…

ఈ నెల 15న ప్రారంభించే వైద్య కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం వైద్య కళాశాల పరిసరాలను, వైద్య విద్యార్థులకు వసతుల సౌకర్యం నిమిత్తం భవనాల పరిశీలన, కేజిబివి బాలికల కళాశాలను జిల్లా అదన కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 15న వర్చువల్ గా జిల్లా వైద్య కళాశాలను ప్రారంభిస్తున్న సందర్భంగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు సూచనలు చేశారు.…

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్ర, గౌరవప్రదమైనదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా మంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, 75 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్…

అటెండెన్స్ యాప్ ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించబడతాయని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం వాయించరాదని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణికి ముందు జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులందరూ తమ సిబ్బంది యొక్క హాజరును అటెండెన్స్ యాప్ ఆధారంగా ప్రతిరోజు నమోదు చేయాలన్నారు. అటెండెన్స్ యాప్ ను ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుందని, అటెండెన్స్ యాప్ హాజరు నమోదు ఆధారంగానే జీతాలు చెల్లించబడతాయని ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం…

సెప్టెంబర్ 2, 3 తేదీలలో స్పెషల్ డ్రైవ్ కింద జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గంలోని శివారెడ్డిపేట జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బి ఎల్ ఓ లు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం…

ఉపాధ్యాయ అర్హత పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో సెప్టెంబర్ 15న నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరీక్ష సజావుగా జరిగే విధంగా జాగ్రత్తలు…