పత్రికా ప్రకటన. తేది:11.05.2022, వనపర్తి. ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నదని, రైతులు అవగాహన పొంది లాభదాయకమైన పంటలను సాగు చేయాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ రాజేందర్ రెడ్డి సూచించారు. బుధవారం మదనపూర్ మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తలు, ప్రియూనిక్ FGV కంపెనీ GM సహకారంతో వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలోని మైక్రో ఇరిగేషన్ కంపెనీ సమన్వయకర్తలు, డి.సి. ఓ.లు, ఇంజనీర్స్ కంపెనీలు, డీలర్లలకు “ఉద్యాన పంటలు నాటుకునే సమయంలో…
Category: Wanaparthy-Press Releases
(11.05.2022) కళాశాల విద్యార్థులకు ఉపకార వేతనం దరఖాస్తు గడువు పొడగింపు : ఎస్.సి. అభివృద్ధి శాఖ అధికారిణి నుశిత
పత్రికా ప్రకటన. తేది:11.05.2022, వనపర్తి. ఎస్.సి. అభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ – పాస్ వెబ్ సైట్ ద్వారా ఉపకార వేతనం కొరకు ఈ నెల తేది:11.05.2022 నుండి 21.05.2022 వరకు దరఖాస్తు చేసుకొనుటకు గడువు పెంచినట్లు, ఇంతవరకు దరఖాస్తు చేసుకోని వారు, రెన్యువల్ చేసుకోవలసిన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయుటకు అవకాశం కల్పించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి నుశిత ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలల విద్యార్థులు…
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభo, ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలల తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్
పత్రికా ప్రకటన, తేది:06.05.2022, వనపర్తి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ బాలుర కళాశాల, ప్రభుత్వ బాలికల కళాశాలలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేయగా, స్కాలర్స్ జూనియర్ కళాశాల, సి.వి.రామన్ జూనియర్ కళాశాలలను జిల్లా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, రవాణా, వైద్యం, తదితర సౌకర్యాలను ఆమె…
ములుగు జిల్లాలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఫ్రూట్స్ లో మామిడి పండ్ల ప్రదర్శన : జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్
పత్రికా ప్రకటన 5 5 2022 వనపర్తి మామిడి పంటను సాగు చేసిన రైతులను తెలంగాణ రాష్ట్ర మంత్రుల సబ్ కమిటీ అభినందించింది. గురువారం ములుగు జిల్లా లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఫ్రూట్స్ లో వ్యవసాయ సబ్ కమిటీ గౌరవ మంత్రుల కమిటీ వనపర్తి జిల్లాలో సాగు మామిడి పండ్ల ప్రదర్శన తిలకించి అభినందనలు తెలిపారు. వనపర్తి జిల్లా మదనపూర్ లో శేఖర్ అనే రైతు సాగుచేసిన అధిక సాoద్రత మామిడి రకమైన పెద్దరసం సాగు…
ఈ.వి.ఎం. గోదాము తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష
పత్రికా ప్రకటన. తేది:05.05.2022, వనపర్తి. ప్రతినెలా నిర్వహించే సాధారణ తనిఖీలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష వనపర్తి తహసిల్దార్ కార్యాలయం ఆవరణలోని ఈ.వి.ఎం. గోదామును ఆమె తనిఖీ చేశారు. గోదాము పరిసరాలను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎలక్షన్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. ………. జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.
జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐ.డి.ఓ.సి. భవనంలో విశ్వగురు బసవేశ్వరుడి 889వ. జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్
పత్రికా ప్రకటన. తేది:03.05.2022, వనపర్తి. కుల రహిత సమాజ స్థాపనకు కృషి చేసిన వ్యక్తి, సామాజిక వేత్త బసవేశ్వరుడని, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ సూచించారు. మంగళవారం ఐ డి ఓ సి. భవనంలో జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ మహాత్మ విశ్వగురు బసవేశ్వరుడి 889వ. జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా…
రంజాన్ పండగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
పత్రికా ప్రకటన. తేది:03.05.2022, వనపర్తి. రంజాన్ పండగను పురస్కరించుకుని మంగళవారం వనపర్తి పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు. ………….. జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.
ఈ నెల 3వ తేదీన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి : జిల్లా కలెక్టర్
పత్రిక ప్రకటన తేది: 2-5-2022 Wanaparthy జిల్లా. ఈ నెల 3వ తేదీ అక్షయ తృతీయ రోజున బసవేశ్వర జయంతిని ఘనంగా ఇర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నేడోక ప్రకటనలో తెలిపారు. లింగాయతుల ఆరాధ్య దైవం బసవేశ్వర జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తరపున వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రేపు కలెక్టరేట్ లో ఉదయం 9.30 am గంటలకు నివాళులర్పించడం జరుగుతుందని తెలియజేసారు.
“మన ఊరు -మన బడి” కార్యక్రమం పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి టి. హరీష్ రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్
పత్రికా ప్రకటన. తేది:02.05.2022, వనపర్తి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “మన ఊరు – మన బడి” కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి టి. హరీష్ రావు, జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. సోమవారం హైదరాబాదు నుండి “మన ఊరు -మన బడి” కార్యక్రమం పనుల పురోగతిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ…
శ్రీనివాసపూర్ గ్రామ పంచాయతీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
పత్రికా ప్రకటన. తేది:01.05.2022, వనపర్తి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలిచేందుకు, జిల్లాలోని యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరజన్ రెడ్డి సూచించారు. ఆదివారం శ్రీనివాసపూర్ గ్రామ పంచాయతీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో “వరి ధాన్యం కొనుగోలు కేంద్రం”ను ఏర్పాటు చేయడం జరిగిందని…