సకాలంలో ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి
ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ నరసమ్మ సురభి
0000000
టి డి ఎస్ రిటర్న్స్ ను నిర్దేశించిన సమయంలోగా డి డి ఓ లు, ఉద్యోగులు సరైన పద్ధతిలో దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్ ప్రిన్సిపాల్ కమిషనర్ నర్సమ్మ సురభి అన్నారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో డ్రాయింగ్ అండ్ డిస్బెర్సుమెంట్ (డి డి ఓ ) అధికారులకు టీడీఎస్ నిబంధనలపై ఉదాహ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ ఆదాయపన్ను రిటర్న్ లను సకాలంలో దాఖలు చేయాలని అన్నారు. లేకుంటే సంబంధిత డిడిఒ లపై పెనాల్టీ పడుతుందన్నారు. ఉద్యోగులు తమ యొక్క వేతనాలపై నెల నెల ఎంత టాక్స్ పడుతుంది దానికనుగుణంగా టాక్స్ చెల్లింపులు చేయాలని, మూడు నెలలకు ఒకసారి ఈ ఫైలింగ్ చేయాలని సూచించారు. క్వార్టర్ ఫైలింగ్ ఈ నెల 31 చివరి తేదీ అన్నారు. టీ డీ స్ ఈ ఫైలింగ్ బాధ్యతాయుతంగా సరైన ప్రక్రియలో సకాలంలో చేయాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ఈమెయిల్ ద్వారా తెలియజేయవచ్చు అన్నారు. ఉద్యోగులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను ఫారం లో పొందుపరచిన ఇంటికిరాయా, పి హెచ్ తదితర ధ్రువపత్రాలు సరీగా ఉండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత డిడియోల పై ఉందన్నారు
ఇన్కమ్ టాక్స్ శాఖ డిప్యూటీ కమిషనర్ పి. కృష్ణ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ లో ఎన్నో తప్పులతో ఫైలింగ్ చేస్తున్నారని, అలా చేయకుండా సరిగ్గా ఫైలింగ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇన్ కమ్ టాక్స్ లోని 192,194-సి,194-హెచ్,194-జె,194 ఎల్ ఎ సెక్షన్ ల పై అవగాహన కల్పించారు. ఉద్యోగులు ఈ ఫైలింగ్ ను ఆలస్యంగా ఫైలింగ్ చేయకుండా నిర్ణీత సమయంలోగా
రిటర్నులు దాఖలు చేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మి, ఉప సంచాలకులు జిల్లా కోశాగారం కరీం నగర్, శ్రీనివాస్, ఏ టి ఓ రాజయ్య, డి డి ఓ లు, ఇన్కమ్ టాక్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.