CPRO GHMC – Sri Talasani Srinivas Yadav, Hon’ble Minister for Animal Husbandry, Sri Mohd. Mahmood Ali, Hon’ble Minister for Home, H.w.Mayor Smt. Gadwal Vijaya Laxmi, Hon’ble Dy. Mayor Smt. Srilatha Shoban Reddy and Commissioner held a review meeting with the Engineering officials on the desilting of Nalas in GHMC

                GREATER HYDERABAD MUNICIPAL CORPORATION

 PRESS RELEASE                                                                      11.06.2021.

 Hon’ble Minister for Animal Husbandry, Fisheries and Cinematography, Sri. T.Srinivas yadav,  Hon’ble Home Minister Sri.Mohammed Mahmood Ali, H.w.Mayor Smt. Gadwal Vijaya Laxmi  Hon’ble Dy.Mayor Smt. Srilatha Shoban Reddy and Commissioner held a review meeting with the Engineering officials on the desilting of Nalas in GHMC.

During the review meeting on the progress of desilting works, Hon’ble Minister Sri.T.Srinivas Yadav, instructed the officials to speed the desilting of nala works as the monsoon already entered in the state. Further, instructed ZC, DCs, CE, SEs, EEs to inspected the progress of works regularly,  in the field so that actual  progress of work can be seen and also it improves the work efficiency.

 Earlier, Commissioner GHMC Sri.Lokesh Kumar apprised to the  Hon’ble Ministers on desilting works that so far desilting works completed in 256 drains at an estimated cost of Rs.44.45 Cr with a target length of 221.04 Kms mechanically and 663.11 Kms manually (Total 884.15 Kms). As on 08.06.2021 830.4Kms 94% drains have been de-silted   620.17 Kms manually and 209.86 Kms mechanically.

    Hon’ble minister asked the officials to conduct a survey on encroachments all along nalas and lakes, so that they can be evacuated by rehabilitating them in 2BHk housing. Further the Hon’ble Minister suggested to prepare a plan and prepare estimates for permanent solution to prevent inundation,  instead of repeating the same works and wasting public money, also suggested to use latest machinery in desilting works where ever possible and minimize the deploying of man power, keeping in view of safety of workers , as it is not feasible in such works.

Hon’ble Minister informed it is proposed to conduct a work shop under the guidance of Hon’ble Minister Sri. K.Taraka Rama Rao  on nalas improvement and development, to prevent encroachments so that a good environment conditions prevails and  a liveable city for citizens.    CPRO, GHMC.

 Zonal Commissioners, Chief Engineers, Director EVDM, SEs, EEs and other higher officials attended the meeting.

CPRO, GHMC.

పత్రికాప్రకటన                                                                                 11.06.2021

