covid-19 వ్యాక్సినేషన్ పై , ఓమి క్రాన్ వైరస్ బారి నుండి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు , ధాన్యం కొనుగోలు కేంద్రాలు సంబంధిత విషయాలపై అత్యవసర ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

* ప్రచురణార్థం *
ములుగు జిల్లా
డిసెంబర్ 3 ( శుక్రవారం )

జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య శుక్రవారం రోజున కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో గతంలో covid-19 కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వపరంగా పరిహారం, covid-19 వ్యాక్సినేషన్ పై , ఓమి క్రాన్ వైరస్ బారి నుండి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు , ధాన్యం కొనుగోలు కేంద్రాలు సంబంధిత విషయాలపై
అత్యవసర ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి మాట్లాడారు.

1. Covid 19 కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వ పరంగా అందించే 50,000 వేల రూపాయల పరిహారం ,త్వరలోనే వారికి అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
2.. ఎవరైతే covid-19 మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోలేదో స్పెషల్ క్యాంపెయిన్ ద్వారా డోర్ టు డోర్ హెల్త్ టీం, విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ టీం విజిట్ చేస్తున్నారని ప్రజలందరూ వారికి సహకరించి వ్యాక్సినేషన్ వేసుకోవాలని సూచించారు , మొదటి డోస్ తీసుకున్న వారందరు తప్పక రెండవడోస్ తీసుకోవాలని , ఎవరైతే తీసుకోకుండా మిగిలిపోయారో వారందరు తప్పక వ్యాక్సిన్ తీసుకునేవిధంగా మోటివేషన్ చేయాలన్నారు వంద శాతం వ్యాక్సిన్ పూర్తి చేసి ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.
3.. దాన్యం కొనుగోలు కేంద్రాల పై కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 170 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని కొనుగోలు కేంద్రాల వద్ద వేయింగ్ మిషన్స్, గన్ని బ్యాగ్స్ మార్చ్ రైజర్ మీటర్స్, టార్పాలిన్ అందుబాటులో ఉంచామన్నారు. మార్చి రైజర్, తాలు శాతం కరెక్టుగా రైతులు ఎంత ధాన్యం తెచ్చినా కొనుగోలు చేస్తామని ఎవరు అధైర్యపడొద్దు అని భరోసా ఇచ్చారు.

3. మేడారం జాతర ఏర్పాట్లపై కలెక్టర్ మాట్లాడుతూ
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్త్రీ శిశు సంక్షేమ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి చొరవతో జాతర పనులకు సంబంధించి టెండర్స్ కంప్లీట్ అయి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని జంపన్న వాగు ప్రాంతాలలో ఇరిగేషన్ వర్క్స్ నడుస్తున్నాయని, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, సివిల్ వర్క్స్ గాను 40 కోట్ల 50 లక్షలు రూపాయల వ్యయంతో పనులకు శాంక్షన్ ఇచ్చామని భక్తుల సౌకర్యార్థం జనవరి 15
2022 సంవత్సరం నాటికి పనులన్నీ ఒక నెల ముందే కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు చేపట్టామన్నారు. భక్తులందరూ మేడారం జాతరకు తరలి వచ్చి ఆ సమ్మక్క-సారలమ్మ ఆశీస్సులు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
4.ఓమి క్రాన్ వేరియంట్ పై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సలహాలు సూచనలు పాటిస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ,ఒమి క్రాన్ వైరస్ గురించి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడమే ధ్యేయంగా మన జిల్లా ముందువరుసలో ఉండాలని కోరారు

Share This Post