Category: Warangal Urban-Press Releases

సుప్రీం కోర్ట్   ప్రధాన   న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హై కోర్ట్   ప్రధానన్యాయ మూర్తి సతీష్ చంద్ర శర్మ దంపతులు  హన్మకొండ లోని భద్రకాళి అమ్మవారి ఆలయానిక ఉదయం  8 గంటలకు చేరుకున్నారు. ఆలయ పూజారులు  పుష్పగుచ్చాలతో  సీజే దంపతులకు   స్వాగతం పలికారు. భద్రకాళి   ప్రధాన అర్చకులు శేషు  న్యాయమూర్తులకు   తలపాగ చుట్టి పూల మాలలు    వేసి   పూర్ణ కుంభం తో  వేద పండితుల మంత్రోచ్చారణ…

మంగళవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హైదరాబాదు సచివాలయం నుండి ఉద్యోగుల విభజన, ప్రభుత్వ ఉత్తర్వు నెంబరు 317 పై దిశ నిర్దేశం చేశారు.  వివిధ జిల్లాలలో జరుగుతున్న ఉద్యోగుల విభజనపై కల్లెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ  కలక్టర్ రేట్ కార్యాలయం నుండి కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్‌ వ్యవస్థ-2018కి అనుగుణంగా జాబితాలను రూపొందించామని వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఉద్యోగుల…

హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నాడు నిర్వహించే ప్రజావాణి (గ్రీవేన్స్ డే)కార్యక్రమాన్నీ రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త జోనల్‌ వ్యవస్థ-2018కి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు నేపథ్యంలో ఈ సోమవారం జరిగే గ్రీవిన్స్ డే రద్దు చేశామని తెలిపారు. కావున గ్రీవిన్స్ డే కి వచ్చే అర్జీదారులు కలెక్టరేట్ కార్యాలయంనకు రాకూడదని కలక్టర్ ఆ ప్రకటన లో వెల్లడించారు.

ఐనవోలు అభివృద్ధికి మరో కోటి నిధులు మల్లికార్జున స్వామి దేవాలయానికి శాశ్వత ప్రాతిపదికన పనులు అదనంగా ఆర్టీసి బస్సులు కార్పొరేషన్ నుంచి నిరంతరం క్లోరినేషన్ వీఐపీ లు, దాతల కోసం ప్రత్యేక పాసులు రొడ్లకిరువైపులా… మొరం తో రోడ్ల మరమ్మతులు, చెత్తా చెదారం తొలగింపు భ‌క్తుల‌కు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలి కోవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాలి మాస్కుల పంపిణీకి ఏర్పాట్లు జాతర ప్రాంగణంలో కరోనా పరీక్ష కేంద్రాలు,…

మంగళవారం నాడు కలక్టర్ కలక్టరేట్ సమవేశమందిరంలో ఉమ్మడి వరంగల్ ఉద్యోగుల విభజన పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజన వివరాలను అదనపు కలెక్టర్ కు సమర్పించాలని అన్నారు. 33 జిల్లాలతో రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్‌ వ్యవస్థ-2018కి అనుగుణంగా ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను రూపొందించిందని వారిలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఉద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వారికి…

మంగళవారం నాడు ఐనవోలు మండలం లోని పున్నెలు,ఐనవోలు, కొండపర్తీ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు రైస్ మిల్లు యజమానులతో ఒప్పందం చేసుకొని వరి పంటను సాగు చేసుకోవాలని సూచించారు. యాసంగి లో దాన్యం కొనుగోలు ఉండబోవని స్పష్టం చేశారు. రైతులు ఆరుతడి పంటలు గా పొద్దుతిరుగుడు, శనగ, వేరుశెనగ, గోధుమ, పెసర మినుము వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. వ్యవసాయ భూములలో రైతులు ప్రతిసారి ఒకే రకం పంటలు పండించవద్దని…

సోమవారం నాడు సాయంత్రం పరకాల డివిజన్ కేంద్రంలో పరకాల శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి తో కలసి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్కాల కేంద్రంలో ఇంటెగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మణానికి సి ఏం ఎస్ గోదమ్, డాగ్ బంగ్లా వద్ద నున్న స్తలాన్ని పర్షిలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్ ను తనిఖీ చేసి, విక్రయదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రసూతి , ఆరోగ్య కేంద్రం ను తనిఖీ చేశారు. ఆసుపత్రి లో…

సోమవారం నాడు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి 58 వినతులు అందినట్లు తెలిపారు. రెవిన్యూ శాఖ 20, ఎస్సి కార్పొరేషన్ 6, డీఆర్డీఓ 5, 2బి హెచ్ కె 5, డిసిఎస్ ఓ 3, లేబర్ డిపార్ట్మెంట్ 4, ఇతర శాఖల కు సంబంధించి నవి15. ప్రజల నుండి వినతులను స్వీకరించి, వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. అర్జిలను వెంటనే పరిష్కరించాలని,…

సోమవారం నాడు ఉదయం ధర్మసాగర్ మండలంలోని మల్లక్ పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా యాసంగి లో వరి ధాన్యం కొనుగోలు కు అవకాశం లేనందున రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు. ఇందుకుగాను అనేక ప్రత్యామ్నాయ పంటలు ఉన్నాయని, ముఖ్యంగా మినుము, పెసర, చిరుధాన్యాల తో పాటు ,ఆయిల్ పామ్, కూరగాయల పంటల వైపు పెంపకాన్ని చేపట్టాలని చెప్పారు. ఆయిల్ పామ్ పెంపకం వల్ల…

శనివారం నాడు హనుమకొండ వరంగల్ కలక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు, కమీషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషీ పది కోర్టుల భవన సముదాయాలను ,పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్ట్ భవనాలకు 22 కోట్ల రూపాయల తో నిర్మిస్తున్నారని తెలిపారు. మిగిలిన పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. కోర్టు ఆవరణలో పలు రకాల మొక్కలు నాటాలని సూచించారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ఉండాలని…