జంట నగరాలలోని నాలాల పై  నిర్మించిన అక్రమ నిర్మాణాలకు పాల్పడిన  నిరుపేదలకు పునరావాసం కల్పిస్తూ నాలాల అభివృద్ధి పనులను చేపట్టేందుకు సమగ్ర ప్రణాళిక ను రూపొందించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ GHMC అధికారులను ఆదేశించారు. GHMC పరిధిలో నిర్వహిస్తున్న నాలాలలో పూడిక తొలగింపు పనుల పై శుక్రవారం GHMC ప్రధాన కార్యాలయంలో మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర హోం మంత్రి  మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, GHMC కమిషనర్ లోకేష్ కుమార్,  ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్, ఆయా జోనల్ కమిషనర్ లు, ఇంజనీరింగ్ విభాగం CE దేవానంద్, SNDP CE వసంత, SE లు, DE లు సమావేశంలో పాల్గొన్నారు. నాలాల పరివాహక ప్రాంతాలలో నిరుపేదలు చిన్న చిన్న ఇండ్లు నిర్మించుకావడంతో వర్షాకాలంలో వరద ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని, కావున వారికి ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించి అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఎన్ఫోర్ మెంట్ విభాగం చర్యలు తీసుకోవాలని   హైదరాబాదు నగరాన్ని సుందర నగరంగా తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో సహకరిస్తున్నారని, వినూత్నమైన ప్రణాలికలతో నగరాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేతృత్వంలో GHMC పరిధిలో పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు. నగరంలో వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణం, VDCC రోడ్ల నిర్మాణం, నూతన ప్లై ఓవర్ లు, అండర్ పాస్ లు, జంక్షన్ ల అభివృద్ధి, LED లైట్ల ఏర్పాటు, వైకుంఠ ధామాల అభివృద్ధి వంటి అనేక పనులను చేపడుతున్న ఘనత TRS ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి వివరించారు. అందులో భాగంగానే వర్షాకాలంలో నగరంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాలా లో పూడిక తొలగింపు పనుల కోసం దాదాపు 45 కోట్ల రూపాయలను ఖర్చు కేటాయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నెల నుండి ఇప్పటి వరకు ఆయా సర్కిల్స్ పరిధిలోని నాలా లో పూడిక తొలగింపు పనులు కొనసాగుతున్నాయని, దాదాపు 221 కిలోమీటర్ల మేరకు గాను 207 కిలోమీటర్ల లో దాదాపు 4.5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించినట్లు CE దేవానంద్ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రతి నాలా కు ఆయా AE ల ద్వారా బాద్యతలు అప్పగించి జియో ట్యాగింగ్ ద్వారా పూడిక తొలగింపు పనులను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఈ సమాచారాన్ని ఆయా EE లు, జోనల్ కమిషనర్ లకు, వాట్సప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం తో పాటు ప్రధాన కార్యాలయంలో ఒక మానిటరింగ్ సెల్ ద్వారా పనులను పర్యవేక్షించడం జరుగుతుందని ఆయన వివరించారు. గత డిసెంబర్ లో ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ పనులు చేపట్టాలనే విషయం పై సమగ్రమైన నివేదిక ను రూపొందించుకొని టెండర్ల ప్రక్రియ పూర్తీ చేసి పూర్తైన పిమ్మట జనవరి చివరి వారం నుండి ఆయా సర్కిల్స్ వారిగా పనులను ప్రారంభించినట్లు CE వివరించారు. ఆయా ప్రాంతాలలో అక్రమ నిర్మాణాల వల్ల వరద నీటి ప్రవాహానికి అంతరాయాలు ఏర్పడుతున్నాయని సమావేశంలో పాల్గొన్న పలువురు అధికారులు మంత్రుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ ఆయా ప్రాంతాల నుండి వస్తున్న పిర్యాడులకు అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ తగిన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ నెల 14 వ తేదీ సోమవారం నుండి వారాంతం వరకు ప్రతి అధికారి స్థానిక MLA, MLC, కార్పొరేటర్ వంటి ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆయన వివరించారు. ఈ వారం మొత్తం ఇంజనీరింగ్ అధికారులు ప్రధానంగా EE లు, SE లు, CE లు ఆయా ప్రాంతాలలోని నాలాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అంతేకాకుండా ఆయా నాలాల పరివాహక ప్రాంతాలలో ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించుకున్న  నిరుపేదల జాబితా ను రూపొందించి వారికి నగరంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో పునరావాసం కల్పించి నాలా అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవసరమైన సమగ్ర నివేదిక రూపొందించాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఏటా దాదాపు 45 కోట్ల రూపాయలు వెచ్చించి నాలాలలో పూడిక తొలగింపు పనులు చేపదుతున్నామని, దీనికి ప్రత్యామ్నాయంగా GHMC ఆధ్వర్యంలో నూతన సాంకేతికత తో కూడిన వాహనాలను కొనుగోలు చేసి GHMC అధికారుల ఆధ్వర్యంలోణే ఈ పూడిక తొలగింపు పనులు నిర్వహిస్తే బాగుంటుందని మత్న్రి అభిప్రాయపడ్డారు. సాంకేతిక వాహనాల లభ్యత పై అవసరమైతే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో పర్యటించి అద్యయనం చేసేందుకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ ఆధ్వర్యంలో సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీ ని ఏర్పాటు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ GHMC కమిషనర్ లోకేష్ కుమార్ ను ఆదేశించారు.  ఈ నాలాల పూడిక తొలగింపు పనులు, నాలాల నీటి మళ్లింపు, అభివృద్ధి, చెరువుల పరిరక్షణ తదితర అంశాలపై ఒకరోజు పూర్తిగా వర్క్ షాప్ ను మున్సిపల్ శాఖా మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో నిర్వహించుకుందామని మంత్రి వివరించారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరు లోగా చేపట్టాల్సిన పనులు, అవసరమైన నిధులు వంటి తదితర అన్ని అంశాలతో కూడిన సమగ్ర నివేదిక రూపొందించాలని మంత్రి వివరించారు. ఈ సందర్బంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ తాను అన్ని జోన్ ల పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని, కొన్ని ప్రాంతాలలో మాత్రం పిర్యాదులు వస్తున్నాయని ఆమె సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక అధికారులు ఆయా ప్రాంతాలలో పనులు జరిగే సమయంలో స్థానిక కార్పొరేటర్ లకు సమాచారం అందించాలని ఆమె సూచించారు. సమావేశంలో పాల్గొన్న హోం మంత్రి మాట్లాడుతూ ప్రధానంగా గత సంవత్సరం వర్షాకాలం సమయంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. అందులో భాగంగా నాలాలలో పూడిక తొలగింపు పై ప్రభుత్వం చిత్తశుద్ది తో కృషి చేస్తుందని  ఆయన వివరించారు.

Share This Post