District Collector Vikarabad Press Note

పత్రిక ప్రకటన, తేది: 07.09.2021

జిల్లా రేడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఆక్సిజన్ కాన్సెంటేరేటర్ బ్యాంకును జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు నిఖిల ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సరైన మొతాదులో ఆక్సిజన్ అందని వారికి యంత్రాల ద్వారా ఇంటివద్దే ఆక్సిజన్ అందించే సదుపాయం ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేట్ కావాలసిన వారు ఆధార్ కార్డు మరియు డాక్టర్ రిఫరెన్స్ తో 9440248777, 9440002100 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. రెడ్ క్రాస్ సంస్థ సేవలు అభినందనీయమని ఈ సందర్బంగా కలెక్టర్ ప్రశంసించారు.
అనంతరం కలెక్టరేట్ ఉద్యోగులకు రెడ్ క్రాస్ సంస్థ అందించిన మాస్కులను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ Dr. భక్తవత్సలం, కార్యదర్శి సాయి చౌదరి, కోశాధికారి సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. DPRO /Vikarabad.

Share This Post