Chief Secretary, Sri Somesh Kumar, IAS., held a Video Conference with district collectors

 

పత్రికా ప్రకటన                                                                తేది.05.06.2021

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్   జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులతో కలెక్టరేట్ కాంప్లెక్సెస్ నిర్మాణాల పూర్తి,  స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్, నూతన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు భూముల బదలాయింపు, ధరణికి సంబంధించిన విషయాలపై బిఆర్ కెఆర్ భవన్ నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  12 జిల్లాలో కలెక్టరేట్ కాంప్లేక్స్ ల ను వారంలో గా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మిగతా జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు.

 

స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల  నిర్మాణంకోసం TSIIC కి భూములు హ్యాండ్ ఓవర్ చేసేలా  చర్యలు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం ఇటీవల 7 జిల్లాలలో మంజూరు చేసిన నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం  కోసం గుర్తించిన భూమి కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాలని కలెక్టర్లను సి.యస్ ఆదేశించారు.

ధరణిలో పెండింగ్ మ్యుటేషన్లు,  భూవిషయాలకు సంబంధించిన గ్రీవియన్స్ మాడ్యూల్, ప్రొహిబిటరీ ప్రాపర్టీలలో సమర్పించిన ధరఖాస్తుల  పరిష్కార పురోగతిని సమీక్షించి,   జూన్ 9 లోగా పరిష్కరించి తద్వారా  ఆ రైతులు రైతుబంధు సహాయం పొందేలా చూడాలని ఆదేశించారు. స్పెషల్ ట్రిబ్యునల్ లో  పెండింగ్ కేసులకు సంబంధించి హియరింగ్ లను నిర్వహించాలన్నారు.

 

ఈ వీడియోకాన్ఫరెన్స్ లో  రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సి.ఐ.జి  శ్రీ వి. శేషాద్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వీ, SCDD సెక్రటరీ శ్రీ రాహుల్ బొజ్జా,  ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, Director Prohibition and Excise,  సర్ఫరాజ్ అహ్మద్, TSTS MD శ్రీ వెంకటేశ్వర్ రావు, CCLA Spl. Officer శ్రీమతి సత్యశారద, ENC శ్రీ గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————-

జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం

                             

 

Dt.05-06-2021

PRESS NOTE

 

As per the directions of the Chief Minister Sri K. Chandrashekar Rao, Chief Secretary,  Sri Somesh Kumar, IAS,  held a Video Conference with   District Collectors and other Senior officials on completion integrated collectorate complexes, handing of land for special food processing zones and  new medical /nursing colleges and issues related to Dharani  at BRKR Bhavan today.

Chief Secretary  directed  the District Collectors to complete collectorate complexes in 12 districts within a week and to be kept ready for inauguration. Construction of collectorate complexes in the remaining districts should be expedited.

 

Chief Secretary directed the Collectors to initiate process  for  handing over of  lands to TSIIC for taking up special food processing zones.  He also directed them to start process for handing over identified lands for the construction of new medical colleges in 7 districts recently sanctioned by the government.

Chief Secretary reviewed the progress of disposal of pending mutations, applications filed under grievances on land matters, prohibited properties  in Dharani and  instructed to complete all pendenciess by  9th of this month so as to enable the farmers  to get benefit under Rythu Bandhu.   Similarly hearings to be conducted in cases pending in  special tribunals.

Sri Sunil Sharma, Spl. Chief Secretary, TR&B, Sri Jayesh Ranjan, Prl. Secretary, ITE&C, Sri V. Seshadri,  CIG, Sri SAM Rizvi, Secretary, Health, Sri Ronald Rose, Spl. Secretary, Finance, Sri Rahul Bojja, Secretary, SCDD, Sri Sarfaraz Ahmad, Director Prohibition and Excise,  Sri Venkateshwar Rao, MD, TSTS, Smt. Satya Sharada, Spl. officer, CCLA, Sri Narasimha Reddy, MD. TSIIC, Dr. Ramesh Reddy, DME, Sri Ganapathi Reddy, ENC, R&B and other officials were present.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Share This Post