Category: Wanaparthy

పత్రికా ప్రకటన       తేది:30.01.2023, వనపర్తి. ఈ నెల 30, 31వ తేదిన బి.సి. సంక్షేమ శాఖ వసతి గృహాల బాలుర విద్యార్థులకు ఎవరెస్ట్‌ టాస్క్ పర్వతారోహణ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం భువనగిరి ఖిల్లా వేదికగా నిర్వహిస్తున్నట్లు, ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్ తెలిపారు. సోమవారం భువనగిరి ఖిల్లా వేదికగా రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌ పర్యవేక్షణలో వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల…

పత్రికా ప్రకటన.     తేది:30.01.2023, వనపర్తి. ప్రజావాణి కార్యక్రమం ద్వారా దరఖాస్తుదారుల నుండి అందిన దరఖాస్తులను పరిశీలించి, వెంటనే  పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా జిల్లా అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ.డి.ఓ.సి. ప్రజావాణి సమావేశ మందిరంలో ఆమె ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పెన్షన్ లకు సంబంధించిన దరఖాస్తులు…

పత్రికా ప్రకటన.     తేది:30.01.2023, వనపర్తి. ప్రభుత్వ ఆదేశాల మేరకు, స్వాతంత్ర్యం సిద్దించుటకు ప్రాణాలను అర్పించిన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అమర వీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. సోమవారం ఐ.డి. ఓ.సి. కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ రెండు నిమిషాలు మౌనం పాటించటం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…

పత్రికా ప్రకటన తేది:27.01.2023, వనపర్తి. 18 సం.లు పూర్తైన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కొత్తకోట మండలంలోని నిర్వేన, పాలెం గ్రామ పంచాయతీలలో నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సం.లు పూర్తైన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునే విధంగా గ్రామ, పట్టణ స్థాయి…

పత్రికా ప్రకటన. తేది:27.01.2023, వనపర్తి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు, పోలీసు శాఖ సిబ్బందికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కంటి వెలుగు కార్యక్రమం విజయ వంతంగా నిర్వహించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్ తెలిపారు. శుక్రవారం ఐ.డి. ఓ.సి. కార్యాలయంలో అన్ని శాఖల సిబ్బందికి, పోలీసు సిబ్బందికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…

పత్రికా ప్రకటన. తేది:27.01.2023, వనపర్తి. – పారదర్శకంగా టీచర్ల బదిలీ, పదోన్నతులను చేపట్టాలి – జిల్లాలో వెంటనే టీచర్ల సీనియార్టి జాబితా, ఖాళీల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలి – ప్రతి జిల్లాలో తాత్కాలిక మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి – మన ఊరు – మన బడి, మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్దం చేయాలి – రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి – – – రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల…

పత్రికా ప్రకటన        తేది:25.01.2023, వనపర్తి., రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన “కంటి వెలుగు” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ఆర్.డి.ఓ. కార్యాలయంలో పాత్రికేయులకు ఏర్పాటు చేసిన “ప్రత్యేక కంటి వెలుగు” కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర సి.ఎస్. ఆదేశాల మేరకు ప్రత్యేక…

పత్రికా ప్రకటన.      తేది:25.01.2023, వనపర్తి. .  ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి, ఓటర్ గా పేరు నమోదు చేసేలా అధికారులు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో “13వ. జాతీయ ఓటర్ల దినోత్సవం- 2023” ను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

పత్రికా ప్రకటన      తేది:24.01.2023, వనపర్తి.      లింగ వివక్షను నిర్మూలించి, బాలికలను అన్ని రంగాలలో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి అన్నారు.      మంగళవారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో మహిళా, శిశు, డివ్యంగుల, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “జాతీయ బాలికల దినోత్సవం” వేడుకలకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…

పత్రికా ప్రకటన     తేది:24.01.2023, వనపర్తి.     కంటి వెలుగు కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని 100 శాతం కంటి పరీక్షలు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆశిష్ సంగ్భాన్ ఆదేశించారు.      మంగళవారం అంకురు గ్రామపంచాయతీలోని కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి, సమస్యలను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేయాలని, అవసరమైన వారికి…