Chief Secretary Sri Somesh Kumar visited Golkonda Fort today and inspected arrangements being made for 15th August Independence Day Celebrations.

స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా గోల్కొండ కోట వద్ద చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ పరిశీలించారు. అధికారులు సమన్వయము తో వ్యవహారించి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని అదేశించారు. స్వాతంత్ర్యదినోత్సవాన్ని  పురస్కరించుకొని ఈ నెల 15  వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు  గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. వేదిక వద్దనే పోలీసు, GHMC, R&B, I&PR, సాంస్కృతిక , రెవెన్యూ శాఖల అధికారులతో   ఏర్పాట్లను సి. ఎస్. సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  అధికారులను ఆదేశించారు.

 

ఈ పర్యటనలో టిఆర్ అండ్ బి  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, పి ఆర్. కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయా , జి.హెచ్.యం.సి కమీషనర్ శ్రీ లోకేశ్ కుమార్ , అడిషనల్ డిజిపి (Law & Order) శ్రీ జితేందర్, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల CIG శ్రీ శేషాద్రి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్వేతా మహంతి,  హైదరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ అంజనీ కుమార్, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ శ్రీ అరవిందర్ సింగ్, I&PR విభాగం అదనపు డైరెక్టర్ శ్రీ నాగయ్య కాంబ్లే,  సాంస్కృతిక శాఖ  డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ మరియు ఇతర పోలీసు, GAD, GHMC అధికారులు పాల్గొన్నారు.

Share This Post