Department of Horticulture – RKVY – Creating awareness to farmers on usage of safe chemicals on crops.

పత్రిక ప్రకటన

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, దేశంలోని వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ కమిటీల (APMC) కింద ఉన్న వివిధ మార్కెట్లు మరియు రైతు క్షేత్రాలలో కూరగాయలు, పండ్లు, మరియు ఇతర ఆహార పధార్ధాల నమూనాలలో పురుగుమందుల అవశేషాల స్థాయిని పరీక్షిస్తుంది. వివిధ ఆహరోత్పత్తుల్లో క్రిమిసంహారక మందుల అవశేషాలు  మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది మరియు దేశం యొక్క ఎగుమతి సామర్థ్యన్ని  పరిమితి చేస్తున్నాయి.

తెలంగాణ  రాష్ట్రంలో, జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ (NIPHM) మరియు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిధ్యాలయం (PJTSAU) సెప్టెంబర్ 2020 లో నిర్వహించిన పురుగుమందుల అవశేషాల విశ్లేషణ లో, (18) నమూనాలలో అనుమతించిన దానికంటే ఎక్కువ పురుగుమందుల అవశేషాలు మరియు (74) నమూనాలలో సధరు పంటలలో వాడకూడని (Off-label) పురుగుమందులు ఉన్నట్లు కనుగొన్నారు. ఉద్యాన పంటలైన మిరప, బెండ, కాలీఫ్లవర్, క్యాబేజి, ద్రాక్ష తోటల్లో క్రిమిసంహారక మందుల వాడకం ఎక్కువగా ఉంది.

ఆహార ఉత్పత్తులలో ఈ పురుగుమందుల అవశేషాలను నియంత్రించడానికి:

  • పంటలలో తెగుళ్ళు మరియు వ్యాధుల నివారణకు సమగ్ర యజమాన్యం విధానాన్ని పాటించాలి.
  • సిఫారసు చేసిన పురుగుమందులను, సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే వాడాలి.
  • పురుగుమందుల డబ్బా మీదున్న లేబుల్స్ మరియు కరపత్రాలపై ముద్రించిన సూచనలను పాటించాలి.
  • లైసెన్సు ఉండి రిజిస్టర్ చేసిన డీలరు దగ్గర కొనాలి.
  • కొనే ముందు రిజిస్టర్ నెంబర్, బ్యాచ్ నెంబర్, తయారీ తేది / తుది గడువు గమనించాలి.

 

పంటలపై పురుగుమందుల ప్రభావం కొన్ని రోజుల వరకు ఉంటుంది. కొన్ని మందులు 15 రోజుల వరకు పనిచేస్తాయి. ఆ తర్వాత కూడా వాటి అవశేషాలు ఉంటుంటాయి. కూరగాయలు, పండ్లును మందులను పిచికారి చేసిన వెంటనే కోయకూడదు. వినియోగదారులు వాడకం సమయంలో వాటిని ఉప్పు నీటిలో కడగటం మంచిది. అందువల్ల వాటిపై ఉన్న రసాయనాల తీవ్రత తగ్గుతుంది.

 

Sd/- L. Venkatram Reddy

Director of Horticulture

Share This Post